72. క్రీస్తుని పునఃర్వాక్కులు

( ఇది నాకేకాదు విశ్వాసులందరికి చెందును )


మనోవిచారముకూడదు నీకు - మహిమ తలంపులె కావలెను = దినక్రమాన శాంతి గుణంబులు - దీనులకిచ్చుచుందును || మనో ||

ఆదరణ

 1. ఆలస్యమైనంత మాత్రమున - అవి నెరవేర వనవద్దు = కాలము పరిపూర్ణంబుకాగా - ఖచ్చితముగ - అన్నియు నెరవేరును || మనో ||

 2. నిత్యానందము సత్యానందము - నీలోనే నేనమర్చితి = అత్యానందము అగపడుచుండును - ఆలోచించు చున్నా కొలది || మనో ||

 3. కోరవు నీకు కావలసినవి - ఊరకనె నీకిచ్చెదను = ధారళముగ నిచ్చుటకు నా ధననిధి - వస్తువులన్నియు గలవు || మనో ||

 4. నీరసపడకుము నీరసపడకుము - నీవె నా ఆస్తిగదా = నారక్తముతో సంపాదించితి - నన్ను నీ ఆస్తిగ గైకొనుము || మనో ||

 5. ఆనంద తైలముతో నిన్ను - అభిషేకించి యున్నాను = స్నానము ప్రభు భోజనము ప్రజలకు - జరుపుట సరియని అనుచున్నాను || మనో ||

 6. నీకు కావలసినవి అడుగుము - నేను తప్పక ఇచ్చెదను = నీకు ఇచ్చుట నాకానందము - నీవు అడుగుట ముచ్చట నాకు || మనో ||

 7. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకె అవి యుం డవుగా = లేకుండగ జేసెదను అప్పుడు - లేడివలె గంతులు వేయుదువు || మనో ||

 8. నీకవసరమైనవి కావలసిన - నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును = కాకుల కాజ్ఞ యిచ్చి ఏలి-యాకు ఆకలి తీర్చలేదా || మనో ||

 9. సైకిళ్ళు, స్టీమర్లు, బండ్లు - సంచారమునకు అవసరమా? = లోకులు కోరిన యెడల అవియు - నీకవి సుళువుగ లభియించు || మనో ||

 10. ఎండయు, చలియు, వానయు, గాలియు - ఏమియు చేయనేరవు నిన్ను = తిండికి - బట్టకు, బసకు, శుద్దికి - తీరికకు యేకొదువయె యుండదు || మనో ||

 11. జంతువు, పశువు, పురుగు, పక్షి - జబ్బు ఏమియు చేయవు నీకు = సంతోషముతో నా సందేశము - చాటగ అదియు - చాటుచు నుండును || మనో ||

 12. నీ బలహీనత తట్టు చూడకు - నాబలముతట్టిదిగో చూడుము = నీ బలమునకు మించిన పనులు - నాబలమేగదా - చేయవలసెను || మనో ||

 13. పాపివని నీకెవడు చెప్పెను - పావనుడవై యుండగను = శాప మరణరాదు నీకు - చావును చంపిన జేవము నేనే || మనో ||

 14. నా రూపలావణ్యములు - నీ రూపలావణ్యము లగును = నారక్తము ప్రతి నిమిషము నీలో - ధారగ ప్రవహించును అది జీవము || మనో ||

శత్రువులు

 1. నేను నీ కొరకు నీ యొద్ద - లేనప్పుడున్నాను = నేను కలుగ జేసిన సృష్టిలో - నుండుట నా కిస్టము కాదా || మనో ||

 2. నా దూతలు పరలోకపు శుద్ధులు - నరలోకమునందలి విశ్వాసులు - నా దరిని నిలిచి నీ కొరకు - నను ప్రార్ధింతురు ఏమి భయము || మనో ||

 3. శత్రువుల పత్రికాదులు నా - సన్నిధిలోనికి వచ్చినవి = స్తోత్రము చేయుము అపుడవి ధూళి - ధూళి క్రింద నెగురగొట్టి వేతును || మనో ||

 4. నీ హత్య వార్తకు జడియకుము - నిన్నది యేమి చేయగలదు ? = నా హస్తము తోడైయుండగ - దేహము ఆత్మ స్థిరముగ నుండును || మనో ||

 5. శత్రు పటాలముకన్న నీ - సైనికులే యెక్కువమంది = నేత్రాల్ తెరువబడిన ఎలీషా - నిజ సేవకునివలె చూతువు || మనో ||

 6. ఇదివరలో యెవ్వరును నాపై - యెదురు ప్రశ్నలు వేయనులేదు = ఇదివరలో నిర్భయముగ చనువుగ - నెవరును సలహా లీయను లేదు || మనో ||

 7. నిన్నెవరైనను ఏమియు అన్నను - నేను ఊరుకొందునా = నన్నన్నట్టె భావించుకొని - నరులకు తీర్పు విధింపనా || మనో ||

 8. యెవరేమియు నిన్నన్నను నీవు - ఏమియు అనకు, బెదరకు , వినకు = అవి విని ప్రార్ధించుము క్షమించుము - అశీర్వాద మిమ్ము మనసున || మనో ||

 9. పగవారి యత్నములు చూచి - పకపక నవ్వుచుండుము = తెగ నరుకునది నీలో యున్నది - లెమ్ము వాడుము శూరుని వలెనె || మనో ||

 10. పగవారు హాని చేయుటకై - పట్టుకొందురు అయినను నీవు = ఎగిరి పోవుదువు గనుక వారు యేమియు చేయలేరు నిన్ను || మనో ||

సైతాను

 1. వెలుగు దూతవలె సైతాను - కలలో మాటలాడును = పలుకును చూపును బట్టి అతనిని - పారదోలుము పారిపోవును || మనో ||

 2. సాతానును మృత్యువును పాపా - శాపాదులను గెలిచితిని = నా తర్వాత వీటిని గెల్వ - నా సభకు సత్తువ నిచ్చితిని || మనో ||

 3. నీకు తెలియకుండ నిన్ను - నేలను పడవేయును సాతాను = ఆ కార్యంబు నీ యపరాధ - మైయుండదు క్షమింతును నేను || మనో ||

 4. మరల ఆ స్థితి తట్టు నీవు - మరల రాదు మరలిన యెడల = బురదను కడిగిన జీవి మరల - బురదను పొరలిన దుస్థితియబ్బును || మనో ||

 5. పేతురు పడెను తనకు తెలియదు - కూత వినబడె కోడికూయగ = నా తట్టు చూచి విలపించెను - ఆ తరుణమందే క్షమించితి || మనో ||

 6. అవిశ్వాసులతో హత్తియుండకుము - అది నీకెంతయు అపాయము = ఇవి ఋజువులతో వివరించినను - ఎంత చెప్పినను నమ్మనె నమ్మరు || మనో ||

 7. వివిధములైన చెడుగులు మాని - వేయుచు నడుచు కొనవలెను = ఎవరైనను నను మాత్రమె ఆశ్ర - యించిన మోక్షములో చేర్చెదను || మనో ||

 8. నా మాటలు గల బైబిలు చొప్పున - నడుచుచు మాదిరి చూపుము = ఏ మానవునికైనను సరియె - యెంతయైనను బోధించుము || మనో ||

సేవ

 1. యెన్నో అద్భుతములు నీ చేత - యేసును స్వయముగ చేయింతు = సున్న చుట్టుదు వ్యతిరిక్తములకు చూచుకొనుము - నా శక్తి ప్రభావము || మనో ||

 2. నీ చేత మంచి పనులెన్నో - నేను చేయించుచున్నాను = ఈ చిత్రము నీకేమియు తెలియదు - ఇప్పుడే గంతులు వేయగలవు || మనో ||

 3. పనులు జరుగుట లేదని అనుకొన - వద్దు అనవద్దు మనమిద్దరము నందరము నా - పనిలో నుండగ ఫలమెట్లుండదు || మనో ||

 4. బహిరంగముగ ఫలితములు కన - బడకున్నవని అనవద్ధు = బహుగ అంతరంగమునందలి - ఫలములు నాకు కనబడుచున్నవి || మనో ||

 5. వాదములు కలహములు మాని - వరుసగ సత్యము వినవలెను = వాదము వలన బేధము పెరిగి - వరుసయె మొదలంటును చెడిపోవును || మనో ||

 6. ఎన్ని ప్రార్ధనలు చేసిన కొందరు - ఏమియు మారనే మారరుగా = ఖిన్నుడవై యుండకుము నీది - క్రీస్తుది నేరము కాదు కాదు || మనో ||

 7. ఎలియాజరును కార్యసిద్ధి - స్థలమునకు నడిపింప లేదా = తెలుపకుండనె - విశ్వాసులను తిన్నగ పనికి నడిపింప లేనా || మనో ||

 8. అన్ని భాషలలో నా వార్త - అందరికి అందింతువు = ఇన్ని భాషలు ఎక్కడ నేర్చి - కొన్నారని ప్రజలందురు || మనో ||

 9. పెంతెకొస్తు పండుగనాడాత్మ - పేతురాది శిష్యులకు = వింతగ నొక్క నిమిషములోనే - విదేశ బాషలు నేర్పలేదా || మనో ||

 10. నేను పనులు చెప్పిన వారికి - నేను సొమ్ము యిచ్చెదను = నేను చెప్పని పనులు నావి - యైనను చేసిన క్షమియించెదను || మనో ||

 11. పాపము పాప ఫలితము చెప్పి - భయపెట్టుట మంచిదె కాని = పాపులు చెదిరి పోవుదురు నా - పంచకు రానే రారు || మనో ||

 12. పడినను పడిపోతిననవద్దు - వడిగాలెమ్ము రమ్ము రమ్ము = పడినా నన్న సైతానుకు - వశము చాడిచెప్పును నాకు || మనో ||

 13. ముమ్మరముగ బోధించిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు = ముమ్మరముగ మేల్ చేసిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు || మనో ||

 14. నేను నీలో నీవు నాలో - లీనమైనట్టె యనుకొనుము = గాన నీకు లేని దేది - పోనిదేది రానిదేది || మనో ||

 15. సమస్త దేశములలో జీవ - సౌకర్యము కలుగును నీకు = అమాంతముగా దేశస్థులు నిన్ను - అన్ని చోట్ల కెత్తుకొనిపోదురు || మనో ||

 16. అక్షయ దేహము దాల్చితి నీవు - ఆనంద పడవేల = శిక్షలు రక్షణ సౌధములని - శీఘ్రముగ గ్రహింపవేల? || మనో ||

 17. అడిగిన వివిగో అని అన్నాను - అందుకొనక ఊరకనే యుంటివి = గడిచెను యిట్లు యెన్నో దినములు - కష్టములు తీరలేదు అయినను || మనో ||

 18. నీ వస్తువులను యెక్కడికైన - దేవ దూతలు కొనిపో గలరు = నీవు కోరిన వీలును బట్టి - నిన్ను కూడను కొనిపోగలరు || మనో ||

 19. ఎల్లవారిని రక్షించుటకు - ఎన్నో తిప్పలు పడుచున్నాను = అల్లరిగా మాట్లాడు కొందురు - అన్యులు ఈ సంగతి గ్రహింపక || మనో ||

 20. సంసోను బలము నీకిచ్చెద - సంతోషించుము సంతోషించుము = హింసలన్నియు ప్రోగుచేయుము ధ్వంసము చేయుము - ధ్వంసము చేయుము || మనో ||

 21. ఘనతయు కీర్తియు గలుగును నీకు - గానము చేయుము గానము చేయుము = వినయమును భూషణముగ దాల్చి - ఘనపర్చుము నా నామమంతట || మనో ||

 22. నిన్నాయాసపెట్టెడి వార్త - విన్నా బెదరకున్నా శాంతి = నన్నా సమయమందున నీ - కన్ను చూచుచున్న విశ్రాంతి || మనో ||

 23. నా బోధలు కొందరికి కొన్ని - నచ్చ జెప్పిన ముగియునా = మీ భూగోళ మంతటికి అవి - మిగుల త్వరగా పంపలేవా || మనో ||

 24. నేను నీ పాపములు క్షమింతును - గాని నరులు క్షమింతురా = గాన నీ తల వారి చేతుల - లోనికి వెళ్ళనీయరాదు || మనో ||

 25. నీ పాపముల తట్టు చూడను - నీలోనున్న ఆశను జూతును = పాప క్షమాపణ కొరకై వేడుము - నా పరిశుద్ధత వై పే - చూడుము || మనో ||

 26. ఆకాశము భూమియును పోయిన - నాకు పోయినదేమియు లేదు = నాకు నీవొక్కడవేయున్న - నాకు సమస్తమున్నట్టే || మనో ||

 27. నా యవతారమునకు మొందే - నీ అపరాధములు మోసితిని = నీ యతిక్రమాలు గెల్చితిని - నీకు బదులైనాను గనుక || మనో ||

 28. రక్షణ పత్రికలెన్నో కోట్లు - రాజ్యములన్నిట చల్లవలెన్ = శిక్ష ప్రజలకు తొలగింపుము నీ - సిద్ధాంత బోధనల వలన || మనో ||

 29. అర్థము కాని విషయములకు నీ - వాందోళన పడకు చింతింపకు = అర్థమైన సంగతులను బట్టి - ఆనందించుము అనుసరించుము || మనో ||

 30. నేను పరిహారంబు చేయ - లేని కీడు లేనే లేదు - నేను భువిలో దివిలో చేయలేని మేలు లేనే లేదు || మనో ||

 31. ప్రవచన రూపమందు పూర్వమె - ఇవి అన్నియును గెలిచితిని = భువికి వచ్చి బాహాటముగా ఇవి - యన్నియును గెలిచితిని || మనో ||

 32. గురువులలో భేదము గలదు అది - సరియగును సరికాకుండు = గురువుల కన్న గురుతులే గొప్ప - గురువువులె యనుచున్నాను || మనో ||

 33. నన్ను నమ్మి విద్య - నేర్చుకొన్న యెడల పండితులే = అన్నిటిలో నీ అపజయమే జయ - మగును జయమును జయమగును || మనో ||

 34. నమ్మని మృతుల సంగతి ఎందుకు - నా వశమందున్నారు వారు = ఇమ్మహినున్న వారికి చెప్పుము - నమ్మినను నమ్మక పోయినను || మనో ||

 35. నిన్ను రక్షించిన నేను నీ స్వ - జనులను కూడ రక్షింతు = కనిపెట్టి చూడుము నీ కందరి - ననుగ్రహింతు నద్భుత రీతి || మనో ||

 36. నా నావకు అందరు చేరువరకు - నీ వేల నిలువవలసినది = ఆవల ఆవలె నీవు వచ్చి - ఆ వారిని అర్పించుము నాకు || మనో ||

 37. అందరకుపదేశించిన రక్షణ - అందింతు వది నీకు జయము = అందుకొనక తృణీకరింతు - రది వారలకు అపజయము || మనో ||

 38. నా యందతిశయించు మపుడు - నాకు మహిమ నీకు మేలు = నీ యందతిశయించిన యెడల - నీకు కీడు నాకవమానము || మనో ||

 39. సమస్త దేశములందు నీకు - సదుపాయము లెన్నో యుండున్ = నమాధానము దానికి తోడుగ - సాగిపోవుచునే యుండును || మనో ||

 40. లక్షలాది వెదచల్లి చల్లి - బిక్షకులను పోషించెదవు = రక్షణ మార్గము చూపుము వారికి - శిక్ష మార్గము తప్పించెదవు || మనో ||

 41. పాపములున్న మనో విచారము - పనికి వచ్చును పనికి వచ్చును = పాపక్షమాపణ పొందినవెనుక - పనికి రాదు పనికి రాదు || మనో ||

 42. నీ మనవి విననందులకు - నా మీద కోపము పడవద్దు = నీ మేలునకే అట్లు చేసితిని - నామీద నీకుండుటకు || మనో ||

 43. మనో నిధానము కలిగి యుండిన - మనవులు సిద్ధముగా సిద్ధించు = మనో విచారము వలన మనవులు - మంటను కలిసి నశియించు || మనో ||

 44. అనుకొనుట విశ్వాసమైన - అగుపడదా నీ కంటికి = అనుకొన్నట్టి ఎలియాజరునకు - అగుపడలేదా కన్నియ రిబక్కా || మనో ||

 45. విచారమునకు సబబుగా నుండు - వేర్వేరు కారణములు గలవు = విచారణ చేయుచు నను చూచి - విదిల్చి వేసి సంతోషించుము || మనో ||

 46. షారోను పురము విశ్వాసుల - కారోహణ స్థలమగును తగును = చేరవలసిన వారు నేడే - చేరిన యెడల క్షేమంబు || మనో ||

 47. బోధలు పూర్తిగ వినగోరిన సం - బోధన లేకుండగనే రండి = శోధనలు కష్టములు ఉన్నను - శోధించి చూచుటకు రండి || మనో ||

 48. నేను దేవుడనని నను గూర్చి - నిజము చెప్పినవి భూతములు = గాన నీ సాక్ష్యములు నంత -కన్న ఎక్కువ కావలెను గదా || మనో ||

 49. పక్షులు నన్ను ప్రార్ధించునవి - బైబిలు గ్రంథమునందు గలదు = వృక్షములు నను స్తోత్రించునను - వృత్తాంతమును అందును గలదు || మనో ||

 50. గొప్ప కష్ట సుఖములు చెప్పు - కొని కోరి ప్రార్ధన చేయుదువా = అప్పుడు చిన్నవి కూడ చెప్పిన అవి మాత్రము విననా యేమి? || మనో ||

 51. నీ శరీరము నలిగి పోయిన - నా శరీరము కలదు నీకు = నీ శబ్దము నను రమ్మనకున్న - నీ యొద్దకు నేనే - వచ్చెదను || మనో ||

 52. నామూలమున హింస గలిగిన - ఆమోదించుము ఆనందించుము = క్షేమము కలుగును పరలోకమున - చిరకాల బహుమానము దొరకును || మనో ||

 53. నాడు నేడు రేపు ఇంకను - కీడును గెల్చు శూరుడను = వేడుకొని నమ్మిన యెడల యే - విన్నపమైనను ఆలకింతును || మనో ||

 54. సాతానుపై కట్టుకట్టిన - అతనిని బంధించి యుందు = భూతల వాసు లనేకు లాతని - బోధకు లొంగి పోయిరయ్యా || మనో ||

 55. (B) సాతానుపై కట్టుకట్టి - సర్వజనులు నను వేడిన యెడల = పాతాళమున మట్టు వుండని గోతిలో అతని ఇప్పుడే వేసెద || మనో ||

 56. నరులకు ఇంత ధన్యత తెచ్చిన - నన్ను నమ్మరు ఈ నరులు = దురిత మరణము నరకము - తెచ్చిన దూతను నమ్ముదురీ నరులు || మనో ||

 57. స్వస్థిశాలలు స్థాపన చేసిన - పాపులకు రోగులకు మేలు = వస్తున్న చందా సొమ్ము నా - పనులకు వాడుము ఆర్జింపకుము || మనో ||

 58. నరులకు సాధ్యము కానివి గలవు - నాకవి సాధ్యములగును గదా = పరులును నీ మది పలుకు పలుకులు - పాటింపక నిర్భయముగ నుండుము || మనో ||

 59. సోదెకత్తెయు యొక రోగిని నా పాదము నొద్దకు పంపె గదా = నీదరి నున్న వారినెల్ల నాదరికి పంపింప లేవా || మనో ||

 60. ఎక్కువ అద్భుతకరముగ నున్న - తక్కువయై పోవును విశ్వాసము = ఇక్కడ యిప్పుడు జరుగని వెందుకు - ఎవరికి గావలె ననవద్దు || మనో ||

 61. పేతురు నీ కడకె రోగులు బాగై - వేసిరి గంతులు సంతోషముతో = నా తలంపుతోనే రోగులు నయమై - గంతులు వేయరా? || మనో ||

 62. అక్షయ దేహము దాల్చితివిక్కడ - ఆనంద పడుట మానకు మీ = అక్షయ స్తుతి దీపమును శోధన - ఆర్పనీయ వద్దు వద్దు || మనో ||

 63. నా సింహాసన స్తుతిని నీవు -తీసికొనుట మంచిదికాదు నీ సంగతులు = స్తుతిగా కూర్చి - నీ తండ్రిని స్తుతించు చుండుము || మనో ||

 64. యావత్తు సృష్టి స్తుతించు - నని ప్రకటన పుస్తకమున నున్నది = ఈ విధ స్తుతి మూలముగా మాకు యెల్లకాలము జయమే ఉండును || మనో ||

 65. నీవు నన్ను ఎట్లు తలంతువో - నేను అట్లే కనబడుదున్ - భావ శుద్ధి చేసికొనగా - ప్రత్యక్షమగుదును స్పష్టముగ || మనో ||

 66. నను తలంచిన విధముగ నేను - కనబడి మాటలాడెదను = నను తలంపని వారికి కూడ - కనబడి మాటలాడెదను || మనో ||

 67. సిద్ధపరచితిని ఎన్నో నీకవి - సినిమాగా చూపించెదను = వద్దనక వందింతువు గనుక వందింతును నిన్ను నేనే || మనో ||

 68. ఎన్ని ప్రార్ధనలు చేసిన నా - యెదుట ఊరకె కనిపెట్టనిచో = ఎన్నడునుసత్యము సంతుష్టి - ఎరుగవు కనిపెట్టుము కనిపెట్టుము || మనో ||

 69. మోషే వేయించిన గుడార - మును పోలినది వేసెదవా = మోషేతో మాట్లాడిన విధముగ - మోదముతో నీతో - మాట్లాడెద || మనో ||

 70. నేను సృజించిన కొండలతోను - ప్రాణులతో వృక్షాదులతో = మానక మాటలాడుచు వాటి - మనవులు ఆలకింతును || మనో ||

రాకడ - సిద్ధపడుట

 1. వార్తాపత్రికలందు రాకడ - గుర్తులు తెలిసికొనగలవు = గుర్తులు తెలిసినయెడల భక్తుల - కూ డికలో సిద్ధపడగలవు || మనో ||

 2. నేటి గురుతులు రెండవరాకడ - నిజముగ వచ్చునని యనుచున్నవి = నాటి చరిత్ర కూడ నిజమని - నేటి గురుతులే ఋజువైయున్నవి || మనో ||

 3. సిద్దపడువారికి తోడ్పడుటకు - సిద్ధముగానే యున్నాను = సిద్ధ పడుదుమని గడిపిన ఇకను - సిద్ధము సిద్ధమె యనుచున్నాను || మనో ||

 4. నన్ను సిద్దముచేయుమనుచు - నరుడు అడిగిన తోడ్పడనా? = నన్ను నా వాక్యమును సభను - మన్నన చేసిన కొనిపోనా || మనో ||

 5. మనసున నెమ్మదిగాంచిన యెడల - మహి మ శరీరము దాల్చెదవు = అనుమానములను అణచివేయుచు - ఆయత్తము చేసెదను నిన్ను || మనో ||

 6. నేనువచ్చువరకు ఇచ్చట - నిలకడకలిగి నిలిచియుండుము = నేను వచ్చి రెప్పపాటు - లోనె నిన్ను కొనిపొయెదను || మనో ||

 7. నా రాకడకు ఎదురుచూడుము - నీరాకడకు ఎదురుచూతును నా రాకడయు నీ రాకడయు - నారాకడలో ఒకటే యగును || మనో ||

 8. సభను ప్రాణముతో కొనిపోవు - సమయము శీగ్రముగా వచ్చు = శుభవచన మిదియె నాసభకని - సుళువుగ భోదింపగవచ్చు || మనో ||

 9. వచ్చితినని నమ్మినవారలు ఇక - వచ్చెదనని నమ్మరు ఏలా? = వచ్చి అనేకులకు నేడు కన - బడుచున్నది నమ్మరు ఏల? || మనో ||

 10. తీరా వచ్చిన రెప్పపాటున - చేరగలరా మేఘములో = ధారుణిపై శేషించిన వారికి - కలుగు శ్రమలు సహించుదురా ? || మనో ||

 11. ఏలియా, యెహెజ్కేలు పిలిప్పు - ఎగిరి ప్రయాణము చేసినరీతి = గాలిలో ఆత్మ నిన్నుగూడ - గ్రక్కున కొనిపొవుట కష్టంబా || మనో ||

పరలోకము

 1. సిలువయె నీకిక్కడ గద్దె నా - సిలువయె దానిపైనుండు = సిలువలు రెండు నిన్ను పై గద్దెకు - సిద్దము చేయును యుద్ధ సమాప్తి || మనో ||

 2. ఇదివరకె పరలోకపుగద్దె - ఇచ్చివేసి యున్నాను నీకు = అది క్రియగా కనబడు పర్యంతము - ఆత్మ కంటితో చూచుచునుండుము || మనో ||

 3. నీవు నన్ను ఒప్పుకొని యు - న్నావని తండ్రికి చెప్పుదును = దేవదూతలు విని స్తుతి చేయగ - దివియంతయును - మ్రోగిపోవును || మనో ||

 4. దేవలోకమున దూతలోకమున - దివిలోకమున నేనే యుందును = నావలన రక్షణపొందిన నరులు - దూతలవలెనె యుందురు || మనో ||

 5. పరలోకమున తక్కువ చోటని - పరితాపము పొందుదురు కొందరు = సరియగు స్థితియని కంటి నీటిని - సరిగానే తుడిచి వేసెదను || మనో ||

 6. ప్రతిసేవకుని పనులెల్ల కన - పడకున్నవని అనవద్దు = మతికెప్పుడు తోచని గొప్ప బహు - మతులను అక్కడ అందింతు || మనో ||

 7. ఏమిచూచి నీ వసహ్యిచితివో - వానిని అక్కడ చూడవుగా వేనిని కోరితివో అవియు వే-రైనవి క్రొత్తవి అక్కడ చూతువు || మనో ||

రాకడ తర్వాత జరుగునవి

 1. సజీవ సంఘారోహణ మప్పుడు - జరుగును విందు ఏడేండ్లు = ప్రజేతర సంఘము బహుశ్రమల - పాలైపోవును ఎంతో దు:ఖము || మనో ||

 2. బిలమందలి సాతానును నేను - వుడుదలచేసెద నప్పుడతడు = ఇలపైనాతో యుద్ధముచేసి - గెలువలేక నరకము పాలగును || మనో ||

 3. ఇప్పుడు కాదు నా శుభవార్త - ఇలయంతట ప్రకటనయగును = అప్పుడు వెయ్యియేండ్ల కాల - మందు వెంటనే అంతము వచ్చును || మనో ||

 4. సేవ ముగింపకముందే మొక్షము - చేర వలసెనన వద్దు = భావిని ఎక్కువకాలము ఎక్కువ - సేవ చేసెదవు ఇది నా పద్దు || మనో ||

 5. భూగోళమంతట నా - బోధయు ఆరాధనయు నగును = నా గుళ్ళు పరలోకపు మహిమ - తో గనగన మని వెలుగుచుండును || మనో ||

 6. నరకమున బడు వారిని జూచి - పరిశుద్ధాత్మ విలపించున్ - నరుల ఆదరణయగు తండ్రిన్ - నరులెట్లాదరింప గలరు || మనో ||

 7. నరులు నా కృప కాలమంతయు - పరిత్యజించి వేసినారు = ఎరి గియు శిక్షకులోనైనందున - ఎల్లకాలము నాకే జయము || మనో ||

 8. భూమిపై సైతానును అతని - పురుగే లేకుండ చేసెదను = నా మనుష్యులే ఉందురు వారి-నడుమ నివాసము చేసెదను || మనో ||

బైబిలు మిషను

 1. భూలోకమంతటికి సువార్త - పోవుట కిండియా ప్రధానము = పై లోకంబు నుండి వచ్చిన - బైబిలు మిషను ను ఎత్తి చూపుము || మనో ||

 2. నేను చెప్పగ బైబిలు మిషను - లోనికి వచ్చిన క్షేమములు = జ్ఞానము మనస్సాక్షియును చెప్పిన - నేనేమియు ఆటంకము చేయను || మనో ||

 3. నేను రమ్మనగ వచ్చి ఏ - వాని కడకు పోరాదు = నా నియమిత కార్యములు మాత్రమె - నడుపుము మానుకొనరాదు || మనో ||

 4. బైబిలు మిషనును నేను బైలు - పరచిన సంగతి నమ్మనివారు = ప్రాబల్య బోధలు విని నన్ను - ప్రార్ధన జేసి కనుగొన రాదా || మనో ||

 5. క్రొత్త విషయములు లేనిదె ఈ - క్రొత్త మిషను ఎందుకు రావలెను = క్రొత్తవి రాగా అన్ని మిషనులు - గొప్పగ పెరిగి మేఘంబెక్కును || మనో ||

 6. అందరికి కనబడి మాట్లాడుదు - ననుటయె ఈ మిషను విశ్వాసము = కొందరి బోధలు వేరుగ నుండును - అందుకె మాటలాడను నేను || మనో ||

 7. నీ జన్మ దినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టియుంటి = ఈ జగతికి నీవు రాగానే - ఎంతో ఆనందించి యుంటి || మనో ||

 8. ఈ కీర్తన నాకే నాకే యని - ఎవరన గలరో వారికే చెల్లును = ఈ కాలమునకు తగినవి చెప్పితి - యెరిగి సహించు కొనదగును || మనో ||

 9. జనక సుతాత్మలను త్రైకునికి - సంస్తుతులు అని అనుకొనుము = అను దినము నీ యాత్మీయ జీ - వనము వృద్ధి యగును నమ్ముము || మనో ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


72. kreestuni puna@hrvaakkulu

( idi naakaekaadu viSvaasulaMdariki cheMdunu )


manOvichaaramukooDadu neeku - mahima talaMpule kaavalenu = dinakramaana SaaMti guNaMbulu - deenulakichchuchuMdunu || manO ||

aadaraNa

 1. aalasyamainaMta maatramuna - avi neravaera vanavaddu = kaalamu paripoorNaMbukaagaa - khachchitamuga - anniyu neravaerunu || manO ||

 2. nityaanaMdamu satyaanaMdamu - neelOnae naenamarchiti = atyaanaMdamu agapaDuchuMDunu - aalOchiMchu chunnaa koladi || manO ||

 3. kOravu neeku kaavalasinavi - oorakane neekichchedanu = dhaaraLamuga nichchuTaku naa dhananidhi - vastuvulanniyu galavu || manO ||

 4. neerasapaDakumu neerasapaDakumu - neeve naa aastigadaa = naaraktamutO saMpaadiMchiti - nannu nee aastiga gaikonumu || manO ||

 5. aanaMda tailamutO ninnu - abhishaekiMchi yunnaanu = snaanamu prabhu bhOjanamu prajalaku - jarupuTa sariyani anuchunnaanu || manO ||

 6. neeku kaavalasinavi aDugumu - naenu tappaka ichchedanu = neeku ichchuTa naakaanaMdamu - neevu aDuguTa muchchaTa naaku || manO ||

 7. nee kashTamulu nee kOrikalu naakeruke avi yuM Davugaa = laekuMDaga jaesedanu appuDu - laeDivale gaMtulu vaeyuduvu || manO ||

 8. neekavasaramainavi kaavalasina - nikhila vastuvula kaaj~naapiMtunu = kaakula kaaj~na yichchi aeli-yaaku aakali teerchalaedaa || manO ||

 9. saikiLLu, sTeemarlu, baMDlu - saMchaaramunaku avasaramaa? = lOkulu kOrina yeDala aviyu - neekavi suLuvuga labhiyiMchu || manO ||

 10. eMDayu, chaliyu, vaanayu, gaaliyu - aemiyu chaeyanaeravu ninnu = tiMDiki - baTTaku, basaku, Suddiki - teerikaku yaekoduvaye yuMDadu || manO ||

 11. jaMtuvu, paSuvu, purugu, pakshi - jabbu aemiyu chaeyavu neeku = saMtOshamutO naa saMdaeSamu - chaaTaga adiyu - chaaTuchu nuMDunu || manO ||

 12. nee balaheenata taTTu chooDaku - naabalamutaTTidigO chooDumu = nee balamunaku miMchina panulu - naabalamaegadaa - chaeyavalasenu || manO ||

 13. paapivani neekevaDu cheppenu - paavanuDavai yuMDaganu = Saapa maraNaraadu neeku - chaavunu chaMpina jaevamu naenae || manO ||

 14. naa roopalaavaNyamulu - nee roopalaavaNyamu lagunu = naaraktamu prati nimishamu neelO - dhaaraga pravahiMchunu adi jeevamu || manO ||

Satruvulu

 1. naenu nee koraku nee yodda - laenappuDunnaanu = naenu kaluga jaesina sRshTilO - nuMDuTa naa kisTamu kaadaa || manO ||

 2. naa dootalu paralOkapu Suddhulu - naralOkamunaMdali viSvaasulu - naa darini nilichi nee koraku - nanu praardhiMturu aemi bhayamu || manO ||

 3. Satruvula patrikaadulu naa - sannidhilOniki vachchinavi = stOtramu chaeyumu apuDavi dhooLi - dhooLi kriMda neguragoTTi vaetunu || manO ||

 4. nee hatya vaartaku jaDiyakumu - ninnadi yaemi chaeyagaladu ? = naa hastamu tODaiyuMDaga - daehamu aatma sthiramuga nuMDunu || manO ||

 5. Satru paTaalamukanna nee - sainikulae yekkuvamaMdi = naetraal^ teruvabaDina eleeshaa - nija saevakunivale chootuvu || manO ||

 6. idivaralO yevvarunu naapai - yeduru praSnalu vaeyanulaedu = idivaralO nirbhayamuga chanuvuga - nevarunu salahaa leeyanu laedu || manO ||

 7. ninnevarainanu aemiyu annanu - naenu oorukoMdunaa = nannannaTTe bhaaviMchukoni - narulaku teerpu vidhiMpanaa || manO ||

 8. yevaraemiyu ninnannanu neevu - aemiyu anaku, bedaraku , vinaku = avi vini praardhiMchumu kshamiMchumu - aSeervaada mimmu manasuna || manO ||

 9. pagavaari yatnamulu choochi - pakapaka navvuchuMDumu = tega narukunadi neelO yunnadi - lemmu vaaDumu Sooruni valene || manO ||

 10. pagavaaru haani chaeyuTakai - paTTukoMduru ayinanu neevu = egiri pOvuduvu ganuka vaaru yaemiyu chaeyalaeru ninnu || manO ||

saitaanu

 1. velugu dootavale saitaanu - kalalO maaTalaaDunu = palukunu choopunu baTTi atanini - paaradOlumu paaripOvunu || manO ||

 2. saataanunu mRtyuvunu paapaa - Saapaadulanu gelichitini = naa tarvaata veeTini gelva - naa sabhaku sattuva nichchitini || manO ||

 3. neeku teliyakuMDa ninnu - naelanu paDavaeyunu saataanu = aa kaaryaMbu nee yaparaadha - maiyuMDadu kshamiMtunu naenu || manO ||

 4. marala aa sthiti taTTu neevu - marala raadu maralina yeDala = buradanu kaDigina jeevi marala - buradanu poralina dusthitiyabbunu || manO ||

 5. paeturu paDenu tanaku teliyadu - koota vinabaDe kODikooyaga = naa taTTu choochi vilapiMchenu - aa taruNamaMdae kshamiMchiti || manO ||

 6. aviSvaasulatO hattiyuMDakumu - adi neekeMtayu apaayamu = ivi RjuvulatO vivariMchinanu - eMta cheppinanu nammane nammaru || manO ||

 7. vividhamulaina cheDugulu maani - vaeyuchu naDuchu konavalenu = evarainanu nanu maatrame aaSra - yiMchina mOkshamulO chaerchedanu || manO ||

 8. naa maaTalu gala baibilu choppuna - naDuchuchu maadiri choopumu = ae maanavunikainanu sariye - yeMtayainanu bOdhiMchumu || manO ||

saeva

 1. yennO adbhutamulu nee chaeta - yaesunu svayamuga chaeyiMtu = sunna chuTTudu vyatiriktamulaku choochukonumu - naa Sakti prabhaavamu || manO ||

 2. nee chaeta maMchi panulennO - naenu chaeyiMchuchunnaanu = ee chitramu neekaemiyu teliyadu - ippuDae gaMtulu vaeyagalavu || manO ||

 3. panulu jaruguTa laedani anukona - vaddu anavaddu manamiddaramu naMdaramu naa - panilO nuMDaga phalameTluMDadu || manO ||

 4. bahiraMgamuga phalitamulu kana - baDakunnavani anavaddhu = bahuga antaraMgamunaMdali - phalamulu naaku kanabaDuchunnavi || manO ||

 5. vaadamulu kalahamulu maani - varusaga satyamu vinavalenu = vaadamu valana baedhamu perigi - varusaye modalaMTunu cheDipOvunu || manO ||

 6. enni praardhanalu chaesina koMdaru - aemiyu maaranae maararugaa = khinnuDavai yuMDakumu needi - kreestudi naeramu kaadu kaadu || manO ||

 7. eliyaajarunu kaaryasiddhi - sthalamunaku naDipiMpa laedaa = telupakuMDane - viSvaasulanu tinnaga paniki naDipiMpa laenaa || manO ||

 8. anni bhaashalalO naa vaarta - aMdariki aMdiMtuvu = inni bhaashalu ekkaDa naerchi - konnaarani prajalaMduru || manO ||

 9. peMtekostu paMDuganaaDaatma - paeturaadi Sishyulaku = viMtaga nokka nimishamulOnae - vidaeSa baashalu naerpalaedaa || manO ||

 10. naenu panulu cheppina vaariki - naenu sommu yichchedanu = naenu cheppani panulu naavi - yainanu chaesina kshamiyiMchedanu || manO ||

 11. paapamu paapa phalitamu cheppi - bhayapeTTuTa maMchide kaani = paapulu chediri pOvuduru naa - paMchaku raanae raaru || manO ||

 12. paDinanu paDipOtinanavaddu - vaDigaalemmu rammu rammu = paDinaa nanna saitaanuku - vaSamu chaaDicheppunu naaku || manO ||

 13. mummaramuga bOdhiMchina balavaM - tammuga prajalanu taegalavu = mummaramuga mael^ chaesina balavaM - tammuga prajalanu taegalavu || manO ||

 14. naenu neelO neevu naalO - leenamainaTTe yanukonumu = gaana neeku laeni daedi - pOnidaedi raanidaedi || manO ||

 15. samasta daeSamulalO jeeva - saukaryamu kalugunu neeku = amaaMtamugaa daeSasthulu ninnu - anni chOTla kettukonipOduru || manO ||

 16. akshaya daehamu daalchiti neevu - aanaMda paDavaela = Sikshalu rakshaNa saudhamulani - Seeghramuga grahiMpavaela? || manO ||

 17. aDigina vivigO ani annaanu - aMdukonaka oorakanae yuMTivi = gaDichenu yiTlu yennO dinamulu - kashTamulu teeralaedu ayinanu || manO ||

 18. nee vastuvulanu yekkaDikaina - daeva dootalu konipO galaru = neevu kOrina veelunu baTTi - ninnu kooDanu konipOgalaru || manO ||

 19. ellavaarini rakshiMchuTaku - ennO tippalu paDuchunnaanu = allarigaa maaTlaaDu koMduru - anyulu ee saMgati grahiMpaka || manO ||

 20. saMsOnu balamu neekichcheda - saMtOshiMchumu saMtOshiMchumu = hiMsalanniyu prOguchaeyumu dhvaMsamu chaeyumu - dhvaMsamu chaeyumu || manO ||

 21. ghanatayu keertiyu galugunu neeku - gaanamu chaeyumu gaanamu chaeyumu = vinayamunu bhooshaNamuga daalchi - ghanaparchumu naa naamamaMtaTa || manO ||

 22. ninnaayaasapeTTeDi vaarta - vinnaa bedarakunnaa SaaMti = nannaa samayamaMduna nee - kannu choochuchunna viSraaMti || manO ||

 23. naa bOdhalu koMdariki konni - nachcha jeppina mugiyunaa = mee bhoogOLa maMtaTiki avi - migula tvaragaa paMpalaevaa || manO ||

 24. naenu nee paapamulu kshamiMtunu - gaani narulu kshamiMturaa = gaana nee tala vaari chaetula - lOniki veLLaneeyaraadu || manO ||

 25. nee paapamula taTTu chooDanu - neelOnunna aaSanu jootunu = paapa kshamaapaNa korakai vaeDumu - naa pariSuddhata vai pae - chooDumu || manO ||

 26. aakaaSamu bhoomiyunu pOyina - naaku pOyinadaemiyu laedu = naaku neevokkaDavaeyunna - naaku samastamunnaTTae || manO ||

 27. naa yavataaramunaku moMdae - nee aparaadhamulu mOsitini = nee yatikramaalu gelchitini - neeku badulainaanu ganuka || manO ||

 28. rakshaNa patrikalennO kOTlu - raajyamulanniTa challavalen^ = Siksha prajalaku tolagiMpumu nee - siddhaaMta bOdhanala valana || manO ||

 29. arthamu kaani vishayamulaku nee - vaaMdOLana paDaku chiMtiMpaku = arthamaina saMgatulanu baTTi - aanaMdiMchumu anusariMchumu || manO ||

 30. naenu parihaaraMbu chaeya - laeni keeDu laenae laedu - naenu bhuvilO divilO chaeyalaeni maelu laenae laedu || manO ||

 31. pravachana roopamaMdu poorvame - ivi anniyunu gelichitini = bhuviki vachchi baahaaTamugaa ivi - yanniyunu gelichitini || manO ||

 32. guruvulalO bhaedamu galadu adi - sariyagunu sarikaakuMDu = guruvula kanna gurutulae goppa - guruvuvule yanuchunnaanu || manO ||

 33. nannu nammi vidya - naerchukonna yeDala paMDitulae = anniTilO nee apajayamae jaya - magunu jayamunu jayamagunu || manO ||

 34. nammani mRtula saMgati eMduku - naa vaSamaMdunnaaru vaaru = immahinunna vaariki cheppumu - namminanu nammaka pOyinanu || manO ||

 35. ninnu rakshiMchina naenu nee sva - janulanu kooDa rakshiMtu = kanipeTTi chooDumu nee kaMdari - nanugrahiMtu nadbhuta reeti || manO ||

 36. naa naavaku aMdaru chaeruvaraku - nee vaela niluvavalasinadi = aavala aavale neevu vachchi - aa vaarini arpiMchumu naaku || manO ||

 37. aMdarakupadaeSiMchina rakshaNa - aMdiMtu vadi neeku jayamu = aMdukonaka tRNeekariMtu - radi vaaralaku apajayamu || manO ||

 38. naa yaMdatiSayiMchu mapuDu - naaku mahima neeku maelu = nee yaMdatiSayiMchina yeDala - neeku keeDu naakavamaanamu || manO ||

 39. samasta daeSamulaMdu neeku - sadupaayamu lennO yuMDun^ = namaadhaanamu daaniki tODuga - saagipOvuchunae yuMDunu || manO ||

 40. lakshalaadi vedachalli challi - bikshakulanu pOshiMchedavu = rakshaNa maargamu choopumu vaariki - Siksha maargamu tappiMchedavu || manO ||

 41. paapamulunna manO vichaaramu - paniki vachchunu paniki vachchunu = paapakshamaapaNa poMdinavenuka - paniki raadu paniki raadu || manO ||

 42. nee manavi vinanaMdulaku - naa meeda kOpamu paDavaddu = nee maelunakae aTlu chaesitini - naameeda neekuMDuTaku || manO ||

 43. manO nidhaanamu kaligi yuMDina - manavulu siddhamugaa siddhiMchu = manO vichaaramu valana manavulu - maMTanu kalisi naSiyiMchu || manO ||

 44. anukonuTa viSvaasamaina - agupaDadaa nee kaMTiki = anukonnaTTi eliyaajarunaku - agupaDalaedaa kanniya ribakkaa || manO ||

 45. vichaaramunaku sababugaa nuMDu - vaervaeru kaaraNamulu galavu = vichaaraNa chaeyuchu nanu choochi - vidilchi vaesi saMtOshiMchumu || manO ||

 46. shaarOnu puramu viSvaasula - kaarOhaNa sthalamagunu tagunu = chaeravalasina vaaru naeDae - chaerina yeDala kshaemaMbu || manO ||

 47. bOdhalu poortiga vinagOrina saM - bOdhana laekuMDaganae raMDi = SOdhanalu kashTamulu unnanu - SOdhiMchi choochuTaku raMDi || manO ||

 48. naenu daevuDanani nanu goorchi - nijamu cheppinavi bhootamulu = gaana nee saakshyamulu naMta -kanna ekkuva kaavalenu gadaa || manO ||

 49. pakshulu nannu praardhiMchunavi - baibilu graMthamunaMdu galadu = vRkshamulu nanu stOtriMchunanu - vRttaaMtamunu aMdunu galadu || manO ||

 50. goppa kashTa sukhamulu cheppu - koni kOri praardhana chaeyuduvaa = appuDu chinnavi kooDa cheppina avi maatramu vinanaa yaemi? || manO ||

 51. nee Sareeramu naligi pOyina - naa Sareeramu kaladu neeku = nee Sabdamu nanu rammanakunna - nee yoddaku naenae - vachchedanu || manO ||

 52. naamoolamuna hiMsa galigina - aamOdiMchumu aanaMdiMchumu = kshaemamu kalugunu paralOkamuna - chirakaala bahumaanamu dorakunu || manO ||

 53. naaDu naeDu raepu iMkanu - keeDunu gelchu SooruDanu = vaeDukoni nammina yeDala yae - vinnapamainanu aalakiMtunu || manO ||

 54. saataanupai kaTTukaTTina - atanini baMdhiMchi yuMdu = bhootala vaasu lanaeku laatani - bOdhaku loMgi pOyirayyaa || manO ||

 55. (B) saataanupai kaTTukaTTi - sarvajanulu nanu vaeDina yeDala = paataaLamuna maTTu vuMDani gOtilO atani ippuDae vaeseda || manO ||

 56. narulaku iMta dhanyata techchina - nannu nammaru ee narulu = durita maraNamu narakamu - techchina dootanu nammuduree narulu || manO ||

 57. svasthiSaalalu sthaapana chaesina - paapulaku rOgulaku maelu = vastunna chaMdaa sommu naa - panulaku vaaDumu aarjiMpakumu || manO ||

 58. narulaku saadhyamu kaanivi galavu - naakavi saadhyamulagunu gadaa = parulunu nee madi paluku palukulu - paaTiMpaka nirbhayamuga nuMDumu || manO ||

 59. sOdekatteyu yoka rOgini naa paadamu noddaku paMpe gadaa = needari nunna vaarinella naadariki paMpiMpa laevaa || manO ||

 60. ekkuva adbhutakaramuga nunna - takkuvayai pOvunu viSvaasamu = ikkaDa yippuDu jarugani veMduku - evariki gaavale nanavaddu || manO ||

 61. paeturu nee kaDake rOgulu baagai - vaesiri gaMtulu saMtOshamutO = naa talaMputOnae rOgulu nayamai - gaMtulu vaeyaraa? || manO ||

 62. akshaya daehamu daalchitivikkaDa - aanaMda paDuTa maanaku mee = akshaya stuti deepamunu SOdhana - aarpaneeya vaddu vaddu || manO ||

 63. naa siM haasana stutini neevu -teesikonuTa maMchidikaadu nee saMgatulu = stutigaa koorchi - nee taMDrini stutiMchu chuMDumu || manO ||

 64. yaavattu sRshTi stutiMchu - nani prakaTana pustakamuna nunnadi = ee vidha stuti moolamugaa maaku yellakaalamu jayamae uMDunu || manO ||

 65. neevu nannu eTlu talaMtuvO - naenu aTlae kanabaDudun^ - bhaava Suddhi chaesikonagaa - pratyakshamagudunu spashTamuga || manO ||

 66. nanu talaMchina vidhamuga naenu - kanabaDi maaTalaaDedanu = nanu talaMpani vaariki kooDa - kanabaDi maaTalaaDedanu || manO ||

 67. siddhaparachitini ennO neekavi - sinimaagaa choopiMchedanu = vaddanaka vaMdiMtuvu ganuka vaMdiMtunu ninnu naenae || manO ||

 68. enni praardhanalu chaesina naa - yeduTa oorake kanipeTTanichO = ennaDunusatyamu saMtushTi - erugavu kanipeTTumu kanipeTTumu || manO ||

 69. mOshae vaeyiMchina guDaara - munu pOlinadi vaesedavaa = mOshaetO maaTlaaDina vidhamuga - mOdamutO neetO - maaTlaaDeda || manO ||

 70. naenu sRjiMchina koMDalatOnu - praaNulatO vRkshaadulatO = maanaka maaTalaaDuchu vaaTi - manavulu aalakiMtunu || manO ||

raakaDa - siddhapaDuTa

 1. vaartaapatrikalaMdu raakaDa - gurtulu telisikonagalavu = gurtulu telisinayeDala bhaktula - koo DikalO siddhapaDagalavu || manO ||

 2. naeTi gurutulu reMDavaraakaDa - nijamuga vachchunani yanuchunnavi = naaTi charitra kooDa nijamani - naeTi gurutulae Rjuvaiyunnavi || manO ||

 3. siddapaDuvaariki tODpaDuTaku - siddhamugaanae yunnaanu = siddha paDudumani gaDipina ikanu - siddhamu siddhame yanuchunnaanu || manO ||

 4. nannu siddamuchaeyumanuchu - naruDu aDigina tODpaDanaa? = nannu naa vaakyamunu sabhanu - mannana chaesina konipOnaa || manO ||

 5. manasuna nemmadigaaMchina yeDala - mahi ma Sareeramu daalchedavu = anumaanamulanu aNachivaeyuchu - aayattamu chaesedanu ninnu || manO ||

 6. naenuvachchuvaraku ichchaTa - nilakaDakaligi nilichiyuMDumu = naenu vachchi reppapaaTu - lOne ninnu konipoyedanu || manO ||

 7. naa raakaDaku eduruchooDumu - neeraakaDaku eduruchootunu naa raakaDayu nee raakaDayu - naaraakaDalO okaTae yagunu || manO ||

 8. sabhanu praaNamutO konipOvu - samayamu Seegramugaa vachchu = Subhavachana midiye naasabhakani - suLuvuga bhOdiMpagavachchu || manO ||

 9. vachchitinani namminavaaralu ika - vachchedanani nammaru aelaa? = vachchi anaekulaku naeDu kana - baDuchunnadi nammaru aela? || manO ||

 10. teeraa vachchina reppapaaTuna - chaeragalaraa maeghamulO = dhaaruNipai SaeshiMchina vaariki - kalugu Sramalu sahiMchuduraa ? || manO ||

 11. aeliyaa, yehejkaelu pilippu - egiri prayaaNamu chaesinareeti = gaalilO aatma ninnugooDa - grakkuna konipovuTa kashTaMbaa || manO ||

paralOkamu

 1. siluvaye neekikkaDa gadde naa - siluvaye daanipainuMDu = siluvalu reMDu ninnu pai gaddeku - siddamu chaeyunu yuddha samaapti || manO ||

 2. idivarake paralOkapugadde - ichchivaesi yunnaanu neeku = adi kriyagaa kanabaDu paryaMtamu - aatma kaMTitO choochuchunuMDumu || manO ||

 3. neevu nannu oppukoni yu - nnaavani taMDriki cheppudunu = daevadootalu vini stuti chaeyaga - diviyaMtayunu - mrOgipOvunu || manO ||

 4. daevalOkamuna dootalOkamuna - divilOkamuna naenae yuMdunu = naavalana rakshaNapoMdina narulu - dootalavalene yuMduru || manO ||

 5. paralOkamuna takkuva chOTani - paritaapamu poMduduru koMdaru = sariyagu sthitiyani kaMTi neeTini - sarigaanae tuDichi vaesedanu || manO ||

 6. pratisaevakuni panulella kana - paDakunnavani anavaddu = matikeppuDu tOchani goppa bahu - matulanu akkaDa aMdiMtu || manO ||

 7. aemichoochi nee vasahyichitivO - vaanini akkaDa chooDavugaa vaenini kOritivO aviyu vae-rainavi krottavi akkaDa chootuvu || manO ||

raakaDa tarvaata jarugunavi

 1. sajeeva saMghaarOhaNa mappuDu - jarugunu viMdu aeDaeMDlu = prajaetara saMghamu bahuSramala - paalaipOvunu eMtO du:khamu || manO ||

 2. bilamaMdali saataanunu naenu - vuDudalachaeseda nappuDataDu = ilapainaatO yuddhamuchaesi - geluvalaeka narakamu paalagunu || manO ||

 3. ippuDu kaadu naa Subhavaarta - ilayaMtaTa prakaTanayagunu = appuDu veyyiyaeMDla kaala - maMdu veMTanae aMtamu vachchunu || manO ||

 4. saeva mugiMpakamuMdae mokshamu - chaera valasenana vaddu = bhaavini ekkuvakaalamu ekkuva - saeva chaesedavu idi naa paddu || manO ||

 5. bhoogOLamaMtaTa naa - bOdhayu aaraadhanayu nagunu = naa guLLu paralOkapu mahima - tO ganagana mani veluguchuMDunu || manO ||

 6. narakamuna baDu vaarini joochi - pariSuddhaatma vilapiMchun^ - narula aadaraNayagu taMDrin^ - naruleTlaadariMpa galaru || manO ||

 7. narulu naa kRpa kaalamaMtayu - parityajiMchi vaesinaaru = eri giyu SikshakulOnainaMduna - ellakaalamu naakae jayamu || manO ||

 8. bhoomipai saitaanunu atani - purugae laekuMDa chaesedanu = naa manushyulae uMduru vaari-naDuma nivaasamu chaesedanu || manO ||

baibilu mishanu

 1. bhoolOkamaMtaTiki suvaarta - pOvuTa kiMDiyaa pradhaanamu = pai lOkaMbu nuMDi vachchina - baibilu mishanu nu etti choopumu || manO ||

 2. naenu cheppaga baibilu mishanu - lOniki vachchina kshaemamulu = j~naanamu manassaakshiyunu cheppina - naenaemiyu aaTaMkamu chaeyanu || manO ||

 3. naenu rammanaga vachchi ae - vaani kaDaku pOraadu = naa niyamita kaaryamulu maatrame - naDupumu maanukonaraadu || manO ||

 4. baibilu mishanunu naenu bailu - parachina saMgati nammanivaaru = praabalya bOdhalu vini nannu - praardhana jaesi kanugona raadaa || manO ||

 5. krotta vishayamulu laenide ee - krotta mishanu eMduku raavalenu = krottavi raagaa anni mishanulu - goppaga perigi maeghaMbekkunu || manO ||

 6. aMdariki kanabaDi maaTlaaDudu - nanuTaye ee mishanu viSvaasamu = koMdari bOdhalu vaeruga nuMDunu - aMduke maaTalaaDanu naenu || manO ||

 7. nee janma dinamu nimittamai naeneMtO kanipeTTiyuMTi = ee jagatiki neevu raagaanae - eMtO aanaMdiMchi yuMTi || manO ||

 8. ee keertana naakae naakae yani - evarana galarO vaarikae chellunu = ee kaalamunaku taginavi cheppiti - yerigi sahiMchu konadagunu || manO ||

 9. janaka sutaatmalanu traikuniki - saMstutulu ani anukonumu = anu dinamu nee yaatmeeya jee - vanamu vRddhi yagunu nammumu || manO ||