63. యోబు చరిత్ర

రాగం: మోహన తాళం:చాపు  మానవుడు శ్రమను - పొందక దైవ - మానవుడెటుకాగలడొ = కానకబడిన - వానిని దైవ మానవునిగా చేయంగ - శ్రమలు పరమా - శ్రమముచేసె || మాన ||


 1. కాలకుండ నే - మేలిమియగునె - కనకము కొలిమియందు = కాలినమష్టు - రాలిపోవును - కలుగును విలువగు కాంతి - ఆలాగుననే - ఈలోకమున || మాన ||

 2. విజయుడు యోబును - ఋజువుచేయనై - వృజినమూర్తికిడె సెలవు = నిజ సౌఖ్యంబు - నిలిచిపోయెను - భుజములపై శ్రమ లున్న భక్తిపోదు - రక్తిపోదు || మాన ||

 3. పశువులు భాగ్యము - బిడ్డలుపోయి - నష్టము కలిగినగాని = అసువులూడిన విసుగుపడునె - యశము గణింపడె యోబు - సణగకెపుడు - సంతసించుము || మాన ||

 4. నిందలు అవమా - నములు దూషణ - గందరగోళములున్న నెందును దేవుని - దూషింపక కడు - భూషించెనుగదా యోబు - సందియములు - చాలించుమిక || మాన ||

 5. హితుల తర్కము - సతి దూషణములు - నతికల్పన లుండినను అతనిభక్తి - అధికంబాయె - అదియె గద నిజ భక్తి - మతిదలంచి - నుతి చేయుమిక || మాన ||

 6. శ్రమలుపకారం - శ్రమలేహారం - శ్రమ లాత్మకు శృంగారం = శ్రమలవల్లనే సకల స్వనీతి - సమసి పోవునుగాన - శ్రమలయందె సంతోషించుము || మాన ||

 7. ఎన్ని శపించిన - తన జన్మమునే - తననె శపించును గాని = ఎన్నడు దేవుని - ఏమియుననడు - ఎంతటిదొడ్డబుద్ధి - బుద్ధి గలిగి పూజింపుమిక || మాన ||

 8. మహినియేసే - మహా శ్రమపొంది - మహిమకు వెళ్ళెనుగాదె = మహిమకోరని - మనుజుడెవ్వడు - మర్యాదగా నెవడిచ్చు - శ్రమలులేక - స్వర్గములేదు || మాన ||

 9. శ్రమల మార్గమే - విమల మార్గము - శ్రమభక్తుని కాశ్రమము = శ్రమలే సంపూర్ణంబగు దైవ - మానవునిజేయుగదా - శాంతి గలుగు కాంతివెలుగు || మాన ||

 10. పేదక్రైస్తవుడా - సేదదీర్చుకో - నీదేగదాయ ముక్తి = బాధలు పొందిన ఖేదము పొందకు - వాదములాడకు - మరల - మోద మొందుము మోక్షమొందుము || మాన ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


63. yObu charitra

raagaM: mOhana taaLaM:chaapu  maanavuDu Sramanu - poMdaka daiva - maanavuDeTukaagalaDo = kaanakabaDina - vaanini daiva maanavunigaa chaeyaMga - Sramalu paramaa - Sramamuchaese || maana ||


 1. kaalakuMDa nae - maelimiyagune - kanakamu kolimiyaMdu = kaalinamashTu - raalipOvunu - kalugunu viluvagu kaaMti - aalaagunanae - eelOkamuna || maana ||

 2. vijayuDu yObunu - Rjuvuchaeyanai - vRjinamoortikiDe selavu = nija saukhyaMbu - nilichipOyenu - bhujamulapai Srama lunna bhaktipOdu - raktipOdu || maana ||

 3. paSuvulu bhaagyamu - biDDalupOyi - nashTamu kaliginagaani = asuvulooDina visugupaDune - yaSamu gaNiMpaDe yObu - saNagakepuDu - saMtasiMchumu || maana ||

 4. niMdalu avamaa - namulu dooshaNa - gaMdaragOLamulunna neMdunu daevuni - dooshiMpaka kaDu - bhooshiMchenugadaa yObu - saMdiyamulu - chaaliMchumika || maana ||

 5. hitula tarkamu - sati dooshaNamulu - natikalpana luMDinanu atanibhakti - adhikaMbaaye - adiye gada nija bhakti - matidalaMchi - nuti chaeyumika || maana ||

 6. SramalupakaaraM - SramalaehaaraM - Srama laatmaku SRMgaaraM = Sramalavallanae sakala svaneeti - samasi pOvunugaana - SramalayaMde saMtOshiMchumu || maana ||

 7. enni SapiMchina - tana janmamunae - tanane SapiMchunu gaani = ennaDu daevuni - aemiyunanaDu - eMtaTidoDDabuddhi - buddhi galigi poojiMpumika || maana ||

 8. mahiniyaesae - mahaa SramapoMdi - mahimaku veLLenugaade = mahimakOrani - manujuDevvaDu - maryaadagaa nevaDichchu - Sramalulaeka - svargamulaedu || maana ||

 9. Sramala maargamae - vimala maargamu - Sramabhaktuni kaaSramamu = Sramalae saMpoorNaMbagu daiva - maanavunijaeyugadaa - SaaMti galugu kaaMtivelugu || maana ||

 10. paedakraistavuDaa - saedadeerchukO - needaegadaaya mukti = baadhalu poMdina khaedamu poMdaku - vaadamulaaDaku - marala - mOda moMdumu mOkshamoMdumu || maana ||