74

రాగం: కళ్యాణి తాళం: రూపకం  కలుగ జేయలేదు - ఘనదేవుండైన తండ్రి - కళలేనట్టివి మన కన్నుల కందగనట్టివి = మలిన పదార్ధంబులు చేతులకంటరానట్టివి బలహీనములైనట్టివి - దుష్ఫలములు దుర్భుద్దులు || కలుగ ||

 1. దేవుండులేడనుట - యేవస్తువునైన మ్రొక్కుట - దేవుని దూషించుట సద్భావము లేకుండుట దేవునిగూర్చియపార్ధము - ధిక్కరించి మెలగుట సేవలు పూజలు మానుట - యీవిధంబు దుర్భుద్దులు || కలుగ ||

 2. గౌరవింపక పెద్దవారిని ఎదిరించుట - చేరిపరులతిట్టుట - పేదవారి చంపి చంపుకొనుట = ఊరకనె సోమరిగ గూరుచుండుట త్రాగుట పేరాశ - నిరాశ యసూయ కౄరత్వంబు నశుభ్రత || కలుగ ||

 3. బిడియము చెందుట - మోహముపడి వ్యభిచారము - ద్రోహముబడి కొట్టుకొనుట - స్వలాభము కొరకై పాటుపడుట గుడిగోపురము నైనను - తడివికొని దొంగిలించుట - చెడి జూదమాడుటయు పైబడి లంచాలు కొనుట || కలుగ ||

 4. పరుల పేరు చెడగొట్టుట - మరి చాడీలు చెప్పుట - కరుణలేక నన్యాయముదొరలించి - యసత్యమాడుట - చిరునవ్వుతో ముఖ స్తుతి చేయుట - త్వరపడి యనుమానించుట వెరువక నబద్ధ సాక్ష్యము - కోరకలిగెడు దుర్భుద్దులు || కలుగ ||

 5. కృతజ్ఞత లేనిస్థితి - మతిలేని తనంబు మరుపు - మతవాదములు అజ్ఞానము - అతిసౌఖ్యంబు గర్వంబును స్తుతిచేయ - మానివేయుట మృతి విశ్వాసము కలుగుట ప్రతివిషయంబున అనాగరితగలిగిన దుర్భుద్ధులు || కలుగ ||

 6. పాపఫలితములైన శాపములు - ననర్ధములు భూఫలములు నాశన మగుట ముండ్లతుప్పలు మొలుచుట - తాపములు భూకంపమున - సంతాన విహీనము భోజనము విషజంతువుల ప్రతాపము - ఇబ్బంది కరవులు || కలుగ ||

 7. మనస్సువేదన గ్రుడ్డితనము - పిచ్చి చెవుడు కుంటితనము వాతము కాకలను క్షయ ఉబ్బసము తనువున కుష్టి మసూచికమును జ్వరమును వాంతి భేదియును రక్తస్రావనమును అతిసారము అజీర్తి || కలుగ ||

 8. నిజముగ దేవుడు పాపపునైజంబును - మనుజులలో సృజియించిన పాపియని - పించుకొనడా యోచించుము - సజ్జనుల కష్టంబును గూర్చి రక్షించు దేవుడు విజయము చేసెను - క్రీస్తుగ వృజినమ్మ కలుగజేయునా || కలుగ ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


74

raagaM: kaLyaaNi taaLaM: roopakaM  kaluga jaeyalaedu - ghanadaevuMDaina taMDri - kaLalaenaTTivi mana kannula kaMdaganaTTivi = malina padaardhaMbulu chaetulakaMTaraanaTTivi balaheenamulainaTTivi - dushphalamulu durbhuddulu || kaluga ||

 1. daevuMDulaeDanuTa - yaevastuvunaina mrokkuTa - daevuni dooshiMchuTa sadbhaavamu laekuMDuTa daevunigoorchiyapaardhamu - dhikkariMchi melaguTa saevalu poojalu maanuTa - yeevidhaMbu durbhuddulu || kaluga ||

 2. gauraviMpaka peddavaarini ediriMchuTa - chaeriparulatiTTuTa - paedavaari chaMpi chaMpukonuTa = oorakane sOmariga gooruchuMDuTa traaguTa paeraaSa - niraaSa yasooya kRuratvaMbu naSubhrata || kaluga ||

 3. biDiyamu cheMduTa - mOhamupaDi vyabhichaaramu - drOhamubaDi koTTukonuTa - svalaabhamu korakai paaTupaDuTa guDigOpuramu nainanu - taDivikoni doMgiliMchuTa - cheDi joodamaaDuTayu paibaDi laMchaalu konuTa || kaluga ||

 4. parula paeru cheDagoTTuTa - mari chaaDeelu cheppuTa - karuNalaeka nanyaayamudoraliMchi - yasatyamaaDuTa - chirunavvutO mukha stuti chaeyuTa - tvarapaDi yanumaaniMchuTa veruvaka nabaddha saakshyamu - kOrakaligeDu durbhuddulu || kaluga ||

 5. kRtaj~nata laenisthiti - matilaeni tanaMbu marupu - matavaadamulu aj~naanamu - atisaukhyaMbu garvaMbunu stutichaeya - maanivaeyuTa mRti viSvaasamu kaluguTa prativishayaMbuna anaagaritagaligina durbhuddhulu || kaluga ||

 6. paapaphalitamulaina Saapamulu - nanardhamulu bhoophalamulu naaSana maguTa muMDlatuppalu moluchuTa - taapamulu bhookaMpamuna - saMtaana viheenamu bhOjanamu vishajaMtuvula prataapamu - ibbaMdi karavulu || kaluga ||

 7. manassuvaedana gruDDitanamu - pichchi chevuDu kuMTitanamu vaatamu kaakalanu kshaya ubbasamu tanuvuna kushTi masoochikamunu jvaramunu vaaMti bhaediyunu raktasraavanamunu atisaaramu ajeerti || kaluga ||

 8. nijamuga daevuDu paapapunaijaMbunu - manujulalO sRjiyiMchina paapiyani - piMchukonaDaa yOchiMchumu - sajjanula kashTaMbunu goorchi rakshiMchu daevuDu vijayamu chaesenu - kreestuga vRjinamma kalugajaeyunaa || kaluga ||