43. సువార్త (రెండు దారులు)

రాగం: మాయామాళవగౌళ తాళం: ఆది  చేరి జీవించుడి - దేవాది దేవుని చేరి జీవించుడి = చేరి జీవనము చేసినయెడల కోరిన మోక్షము ఊరకే దొరుకును || చేరి ||

 1. మంచినే చేరుడి - దానినే అనుస-రించి జీవించుడి - మంచి మార్గమున ఆటంకములు - మాటిమాటికి వచ్చునుగాని - కించిత్తైనను మంచిని గూర్చి - వంచన దారి యటంచు తలంపక - మంచిచెడ్డలన్ గుర్తింపగల - మనస్సాక్షిని ఇమ్మని దేవుని = యెంచి ప్రార్ధన చేయుచు స్తుతితో || చేరి ||

 2. పాపముల్ మానుడి - ఆ చెడ్డదారివైపే చూడకుడి - పాపము పాప ఫలితమైయున్న - శాపము సాతాన్ అతని సైన్యము చూపున కెంతో రమ్యములైన - ఆపదలును ఆపాపమార్గమున - దాపరించి యుండును కావున - దాపున జేరిన అది నరకంబను = కూపములోనికి నడుపునుగాన || చేరి ||

 3. చేసి చూడరాదా - దైవప్రార్ధనచేసి - తరచరాదా = యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు - యేసేమార్గము - యేసే సత్యము - యేసే జీవము యేసే దేవుడు - యేసే సర్వము యేసే పాపికి - దోషముల పరిహారకుడు ఈ - వ్యాసము నిజమో కాదో తెలియ = జేసెడి ప్రార్ధన చేయుచు దేవుని || చేరి ||

 4. మోకరింపరాదా - మనదేవునియెదుట - మోకరింపరాదా = మోక రించి ప్రార్ధించియడిగిన - మీకె మనస్సున దేవుడు తెల్పును - లేకపొయిన మీజ్ఞానాక్షి కే - కన్పర్చి సత్యము నేర్పును - మీకంటికి సృష్టిని గానంబడు - మేళ్ళమూలముగ స్ఫురింపజేయును- కాక పోయిన బైబిలనంబడు - గ్రంధమున పూర్తిగ జూపించును - ఏ కల లోనో దర్శనంబులోనో కథనచ్చన్ ప్రదర్శించును = లోకైక రక్షకుడౌ క్రీస్తు -లో సమస్తము లభించును గాన || చేరి ||

 5. ఆని యుండరాదా - దైవగ్రంధంబు నానియుండరాదా - నానాటికి పాపాలు హెచ్చయి - నరులను పాడుచేయు చున్నవి నానావిధ రోగములుచేరి - మానవుల నవి చంపుచున్నవి - మానవులందు సోదరప్రేమ - లేనందున కలహాలౌచున్నవి - వానలు క్రమము తప్పినందున - పంటలులేక కరువౌచున్నవి - లేనిపోని మతవాదా లున్నవి - దేనిలో నిజమో తెలియకున్నది = వీనికి విరుగుడు దైవ ప్రార్ధన - గాన దేవుని సన్నిధియందు || చేరి ||

 6. చేయనే చేయను - తెలిసిన తప్పిదముల్ చేయనే చేయను = చేయను ఎవ్వరు చెప్పినగాని - చేయను నైజము చెప్పినగాని - చెసెద-ను తండ్రి నీ చిత్తముచొప్పున చేసెదను తండ్రి = చేసెదనునీ చిత్తము చొప్పున - చేదుగనున్నను చేసి తీరెదను || చేరి ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


43. suvaarta (reMDu daarulu)

raagaM: maayaamaaLavagauLa taaLaM: aadi  chaeri jeeviMchuDi - daevaadi daevuni chaeri jeeviMchuDi = chaeri jeevanamu chaesinayeDala kOrina mOkshamu oorakae dorukunu || chaeri ||

 1. maMchinae chaeruDi - daaninae anusa-riMchi jeeviMchuDi - maMchi maargamuna aaTaMkamulu - maaTimaaTiki vachchunugaani - kiMchittainanu maMchini goorchi - vaMchana daari yaTaMchu talaMpaka - maMchicheDDalan^ gurtiMpagala - manassaakshini immani daevuni = yeMchi praardhana chaeyuchu stutitO || chaeri ||

 2. paapamul^ maanuDi - aa cheDDadaarivaipae chooDakuDi - paapamu paapa phalitamaiyunna - Saapamu saataan^ atani sainyamu choopuna keMtO ramyamulaina - aapadalunu aapaapamaargamuna - daapariMchi yuMDunu kaavuna - daapuna jaerina adi narakaMbanu = koopamulOniki naDupunugaana || chaeri ||

 3. chaesi chooDaraadaa - daivapraardhanachaesi - taracharaadaa = yaesukreestu prabhuvae mOkshamunaku - yaesaemaargamu - yaesae satyamu - yaesae jeevamu yaesae daevuDu - yaesae sarvamu yaesae paapiki - dOshamula parihaarakuDu ee - vyaasamu nijamO kaadO teliya = jaeseDi praardhana chaeyuchu daevuni || chaeri ||

 4. mOkariMparaadaa - manadaevuniyeduTa - mOkariMparaadaa = mOka riMchi praardhiMchiyaDigina - meeke manassuna daevuDu telpunu - laekapoyina meej~naanaakshi kae - kanparchi satyamu naerpunu - meekaMTiki sRshTini gaanaMbaDu - maeLLamoolamuga sphuriMpajaeyunu- kaaka pOyina baibilanaMbaDu - graMdhamuna poortiga joopiMchunu - ae kala lOnO darSanaMbulOnO kathanachchan^ pradarSiMchunu = lOkaika rakshakuDau kreestu -lO samastamu labhiMchunu gaana || chaeri ||

 5. aani yuMDaraadaa - daivagraMdhaMbu naaniyuMDaraadaa - naanaaTiki paapaalu hechchayi - narulanu paaDuchaeyu chunnavi naanaavidha rOgamuluchaeri - maanavula navi chaMpuchunnavi - maanavulaMdu sOdarapraema - laenaMduna kalahaalauchunnavi - vaanalu kramamu tappinaMduna - paMTalulaeka karuvauchunnavi - laenipOni matavaadaa lunnavi - daenilO nijamO teliyakunnadi = veeniki viruguDu daiva praardhana - gaana daevuni sannidhiyaMdu || chaeri ||

 6. chaeyanae chaeyanu - telisina tappidamul^ chaeyanae chaeyanu = chaeyanu evvaru cheppinagaani - chaeyanu naijamu cheppinagaani - cheseda-nu taMDri nee chittamuchoppuna chaesedanu taMDri = chaesedanunee chittamu choppuna - chaeduganunnanu chaesi teeredanu || chaeri ||