65. ఆనందకరమైన బ్రతుకు  ఆనందకరమైనది - మనబ్రతుకెంతో - ఆశ్చర్యకరమైనది
  మనబ్రతుకెంతో - అద్భుతకరమైనది - మనబ్రతుకెంతో
  ఉపయోగకరమైనది = జ్ఞాని నేత్రములకు ఆనున్ గాని
  యితర = మానవుని నేత్రాల కానుటెట్లుండును || ఆనంద ||

 1. భూమి మనగృహమాయెను ఆకాశ మీ - భూమికి కప్పాయెను
  అమింట సూర్య చం - ద్రాదులు దీపాలు
  యే మనుజుడైనను - ఎప్పుడు నార్పలేడు
  భూమి నాకాశము - పూర్తిగా మార్చెడు
  స్వామియె మనకు - శా - స్వతమైన దీపంబు
  = ఈ మానవపాపి - ఎంత ధన్యుండాయె || ఆనంద ||

 2. సృష్టియంతటిలోను - మనమె వింత - సృష్టిగ నేర్పడినాము
  సూర్యుడు చంద్రుడు - చుక్కలు మనకొరకె
  నీడనిచ్చు మబ్బు - నింగియు మనకొరకె
  కంటికి కనబడని - గాలియు మనకొరకె
  ఆకారముండని ధూ - తాళియు మనకొరకె
  దప్పితీర్చు వర్ష - ధారయు మనకొరకె
  = మనమెంత ధన్యులము - మనమెంత ధన్యులము || ఆనంద ||

 3. భూమి మన ఇల్లాయెను - దానియందు యేమున్న సొత్తాయెను
  భూమిలోపలి గనులు - భోషణపు ధనమాయె
  భూమి మూలికల్ రోగ - ములకు ఔషదమాయె
  భూమి మన్నును రోగ - ములకు మందాయె
  భూమిపైని పంట - భోజనాస్పదమాయె
  = భూమి మనకు స్వేచ్చ - గ మసలు స్థలమాయె || ఆనంద ||

 4. రంగుపూసిన పక్షులు - పాటలు పల్కు - సంగీతసామాజికులు
  శృంగారవనములు - చెట్లపై ఫలములు
  నింగి కిరాణాలెన్నో - రంగులద్దిన పువ్వుల్
  వంగి నీళ్ళు త్రాగు - పశువులు మృగములు
  పొంగి ప్రవహించెడి - పొడుగు నదులు వాగుల్
  = మంగళధ్వనులతో - మహిమపర్చుడి తండ్రిన్ || ఆనంద ||

 5. విసనకర్రతో తండ్రి - మనకందరకు విసరుచున్నాడాయేమి!
  విసరకున్న త్వరగ - విశ్వము నశియించు
  బసయెక్కడో గాలి - పరుగెక్కడికో గాని
  ఇసుమంతయు మన - మెరుగకున్నాముగ
  విసుగుదల యెండకు - విసరు చలువగాలి
  = మసలుచున్నప్పుడే - మహిమ పర్చుడి తండ్రిన్ || ఆనంద ||

 6. అందరకును నిత్యము - కావలసిన - వన్నిగలవు సృష్టిలో
  అందించు మన తండ్రి - అందుకొనుట మనము
  వందనముచేయుట - అందుకొనుటలెక్క
  కందని నక్షత్రా - లన్ని సరకులె మనకు
  ఎందరు వాడిన - ఎన్నో మిగిలియుండు
  = అందించిన వందిన - అందరము ధనికులమే || ఆనంద ||

 7. ఎండకు పన్నులేదు - అది ఉచితంబు - ఎవరును పన్నడగరు
  వెన్నెలకు పన్నులేదు - విభుడడుగడుపన్ను
  గాలికి పన్నులేదు - ఏలికడుగడుపన్ను
  వర్షానికి పన్నులేదు - వారసుడడుగడు పన్ను
  మొలుచుటకు పన్నులేదు - ముఖ్యుండడుగడు పన్ను
  జన్మానికి పన్నులేదు - జనకుడడుగడు పన్ను
  వయసుకు పన్ను లేదు - పరమాత్ముడడుగబోడు
  ధరకు పన్ను లేదు - తండ్రి పన్నడుగడు
  తగిన స్తుతి చేయుటే - తండ్రికిచ్చుపన్ను
  తగినట్లు నడచుట - తండ్రికిచ్చుపన్ను
  = తండ్రిన్ ప్రకటించుటయే - తండ్రికిచ్చు పన్ను || ఆనంద ||

 8. ఇన్ని నీకైచేసిన - నీ తండ్రి నీ - వేమి యడిగిన ఇయ్యడు?
  ఎన్ని సృజించెనో - అన్ని వాగ్ధానాలే
  ఇన్నిటికిని నీకు - ఎన్ని కావలయునో
  అన్నియు నీ తండ్రి - అందించుచుండును
  ఎన్ని సందేహాలు - ఉన్న త్రోసివేసి
  నిన్ను నమ్మిన తండ్రిన్ - నీవు నమ్మవలయు
  ఇన్నిటిలో నీవె - ఎక్కువ తండ్రికి
  నిన్ను బట్టి లోక - నిర్మాణముచేసె
  అన్నిటికన్న నీ - కధికుండు నీ తండ్రి
  = ఖిన్నుడవై యుండకున్న - జరుగును అన్ని || ఆనంద ||

 9. జీవాంతమందు మనకు - పరలోకమున జీవాభివృద్ధి కలుగు
  చావు వెన్క వేరు - చావేయుండబోదు
  దేవదూతలలోను - దివ్యస్థితియందున్న
  పావనులైనట్టి - భక్తవరులతోను
  జీవించుచుండుము - చిరకాలమువరకు
  = దైవసన్నిధి మనకు - స్థానమైయుండున || ఆనంద ||

 10. దేవదూత సృష్టికి - ప్రజలందరకు - కావలిబంటులైరి
  దేవుని నిత్యంబు - దీక్షతో కొల్తురు
  ఏవేవి ఆయన - యెంచిచెప్పునో వాటిన్
  ఆ వెంటనే చేసి - ఆనందపర్తురు
  పావనునిగ మారు - పాపిన్ గూర్చి మంచి
  భావంబుతో గొప్ప - పండుగ జేతురు
  ఆ విమల శీలులు - ఆత్మస్వరూపులు
  గావున కంటికి - కానరాకుందురు
  దేవుని ప్రార్ధించి - దృష్టింప వచ్చును
  చావు వేళను వచ్చి - సంతోషముగ మనలన్
  ఈ విపత్తుల నుండి - ఎత్తికొని వెళ్ళుదురు
  ఎవరి వశముకానివి - వారు చేతురు
  ఈ విధముగ స్నే - హితులౌదురు వారు
  సేవకులున్నానను - స్థిరబంధువులన్నను
  = దేవదూతలె దేవ - దేవునికి సత్కీర్తి || ఆనంద ||

 11. పరమందున్న మాతండ్రి - నీ నామము - పరిశుద్ధనీయమగును
  అరుదెంచు నీరాజ్యము - పరమున నీ కోర్కె
  జరుగునట్లు జరుగు - ధరణిపైన గూడ
  జరుపు మన్నను నేడు - క్షమియించు మమ్మును
  పరులకు మేము క్షమా - ర్పణ యొసగురీతిని
  దురుతంబులోనికి - జరుగనీయకుమమ్ము
  మరలింపుము కీడు - దరినుండి మమ్ములను
  మరియు రాజ్యము, బలము - మహిమ యనంతంబు
  వరకునీ విగానే - బరగునుతధ్యంబు || ఆనంద ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

65. aanaMdakaramaina bratuku  aanaMdakaramainadi - manabratukeMtO - aaScharyakaramainadi
  manabratukeMtO - adbhutakaramainadi - manabratukeMtO
  upayOgakaramainadi = j~naani naetramulaku aanun^ gaani
  yitara = maanavuni naetraala kaanuTeTluMDunu || aanaMda ||

 1. bhoomi managRhamaayenu aakaaSa mee - bhoomiki kappaayenu
  amiMTa soorya chaM - draadulu deepaalu
  yae manujuDainanu - eppuDu naarpalaeDu
  bhoomi naakaaSamu - poortigaa maarcheDu
  svaamiye manaku - Saa - svatamaina deepaMbu
  = ee maanavapaapi - eMta dhanyuMDaaye || aanaMda ||

 2. sRshTiyaMtaTilOnu - maname viMta - sRshTiga naerpaDinaamu
  sooryuDu chaMdruDu - chukkalu manakorake
  neeDanichchu mabbu - niMgiyu manakorake
  kaMTiki kanabaDani - gaaliyu manakorake
  aakaaramuMDani dhoo - taaLiyu manakorake
  dappiteerchu varsha - dhaarayu manakorake
  = manameMta dhanyulamu - manameMta dhanyulamu || aanaMda ||

 3. bhoomi mana illaayenu - daaniyaMdu yaemunna sottaayenu
  bhoomilOpali ganulu - bhOshaNapu dhanamaaye
  bhoomi moolikal^ rOga - mulaku aushadamaaye
  bhoomi mannunu rOga - mulaku maMdaaye
  bhoomipaini paMTa - bhOjanaaspadamaaye
  = bhoomi manaku svaechcha - ga masalu sthalamaaye || aanaMda ||

 4. raMgupoosina pakshulu - paaTalu palku - saMgeetasaamaajikulu
  SRMgaaravanamulu - cheTlapai phalamulu
  niMgi kiraaNaalennO - raMguladdina puvvul^
  vaMgi neeLLu traagu - paSuvulu mRgamulu
  poMgi pravahiMcheDi - poDugu nadulu vaagul^
  = maMgaLadhvanulatO - mahimaparchuDi taMDrin^ || aanaMda ||

 5. visanakarratO taMDri - manakaMdaraku visaruchunnaaDaayaemi!
  visarakunna tvaraga - viSvamu naSiyiMchu
  basayekkaDO gaali - parugekkaDikO gaani
  isumaMtayu mana - merugakunnaamuga
  visugudala yeMDaku - visaru chaluvagaali
  = masaluchunnappuDae - mahima parchuDi taMDrin^ || aanaMda ||

 6. aMdarakunu nityamu - kaavalasina - vannigalavu sRshTilO
  aMdiMchu mana taMDri - aMdukonuTa manamu
  vaMdanamuchaeyuTa - aMdukonuTalekka
  kaMdani nakshatraa - lanni sarakule manaku
  eMdaru vaaDina - ennO migiliyuMDu
  = aMdiMchina vaMdina - aMdaramu dhanikulamae || aanaMda ||

 7. eMDaku pannulaedu - adi uchitaMbu - evarunu pannaDagaru
  vennelaku pannulaedu - vibhuDaDugaDupannu
  gaaliki pannulaedu - aelikaDugaDupannu
  varshaaniki pannulaedu - vaarasuDaDugaDu pannu
  moluchuTaku pannulaedu - mukhyuMDaDugaDu pannu
  janmaaniki pannulaedu - janakuDaDugaDu pannu
  vayasuku pannu laedu - paramaatmuDaDugabODu
  dharaku pannu laedu - taMDri pannaDugaDu
  tagina stuti chaeyuTae - taMDrikichchupannu
  taginaTlu naDachuTa - taMDrikichchupannu
  = taMDrin^ prakaTiMchuTayae - taMDrikichchu pannu || aanaMda ||

 8. inni neekaichaesina - nee taMDri nee - vaemi yaDigina iyyaDu?
  enni sRjiMchenO - anni vaagdhaanaalae
  inniTikini neeku - enni kaavalayunO
  anniyu nee taMDri - aMdiMchuchuMDunu
  enni saMdaehaalu - unna trOsivaesi
  ninnu nammina taMDrin^ - neevu nammavalayu
  inniTilO neeve - ekkuva taMDriki
  ninnu baTTi lOka - nirmaaNamuchaese
  anniTikanna nee - kadhikuMDu nee taMDri
  = khinnuDavai yuMDakunna - jarugunu anni || aanaMda ||

 9. jeevaaMtamaMdu manaku - paralOkamuna jeevaabhivRddhi kalugu
  chaavu venka vaeru - chaavaeyuMDabOdu
  daevadootalalOnu - divyasthitiyaMdunna
  paavanulainaTTi - bhaktavarulatOnu
  jeeviMchuchuMDumu - chirakaalamuvaraku
  = daivasannidhi manaku - sthaanamaiyuMDuna || aanaMda ||

 10. daevadoota sRshTiki - prajalaMdaraku - kaavalibaMTulairi
  daevuni nityaMbu - deekshatO kolturu
  aevaevi aayana - yeMchicheppunO vaaTin^
  aa veMTanae chaesi - aanaMdaparturu
  paavanuniga maaru - paapin^ goorchi maMchi
  bhaavaMbutO goppa - paMDuga jaeturu
  aa vimala Seelulu - aatmasvaroopulu
  gaavuna kaMTiki - kaanaraakuMduru
  daevuni praardhiMchi - dRshTiMpa vachchunu
  chaavu vaeLanu vachchi - saMtOshamuga manalan^
  ee vipattula nuMDi - ettikoni veLLuduru
  evari vaSamukaanivi - vaaru chaeturu
  ee vidhamuga snae - hitulauduru vaaru
  saevakulunnaananu - sthirabaMdhuvulannanu
  = daevadootale daeva - daevuniki satkeerti || aanaMda ||

 11. paramaMdunna maataMDri - nee naamamu - pariSuddhaneeyamagunu
  arudeMchu neeraajyamu - paramuna nee kOrke
  jarugunaTlu jarugu - dharaNipaina gooDa
  jarupu mannanu naeDu - kshamiyiMchu mammunu
  parulaku maemu kshamaa - rpaNa yosagureetini
  durutaMbulOniki - jaruganeeyakumammu
  maraliMpumu keeDu - darinuMDi mammulanu
  mariyu raajyamu, balamu - mahima yanaMtaMbu
  varakunee vigaanae - baragunutadhyaMbu || aanaMda ||