స్వాతంత్రోత్సవ ధ్యానములు - Aug 14

1 | 2 | 3 4 5

దేశ శాంతి - దేవదాసు అయ్యగారి ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! మీరిచ్చిన స్వాతంత్రతలో గల జీవమును శాంతిసమాధానములను ఆనందించు ఆత్మబలమును దయచేయుమని, సంతోషముతో ఎల్లప్పుడు మిమ్మును స్తుతించి ఆరాధించు ధన్యతను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమతండ్రీ! ఆమేన్.

వాక్య భాగము:

"అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" - యోహాను 8:32

2 కోరింథీ 3:17: ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.


ఈ రోజు పాఠమైయున్న స్వాతంత్ర ధరణమును గూర్చి అయ్యగారు ఈ క్రింది పద్యములో వివరించిరి.

సీ|| ఏలికయును ప్రజ - ఏకీభవించిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

పరదేశజనసహ - వాసముండిన గొప్ప
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

కలహంబులకు సందు - కలుగగా నణచిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

సోదరభావంబు - శోభ్బిల్లుచుండిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము


తే||గీ|| దేశచిత్రాలు దర్శింప - తిరుగనెడల
అనుభవాభిమానంబులు - అధికమగును
సర్వస్థల జనములపరి - చయము కల్గు
సంతసముతుష్టి స్వాతంత్రత - శక్తిపుట్టు 162

మన స్వాతంత్రతను అనుభవించుటకు, దేవుని సన్నిధికి చేరు స్వతంత్రత దేవుడు మనకు కలుగజేసి, ప్రభువు ఆత్మలో ఆనందించు కృపను దయచేయును గాక! ఆమేన్.

ఆగస్టు 11 - 15 వరకు ప్రతిరోజు స్వాతంత్ర్యములో గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ పండుగ.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +