స్వాతంత్రోత్సవ ధ్యానములు - Aug 13

1 | 2 3 4 | 5

స్వాతంత్ర్యము - 2 దేవదాసు అయ్యగారి ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! దేశములోని ప్రజలందరికి సంపూర్ణ స్వాతంత్రమును దయచేయుము. ప్రతీ ఒక్కరు మీ నియమము చొప్పున నడుచుకొనుటద్వార స్వతంత్రతను కొనసాగించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.

వాక్య భాగము:

"అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" - యోహాను 8:32

2 కోరింథీ 3:17: ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

పరిచయము

సత్యమును ప్రేమించి నైపుణ్యమును పెంచుకొని, సాంఘిక దురాచారములను పారదోలుట ద్వారా స్వాతంత్రము కొనసాగునని ఈ పద్యము ద్వారా తెలియుచున్నది.

ఈ రోజు పాఠమైయున్న స్వాతంత్ర భరణంను గూర్చి అయ్యగారు ఈ క్రింది పద్యములో వివరించిరి.

సీ|| పాపముల్ మాన్పించు | భక్తులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

మతవైరమునుతీర్చు | మాన్యులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

కులమును పోగొట్టు | కోవిదుల్ లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

శత్రుత్వమును నాపు | సాధువుల్లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

తే||గీ|| సృష్టిపూజను మాన్పించి - స్రష్టపూజ
నేర్పు నిపుణులులేచిన - నిండుస్వేచ్చ
కలుగగా దేశమునకు సు - ఖము లభించు
స్రష్టపూజయే భాగ్యాల - సాధనంబు 160

మన స్వాతంత్రతను కొనసాగించుకొనుటకు దేవుడు మనకు రక్షణ కలుగజేసి, సత్యములో నడిపించును గాక! ఆమేన్.

ఆగస్టు 11 - 15 వరకు ప్రతిరోజు స్వాతంత్ర్యములో గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ పండుగ.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +