స్వాతంత్రోత్సవ ధ్యానములు - Aug 12

1 2 3 | 4 | 5

స్వాతంత్ర్యము - 1 దేవదాసు అయ్యగారి ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! మీరిచ్చిన స్వాతంత్రమును మీ నామ మహిమార్థమై వాడుకొను హృదయమును దయచేయుము. మీ జీవము మాలో నివసించి, మీ మార్గములో ప్రయాణించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

వాక్య భాగము:

2 కోరింథీ 3:17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

గలతి 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

యాకోబు 1:25 అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

పరిచయము

స్వాతంత్రమనగా నియమములతో కూడిన అధికార బదిలీ. నియమము తప్పితే వెంటనే స్వతంత్రత కోల్పోవుదురు. ఆదాము నియమము తప్పిన వెంటనే దేవువియొద్ద స్వతంత్రత కోల్పోయెను. విశ్వాసులు సత్యమైయున్న యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను విస్మరించినచో ప్రభువు సన్నిధి చేరు స్వాతంత్ర్యతను కోల్పోదురు.

విశ్వాసులు ఈ కింది విషయములు అభ్యాసములో పెట్టి వీటిని వెలుగులోనికి తెచ్చుటకొరకు స్వాతంత్ర్యమును విరివిగా వాడవలెను.
  • దైవభక్తి
  • నాగరికత
  • విద్యాభ్యాసము
  • ధర్మ గుణము

ఈ రోజు పాఠమైయున్న స్వాతంత్ర మరణమును గూర్చి అయ్యగారు ఈ క్రింది పద్యములో వివరించిరి.

సీ|| తలపులో తప్పున్న - తనువెల్ల చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

మాటలో తప్పున్న - మర్యాదచెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

క్రియలలో తప్పున్న - క్రియకన్ని చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

మూటిలో ఒకటైన - మూలబడినయెడ
స్వాతంత్ర్యమెక్కడ చచ్చిపోదె


తే||గీ|| మూడునొక్కటై పనిచేయ - ముప్పుపోవు
దైవభక్తి నాగరికత - ధర్మగుణము
విద్యమున్నగువానికి - వెలుగువచ్చు
అపుడు సంపూర్ణ స్వాతంత్ర్య - మబ్బు మనకు 161

మన స్వాతంత్రతను మన అపరాధములచేత సాతాను అపహరింపకుండా దేవుడు మనకు రక్షణ కలుగజేయును గాక! ఆమేన్.

ఆగస్టు 11 - 15 వరకు ప్రతిరోజు స్వాతంత్ర్యములో గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ పండుగ.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +