సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. 9. ఆలయ ప్రతిష్టారాధన

9. ఆలయ ప్రతిష్టారాధన

కీర్తన: 26 (326) రండి ఉత్సాహించి పాడుదము

  (అందరు గుడి ద్వారము ప్రక్క వరుసగా నిలువబడి గుడి చుట్టు ముమ్మారు తిరుగుచు ద్వా, రము నొద్ద ఆగవలెను.)

                     దేవాలయము తెరచుట 

   బోధకుడు:- తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక!

             (గుడినాయకుడు బోధకునికి గుడితాళపు చెవిని యివ్వవలెను.)

   బో: వాక్య సేవకుడవైన నేను ఆరాధనకు వాడుకొనుటకై బైబిలుమిషను యొక్క .........అను పేరు గల ఈ నూతన గుడి ద్వారమును తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ నామమున తీయుచున్నాను.                       

  యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సతోషించితిని. కీర్తన 122:1.

సం : నీవు దేవుని మందిరమునకు పోవుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రసంగి 5:1.

 (కీర్తన పాడుచు అందరు గుడిలోనికి వెళ్లి కూర్చుండవలెను. కాని బోధకుడు మాత్రమే అల్టరు యొద్దకు వెళ్ళవలెను. ఆయన బైబిలు, కీర్తన పుస్తకము, సంస్కార భోజనపాత్రలు, చందా పళ్ళెము, ఇంక యేమైన వున్నయెడల అవియును జాగ్రత్తగా అల్టరు మీద పెట్టవలయును.

 బో: ఆయన ఆలయములో నున్న వన్నియు ఆయనకే ప్రభావమనుచున్నవి. కీర్తన 29:9.

 సం: యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును

, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాము. దా.కీ. 27:4.

 బో: స్తుతిప్రార్ధన, ఓ దేవా! మేము నిన్ను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుటకు ఈయాలయమును దయచేసినందుకు నీ కనేక వందనములు. ఇవి నీ కుమారుడును, మా ప్రభువును బట్టి అందుకొనుము.

 సం: ఘనత, ప్రభావములు ఆయన సన్నిధి నున్నవి.జనముల కుటుంబములారా! యెహోవాకు స్తుతి చెల్లించుడి. స్తుతి, మహిమ, బలములు యెహోవాకు చెల్లించ్గుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దా. కీ.7:7-9.                        వేద పఠనము

  ప్రసంగ ప్రార్ధన: తండ్రీ! ఆయా సమయములకు తగిన మాటలు నీ వాక్యములో వ్రాయించిన నీ కృపకు స్తోత్రములు. నేటి దేవాలయ ప్రతిష్టకు మేము జ్ఞాపకము చేసికొనవలసిన యొక వాక్యమును ధ్యానింప గోరుచున్నాము. ఈ వాక్యవివరము నీవాక్యమున కనుగుణముగా నుండునట్లు వర్తమానము దయచేయుము. ఆమెన్.

                ఆలయమును, ఉపకరణములను ప్రతిష్టించుట 

   బో: ఈ ప్రతిష్టకు త్రియేకదేవుడును, ఆయన పనివారును, వచ్చినట్లు విశ్వాసమువలన గ్రహించుకొనుచున్నాను. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, మహా మహిమయును, ఆయనకే చెల్లును. (1 దినవృ 29:11)

       (గౌరవార్ధమై సంఘములేచి నిలువవలెను)

    ప్రతిష్టత: నేను యీ దైవగృహ ప్రతిష్ట మహోత్సవ సమయమందు బైబిలు మిషనుయొక్క నూతన దేవాలయమును తండ్రి యొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దైవ మందిరముగ ప్రకటించుచు, దైవారాధన నిమిత్తమై ప్రతిష్టించుచున్నాను. ఈ ఆలయమును ప్రతిష్టించుటలో దీని యందలి ఆరాధన కొరకు ఉపయోగించు ఉపకరణములనన్నిటిని ప్రతిష్టించుచున్నాను.

  (సంఘము 7 మార్లు ఆమెన్ అని చెప్పవలెను.)

         ఆలయమును ఉపకరణములను అప్పగించుట

  బో: ఆదివార ఆరాధనకును, ఇతర సమయములయందు జరుగు మతసంబంధమైన కూటములకును, ఒక్కొక్కరు చేసికొనగల ప్రార్ధనలకును, యీ దైవ స్థానమును సరిగా ఉపయోగించునని నమ్ముచూ, యీ బాధ్యతను అప్పగించుచున్నాను. దేవుడు అన్నిటిలో మహిమ నొందునుగాక! 

సం: ఆమెన్_____ఆమెన్_____ఆమెన్. 

 స్తుతి కీర్తన:-

 ప్రార్ధన:- మహా ప్రభావము గల తండ్రీ! మందిరమును కట్టవలసినదని సొలొమోనుకు సెలవిచ్చిన తండ్రీ! ఆకాశ మహాకాశములు పట్టజాల్మని నీవు మానవ నిర్మితమగు మందిరమున నివాసముచేయుట మాకెంతో ఆశ్చర్యముగా నున్నది. నీ నివాస వాగ్ధానము నిమిత్తము నీ కనేక వందనములు. నీ ప్రజలు యిచ్చట ఒప్పుకొను పాపములను క్షమించుమనియు, అవి మాత్రమేకాక సర్వస్వభావము చొప్పున చేయు ఆరాధనలోని లోపములను కూడ మన్నించుమనియు, మిగుల ఉపయోగకరమగు బోధలు వారికి వినిపించుమనియు, వారు తెచ్చు కానుకలు పుచ్చుకొనుమనియు, నిన్ను వేడుకొనుచున్నాను. పాప శోధన కాలమందును, శతృభీతి కాలమదును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షలోభకాలమందును, దుర్భోధ కాలమందును, ఇకను యితర కాలములయందును ప్రజలు యిచ్చట చేయు ప్రార్ధనలు నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించుము. సొలొమోను మందిరము యాజకులు ప్రవేశింపలేని కాంతితో యేర్పాటు చేయుము. యేసుక్రీస్తు ప్రభువా! మా రక్షకుడా! మాదేవా! మా మనుష్యులతో ఒకప్పుడు మనుష్యుడవుగా నివసించిన మనుష్యకుమారుడా! మావలె ఒకప్పుడు మనుష్యులతో గుడిలో కూర్చున్న తండ్రీ! నీకు స్తోత్రము.  మా నిమిత్తమై యిప్పుడు పరలోక సిం హాసనమునొద్ద విజ్ఞాపన చేయుచున్న మా ప్రధాన యాజకుడా! మా భారమంతయు యెత్తుకొనుటవలన మా ప్రార్ధనల కన్నిటికి నెరవేర్పు కలిగించు కారకుడవైయున్న సమాధానకర్త! నీవు మాకు యిటువంటివాడవై యున్నందున నీ కనేక స్తోత్రములు. సదాకాలము మీతోనున్నానని సెలవిచ్చిన ప్రభువా! యిద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ కూడియుందురో అక్కడనే వారిమధ్యనే యుందునని వాగ్ధానము చేసిన దేవకుమారుడా! నీ మాటలకు అనేక స్తోత్రములు. ఆ నీ మాటల ప్రకారముగా నేడు యిచ్చట నున్నావని విశ్వాసము వల్ల మేమెరుగుదుము.నీకనేక స్తోత్రములు. మాకున్న శరీరమువంటి శరీరమును దాల్చుట వల్ల మా నరులలో ఆనాడు బహిరంగముగ మసలిన నీవు నేడు మహిమ శరీరముతో మాయందరి వద్ద మసలుచున్నావని యానందించుచు హృదయముతో మనస్కరించుచు, నమస్కరించుచున్నాము స్తోత్రము. మా మానవులలో నొకరు దేవాలయ ఆరాధన జరుపుట మేము చూచినప్పుడు మా ప్రధాన యాజకత్వ కార్య మహిమను మా విశ్వాస నేత్రములకు కనబరచుము.  

 ఓ పరిశుద్ధాత్మవై యున్న తండ్రీ! సృష్టిలోని జలోపరి భాగమున నివాస మగుపరచిన దేవా! మా కెన్నెన్ని మంచి ఆచారములు, సత్క్రియలు, ఉన్నప్పటికిని నీవు లేని యెడల ఆ యాచారములలోను, సత్క్రియలలోను, వాటికి జీవము గాని, పెంపుగాని యుండదు. గనుక నీ యంతరంగ కార్యము నిమిత్తమే మహా తేజోమయమైన యీ పనులన్నిటి విషయమై నీకనేక స్తోత్రములు. అన్నిటిలోను నీ వుండుమని వేడుకొనుచున్నాము. నీవు మాతో నివసింతువనియు, మాలో నుందువనియు, నీవాక్యమువల్ల నేర్చుకొనియుత్సాహించు చున్నాము. ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రము! పరిశుద్ధాత్మ పావురమా! నీవు! మా మందిరములోను, మా హృదయములలోను నిత్య నివాసిగా నుండు మమ్మును వెలిగించుచు, వృద్ధిలోకి తెచ్చుచు, కాపాడుచుండుమని వేడుకొనుచున్నాము. ఇట్లు చేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. నీ పని లేనిదే ఒక పని యైనను కాజాలదు. నీ పని ముట్టగు వాక్యముతోను, బాప్తీస్మ సంస్కారముతోను, ప్రభుభోజన సంస్కారములతోను, సంఘము పనిచేయుచు సంఘమును మందిరములో నివసింపుమని నీకు మనవి చేయుచున్నాము. నీ కుమ్మరింపు నిత్తమై అనేకులు యీ కాలమందానందించుచు, ప్రార్ధించుచు, యెదురుచూచుచు ఇట్లు చేయుట వలన ననేకమైన నిందలు సహించుచు, నుండుట నీ సహాలో పరిశుద్ధాత్మ బయ కార్యమని తలంచుకొని హర్షించుచు నిన్ను కొనియాడుచున్నాము. ఓ ఆత్మనివాసివైన ఆత్మా అత్మలో పరిశుద్ధాత్మ బాప్తీస్మమని కలువరించుచుండగా, ఈ కార్యము బహు వేగముగా నెరవేర్చుము. యేసు ప్రభువుయొక్క రెండవరాకడ అతి సమీప మగు చున్న యీ మా కాలములో నీ బాప్తీస్మ కాలమును సంపూర్తిగా జరుగనిమ్ము. అప్పుడు మీరాకకు పెండ్లికుమార్తెగా సిద్ధపడగలము. ఈ కృప నీ విశ్వాస జనసంఘమునకు లభించునని నమ్ముచు స్తుతించుచున్నాము.  

  ఓ త్రియేకదేవా తండ్రీ! నీ నివాసము కొరకు నీ ప్రేరేపణను బట్టి కట్టిన యీ..,..,.. స్తోత్రాలయములో మిగుల తరచుగాను, ఎక్కువగాను, నీకు మా ఆత్మచేయు స్తోత్రములు కలుగునట్లు దీవించుము. బాప్తీస్మకాలమందు చేయు నిబంధనలు ప్రార్ధనలు కడవరకు నిలుపు కొన గలుగుశక్తి స్థానికుల కనుగ్రహింపుము, బాప్తీస్మముద్వారా నీకును, మాకును, తండ్రి బిడ్డల వరుస యేర్పడినదనియు, బాహ్య సంఘ ప్రవేశము కలిగినదనియు, నీ రాజ్యప్రవేశము ప్రాప్తించినదనియు, మొదటిసారి కుతూహల పడినట్టి మహిమగల అంతస్తు దయచేయుము. మరియు సంస్కార భోజన కాలమందున శ్రేష్టాచారములు, పాటలు, బోధలు, మా ఆత్మీయ జీవన వృద్ధికిని, నీ ఘనతకును అనుకూల పడునట్లు ఆశీర్వదించుము. ఓ దేవా! మేము యీ మందిరము విడిచి చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసెదనను వాక్యార్ధము యెక్కడ పూర్తిగా చుడగలమో ఆ పరలోక మందిరములోనికి చేరువరకును ఆ మందిరము కళ యీ మందిరమునకును ముందు అనుభవమునకు అందించుము. ఈ మా ప్రార్ధనలు, స్తుతులు, స్తోత్రములు మొదలగునవి ఫలించునట్లు నీ ప్రియ కుమారుడును, పెండ్లికుమారుడుగా వచ్చుచున్న మారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము, ఆమెన్.

         కీర్తన:- కానుక సేకరణ సంఘపెద్దలు

 కానుకల కొరకైన ప్రార్ధన:- స్థానిక సంఘ గురువు.

 నివేదికను సమర్పించుట:- కార్య నిర్వాహకులు.

 వందన సమర్పణ:-

 ముగింపు ప్రార్ధన:- ప్రభువు ప్రార్ధన దీవెన.
Please follow and like us:
9. ఆలయ ప్రతిష్టారాధన
Was this article helpful to you? Yes 1 No

How can we help?