సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. 7. పనివారిని ఏర్పర్చుట

7. పనివారిని ఏర్పర్చుట

బో: ప్రియులారా దేవదూతలు చేయవవలసిన సువార్తపని మానవులైన మనకు ప్రభువు అప్పగించుటవల్ల మానవ సంతతిని సన్మానించుచున్నాడు. మరియు సువార్త ప్రకటింపవలసిన గొప్ప భారము మన మీద పెట్టియున్నాడు. అన్ని వుద్యోగములకంటెను యీ ఉద్యోగము గొప్ప వుద్యోగమని మీరు గ్రహించుకొనండి. జీతము లేకుండ వుచితముగ సువార్త ప్రకటించుటయే జీతమని పొలు చెప్పిన మాటలలో గొప్ప విలువయున్నది.మీరు నేర్చుకొన్న సువార్త సంగతులు మీరు యితరులకు బోధించుచున్నప్పుడు సమయోచితమైనవాక్కు మీకనుగ్రహింపబడునుగాక. ఈ పని మిక్కిలి భారమైన పనియెనప్పటికిని దేవునివల్ల ననుగ్రహింపబడిన పని గనుక యెక్కువ పూచీ గల పనియని మీరు యోచించుకొనండి. దేవుడే మీ యధికారియు, మీ పనికి మంచి ఫలమిచ్చు వాడు నైయుండి మిమ్మును పోషించుచు, ఆదరించుచు, ఆత్మలను తనయొద్దకు పోచేసికొని వచ్చు పనిలో ఆయనే మీకు సహకారిగానుండును. వాక్య సేవకుడనైన నేను మీకు రావలసిన దీవెనను సంఘముయెదుట ప్రకటించుచున్నాను.

   తండ్రియైన దేవుడు మీ మనస్సులో నూత నమైన ఆలోచనలు కలుగచేయును గాక! కుమారుడైన తండ్రి మానవుల నిమిత్తమైఅవతారధారియెయున్న కాలములో చేసియున్న పని మీకు జ్ఞాపకము చేయును గాక! పరిశుద్ధాత్మయైన తండ్రి మీకు ఉజ్జీవము కలిగించుచుండును గాక! త్రియేక దేవుని దీవెన మీకు లభించును గాక!

                             ప్రమాణము

    బైబిలు మిషను అప్పగించు ఈ పనిని ప్రభువే అప్పగించుచున్నాడని నేను నమ్ముచు సంతోషముతో యీ పనిని తీసికొని నా జ్ఞానమును, విశ్వాసమును, సామర్ధ్యమును వాడుకొనుచు పనులన్నియు ప్రభువు సహాయమును బట్టి చక్కబెట్టుకొందునని ప్రమాణము చేయుచున్నాను. నేను వాక్యప్రకారముగాను, ప్రభువిచ్చు ప్రత్యక్ష ప్రకారముగాను, ఆత్మ నడుపుదల ప్రకారముగాను యీ పని చేయ నిశ్చయించుకొనుచున్నాను.

                            ఆశీర్వాదము

అ. కా ర్య 13:1. 2 1:8. రొమా 12:8. 1కొరింధి 9:7-14. ఎఫెసి 4:11:12, గలతి 6:6. కొలస్సై 1:28, 3:15-16.2తిమోతి 4:5, హెబ్రి 13:16-17.
7. పనివారిని ఏర్పర్చుట
Was this article helpful to you? Yes 4 No

How can we help?