సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. 4. బాప్తీస్మ ఆరాధన క్రమము

4. బాప్తీస్మ ఆరాధన క్రమము

                          వాక్య పఠనము

  మత్తయి 28:19 మార్కు 16:16-17, రోమా 6:3, 4:6 1కొరింధ్ 12:13.

కీర్తన “ఘనపరచుడీ దేవుని”

                             బోధకుడు

 తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు 

నామమున-ఆమెన్.

  ప్రియులారా! మనుష్యులందరు పాపజన్మము,పాపజీవితము గలవారు 

గనుక వాక్యప్రకారము మారుమనస్సు పొంది ప్రభువునొద్దకు నిత్యరక్ష్ణార్ధమై

రావలసియున్నది. రక్షణ కావలయునని కోరు విశ్వాసికి రక్షణ

అనుగ్రహింపబడినదని తెలియగలందులకును విశ్వాసిని భూలోక సంఘములో

బాహాటముగా ప్రభువు చేర్చుకొనుచున్నాడను సంగతి నిశ్చయముగా తెలియ

గలందులకును బాప్తీస్మ క్రమమును మనము గైకొనుచున్నాము.

  బాప్తిస్మము కొఱకు మీరిక్కడికి వచ్చియున్నారు కాబట్టి బైబిలుమిషను 

బోధకుడనైన నేనిప్పుడు మిమ్మును అడుగు ప్రశ్నలకు మీరు త్రిత్వ దేవుని

యెదుటను ఆయన పరిశుద్ధులందరి యెదుటను ప్రమాణము చేయవలెను.

 1. ప్రశ్న: నీవు సాతానును, వాని సర్వకార్యములను విడిచి 

పెట్టుచున్నావా?

  జ: ఔను విడిచిపెట్టుచున్నాను.

        2. ప్ర: బైబిలను గ్రంధమునందు వ్రాయబడిన సంగతులన్నియు 

నిజమని నీవు నమ్ముచున్నావా?

 జ: ఔను నిజమని నమ్ముచున్నాను.

 3. ప్ర: బైబిలు బోధించునట్టి ధర్మములన్నిటి ప్రకారము నడుచుకొందువా?

 జ: ఔను నడుచుకొందును.

 4. ప్ర: బైబిలు మిషను ఒప్పుకొనునట్టియు నీవు నేర్చుకొన్నట్టియునైన 

ఒప్పుదలలను ఒప్పుకొనుచున్నావా?

 జ: ఔను ఒప్పుకొనుచున్నాను.

 5. ప్ర: రక్షణకు నీళ్ళబాప్తీస్మమెంత అవసరమో ఆత్మీయ జీవనముయొక్క 

వృద్ధికి పర్శుద్ధాత్మ బాతీస్మమంత అవసరమని నమ్ముచున్నావా?

 జ: ఔను, నమ్ముచున్నాను.

 6. ప్ర : విశ్వాసులకు బైబిలు గ్రంధకర్తయైన దేవుడు కాలమును, 

అవసరమునుబట్టి క్రొత్త సంగతులను తెలియపరచునని నమ్ముచున్నావా?

 జ: ఔను నమ్ముచున్నాను.

 7. ప్ర: లోకములోనున్న అన్ని మిషనులవారును బేదాబేధములైన 

సిద్ధాంతములు కలిగిన వారెప్పటికిని ప్రభుయేసు యెడలగల భక్తి మార్గము

నుపదేశించుచున్నారని నమ్ముచున్నావా?

 జ: ఔను నమ్ముచున్నాను.

 8. ప్ర: కష్టస్థితులలోను, నిరాశ సమయములోను, దేవుని వాగ్దానములు 

చదువుకొని, ప్రార్ధించి, స్తుతించి కనిపెట్టుటవల్ల నూతనమైన ఆదరణ పొంద

ప్రయత్నించెదవా?

 జ: ఔను ప్రయత్నించెదను.

 9. ప్ర: పెండ్లికుమార్తె యెత్తబడు రెండవ రాకడ మిక్కిలి సమీపమై 

యున్నదని నిరభ్యంతరముగా నమ్మి అందు విషయమై సిద్ధపడుదువా?

 జ: ఔను, సిద్ధపడుదును.

10. ప్ర: ఏ విశ్వాస్సములోనికి బాప్తిస్మము పొందవలెనో ఆ విశ్వాస 

ప్రమాణము చెప్పుము.

 జ: (విశ్వాస ప్రమాణము చెప్పవలెను లేక చెప్పించవలెను)

                          విశ్వాస ప్రమాణము

  దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను మానవ 

రక్షణార్ధమై బైలుపడినాడనియు, పనులనుబట్టి వారు ముగ్గురుగా కనబడినను

ఒక్కరై యున్నారనియు (త్రియేకత్వము) ఆయన సమస్త మానవులకు

తండ్రియు, దేవుడును, సర్వమునై యున్నాడని నమ్ముచున్నాను.

  దేవుడే నరావతారధారియై యేసుక్రీస్తను పేరున భూలోకమునకు వచ్చి 

మానవులకు అవసరమైన సంగతులు నుపదేశించి అద్భుతములగు

ఉపకారముల మూలముగా మానవుల నాదరించిచివరగా సిలువ వేయబడి,

చనిపోయి, తిరిగిలేచి, పరలోకమునకు వెళ్ళి త్వరగా రానై యున్నాడనియు,

తన రాకడలో ఎత్తబడక, మిగిలిన వారికి యేడు సంవత్సరములు శ్రమలు

వచ్చుననియు, ఆ మీదట ఆయనే భూమిమీదికి వచ్చి వెయ్యిసంవత్సరములు

నీతి పరిపాలన చేయుననియు ఆమీదట అంత్యతీర్పనియు నమ్ముచున్నాను.

పరిశుద్ధ బాప్తీస్మము నీళ్ళతో యిచ్చినది దేవుని రాజ్యములో ప్రవేశించుటకు

ద్వారమని నమ్ముచున్నాను భూలోక క్రైస్తవ సంఘములో ప్రవేశింపగోరువారు

యీ బాప్తీస్మములేనిదే సభ్యులుగా నుండనేరని నమ్ముచున్నాను. ప్రభుభోజన

సంస్కారమునందు విశ్వాసికి అంతరంగముగ క్రీస్తు యొక్క శరీర రక్తములు

అందునని నమ్ముచున్నాను. ప్రభు భోజనము పుచ్చుకొన్న కొందరు రోగులు

బాగుపడుదురని నమ్ముచున్నాను.

 క్రైస్తవులందరు యేసుప్రభువు యిచ్చు పరిశుద్ధాత్మ బాప్తీస్మము పొంది ఆ 

ఆత్మయిచ్చు కృపావరములను ఆయన చిత్తానుసారముగా వాడుకొనుటకు

పరిశుద్ధాత్మ బాప్తీస్మము పరలోకసభ్యత్వమునకు గుర్తని నమ్ముచున్నాను.

యేసుక్రీస్తుగా వచ్చిన దేవుడుగాక మరెవ్వరును లోక రక్షకులు కారనియు, యే

మతస్తులైనను యెక్కడో, యొక్కప్పుడాయనను గూర్చి విందురనియు దేవుని

తట్టు తిరుగుటకు కావలసినంత గడువు అందరకు దొరుకుననియు అంతవరకు

యెవరికి మోక్ష నరకములు నిర్ణయము కలుగదనియు నమ్ముచున్నాను.

సర్వజన రక్షణార్ధమై యేర్పడిన మతము క్రైస్తవ మతమనియు, గ్రంధమును

బట్టి కాక, అభిప్రాయ భేదములను బట్టి అవి యెన్నో మిషనులనుగా

చీలిపోయినను ఏక దేవుని, ఏక రక్షకుని, ఏక మోక్షమును, యేక గ్రంధమును

సూచించుచున్నవని నమ్ముచున్నాను.

  దేవుని చర్యలు మానవ జ్ఞానమునకు గ్రాహ్యము కానప్పుడు 

తర్కములోనికి వెళ్ళక ఆయనచేయు సమస్తమును, ధర్మయుక్తమైనదని

నిశ్శబ్ధముగా ఊరకుండుటయే క్షేమమని నమ్ముచున్నాను. ఆమెన్.

                                 బాప్తీస్మము

బోధకుడు: బాప్తీస్మము పొదువారిని పేరుతో ………………. పిలిచి ప్రభువైన

యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా యంగీకరించుచున్నావా?

జ: అవుంగీకరించుచున్నాను.

బాప్తీస్మము పొందవచ్చినవారు మోకరించియుండగా గురువు ముమ్మారు

నీళ్ళుపోయుచు ఈలాగున చెప్పవలెను.

        (లేక నీళ్ళలో ముంచుచు)

బో: నీ వాయనను నీ స్వకీయ రక్షకునిగా అంగీకరింతువనివాగ్ధానము

చేసియున్నావు. కాబట్టి వాక్యసేవకుడవైన నేను నిన్ను కలుగజేసిన

తండ్రియొక్కయు, నిన్ను రక్షించిన కుమారుడైన త్ అండ్రి యొక్కయు, నిన్ను

ప్రోత్సాహపరచిన పరిశుద్ధాత్మ తండ్రియొక్కయు మహాపరిశుద్ధ నామమున

నీకు బాప్తీస్మమిచ్చుచున్నాను.

 [బోధకుడు బాప్తీస్మము పొందినవారి నొసటమీద సిలువగురుతు 

వేయవలెను.]

                        దీవెనలు 

 నీకు బాప్తీస్మమువల్ల కలుగవలసిన మేళ్ళన్నియు కలుగునుగాక!

                        ప్రార్ధనలు

1) ఓ ప్రభువా! నీవు ఏ పని మీద పిలిచినావో ఆ పని యావత్తు అగు వరకు

వారికి తోడ్పడుమని నిన్ను వేడుకొనుచున్నాను.

2) తప్పిపోయిన కుమారులను చేర్చుకొను తండ్రి! ప్రయాసపడి భారము

మోసికొనుచున్న సమస్తమైన వారలారా! నా యొద్దకు రండని పిలుచుచున్న

తండ్రీ! సువార్త వర్తమానముద్వారా యీ నీ బిడ్డలను తీసికొని వచ్చిన తండ్రీ,

యీ నీ పనుల నిమిత్తము యీయనను నీ సన్నిద్దిలో కాపాడుచు,

నడిపించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.

    నీకు సమాదానము కలుగును గాక

                   చందా

     (అందరు) ప్రభువు నేర్పిన ప్రార్ధన చెప్పవలెను.

              ముగింపు ప్రార్ధన: దీవెన.

    మత్తయి 3:11. మార్కు 1:5,8. లూకా 3:16. యోహాను 1:31; 33. 

లూకా 7:29-30.

    మత్తయి 28:19. మార్కు 16:15,16. అ.కా. 1:5.    అ. కా. 8:16. 10:48. 19:5 22: 16. 2: 38. 1కొరింధి 12:13. ఎఫెసి 

4:15.

    యోహాను 3: 1-8. రోమా 6:3. 1కొరింధి 10:2. గలతి 3:27. కొలస్సై 

2:12.

    తీతు 3:5,6. 1 పేతురు 3: 21.
Please follow and like us:
4. బాప్తీస్మ ఆరాధన క్రమము
Was this article helpful to you? Yes 1 No

How can we help?