సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. 14. కాలోచిత ప్రార్ధనలు
 5. నూతన సంవత్సర ప్రార్ధన

నూతన సంవత్సర ప్రార్ధన

 ద్వితి 11:12, కీర్తన 65:8-13. 2పేతురు 3:8. ఆది 1:14. యోబు 36:11-26. కీర్తన 61:6; 90:1-4. 102:27; యెషయా 29:1 హబక్కూకు3;2 గలతి 4:10.

      "నీ ముఖ కాంతి మామీద ప్రకాశింపజేయుము" కీర్తన 67:3.

1. ఓ ప్రభువా నీ ముఖ కాంతి మామీదను, నీసృష్టిమీదను ప్రకాశింపజేయుము. మాజీవిత కాలమంతయు నీ రాకడ వరకు సంఘము మీద నీముఖకాంతి ప్రకాశింపచేయుము.
 1. భూలోకము మీద నీ ముఖ కాఖ కాంతి, ప్రకాశింప జేయుము. ఆకాశముమీద నీ ముఖ కాంతి ప్రకాశింపజే జేయుము. ఇచ్చట మా అందరిపై నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము.
 2. పాపములతోను, పాప ఫలితములైన వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యము, ధనాపేక్ష, మొదలగు చీకటిలో నున్న భూమిపై సూర్య ముఖకాంతి చంద్ర ముఖకాంతి నక్షత్రముల ముఖకాంతి ప్రకాశింప జేసినట్లు, ప్రభువా! నీముఖకాంతి ప్రపంచముపై ప్రకాశింప జేయుము.
 3. భూతములు చెలరేగుచు, నీరక్షణ కార్యమునకు భిన్నమైన పనులు చేయించుటనుబట్టి మతభేధములతోను, సిద్ధాంత బేధములను బట్టి వివాదములతోను ప్రపంచము చీకటియైనది గనుక నీముఖకాంతి ప్రపంచముపై ప్రకాశింపజేయుము.
 4. నీ సంఘము నీవిచ్చిన వాక్యమును అపార్ధము చేసికొనుటను బట్టి వాక్యముపై ఒకరీతిగా చీకటి క్రమ్మినను, చివరి గ్రంధమగు ప్రకటన గ్రంధము మీద నీవు బేటరిలైటువేసి అందున్న మర్మములు లోకమునకు బయలుపడునట్లు నీముఖకాంతిని ప్రకాశింపచేయుచున్నదులకు నీకు వందనములు.
  1. అధికమైన చీకటికార్యములు నీ రాకడకు ముందు జరుగుచున్నందున నీవాక్యములోని అనేక వచనములయొక్క నిజార్ధము నీ సంఘమునకు తెలియుటలేదు. నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుట వలన నీ వాక్యార్ధము బయలుపడును గనుక ప్రకాశింపజేయుమని వేడుకొనుచున్నాను.
 5. చీకటిలోనికి దీపకాంతి రాగానే అనేక వస్తువులు ఎక్కడెక్కడ నున్నవి ఏమి ఉన్నవి తెలియును. అలాగే నీ వాక్యము నందలి నిజార్ధము గ్రహించునట్లు నీ వాక్యముపై ముఖకాంతిని ప్రకాశింపచేయుము.
 6. వాక్య ప్రకటన చేయు వారు వాక్యమును వారనుకొన్నట్లుగాక నీ చిత్తానుసారముగా బోధించునట్లు నీ ముఖకాంతి వారిపై ప్రకాశింపచేయుము.
 7. అనేకులు నీ సత్యము చెవులతో విన్నను మనస్సుతో గ్రహింపలేక చీకటి వారిని ఆవరించియున్నది. అట్టివారిపై నీముఖకాంతి ప్రకాశింపజేయుము.
 8. సూర్యకాంతి నీటిమీద, చెట్లమీద, పంటల మీద ఇతర మంచిస్థలములమీద మాత్రముకాక గత్తర స్థలములమీద కూడ ప్రకాశించుచున్నది. అట్లే పాపులమీదను, నిన్నాంగీకరింపని వారిమీదను నీ ముఖకాంతిని ప్రకాశింపజేయుము.
 9. శతాబ్దములు గతించిపోగా, పాతసంవత్సరము గతించిపోగా, ఇంకా చీకటి ఎక్కువగుచున్న ఈ సమయమున మరెక్కువ వెలుగు, సత్యబోధ అవసరము గనుక ఈ నూతన సంవత్సరమంతయు ఇంక ఎక్కువగా నీముఖకాంతి మామీద ప్రకాశింపజేయుము.
 10. నీవాక్యము యొక్క సత్యార్ధము మాకు తెలియునప్పుడు ఇతరులయొక్క కండ్లను ఎట్లు తెరువగలము? ఇతరులకెట్లు జ్ఞానము కలిగించ గలము ? గనుక నీముఖకాంతి మామీద ఎక్కువగా ప్రకాశింపజేయుము.
 11. ఈ మా ప్రార్ధనలు నీకుమారునిబట్టి అంగీకరించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.
Please follow and like us:
నూతన సంవత్సర ప్రార్ధన
Was this article helpful to you? Yes 2 No

How can we help?