ఆది 4:14 నిర్గమ 33:14 లేవి 22:3. 1దిన 16:27,33 యోబు 1:12; 2:7; 23:15. కీర్తన 31:20; 32:7, 16:11; 17:2; 51:11; 68:2, 8; 97:5. యెషయా 63:9; 64:1. యిర్మియా 52:3. లూకా 13:26. హెబ్రీ 9:24.
ప్రభువా! పరలోకమందున్న దైవసన్నిధి పాపభరితమైయున్న భూలోకములో మామధ్య కుదించి నీ సన్నిధి భాగ్య దీవెనలు మా కనుగ్రహించిన నీ ఘననామమునకు నమస్కారములు. ఇద్దరు ముగ్గురు నా నామందు ఎక్కడ కూడుకొందురో వారిమధ్య నేనుందునని పలికిన ప్రభువా స్తోత్రము. నీవు మాతో నున్నావని మా మనస్సు నీతో ఉంచి మా లోపములు దిద్దుకొని నీ కొరకే జీవించెదమని తీర్మానించుకొని మా సర్వము నీకు సమర్పించి నిన్ను స్తుతించి మా అంశము నీతో చెప్పుకొని నీవద్ద మౌనముగా నున్నందున సమస్త కీడులు పోయి మేళ్ళు కలుగుననియు నీవు కనబడి మాటలాడుదువనియు నీ దాసుని ద్వారా నేర్పిన నీకు స్తోత్రములు.
ప్రభువా! యోహాను పద్మసుద్వీపమున నీ సన్నిధినుండగ ఆయన నీ యాత్మ వశముననుండి నిన్ను చూచి, నీ మాట విని నీవు చూపిన సమస్తమును చూచి నీవు చెప్పినవి వినగల కృప ఇచ్చిన నీకు స్తోత్రములు.
- ఆత్మ వశము, 2. ప్రత్యక్షత. 3. ఆత్మ సంచారము. 4. పరలోక వాస్తవ్యులు మనతో నుండుట, ప్రభువా! లోకవశము, పాపవశము, సాతాను వశము కాకుండ మమ్మును నీయాత్మవశము చేయుటకు నీ సన్నిధిని యే ర్పాటుచేసి నీ పాదములయొద్ద నుండుటకు మమ్మును పిలిచిన ప్రభువా! నీకు కృతజ్ఞతావందనములు ప్రభువా! నీ పాదముల యొద్ద మమ్మునుంచి నీ ప్రత్యక్షతలను అనగా దర్శనము ద్వారా నిన్ను చూచుటకుకును, అనేక మర్మములు తెలిసికొనుటకును, నీ స్వరము వినుటకును, నీవు వ్రాసి చూపినది చూచుటకును. మా ఉహాకు నీ విషయములు అందజేయుటకు. నీ వాక్యములోని అనేక ప్రత్యక్షతలు మా కనుగ్రహించుటకును నీ సన్నిధిని మాకు సాధనముగ నిచ్చిన నీకు మా వినయ నమస్కారములు. ప్రభువా! సర్వవ్యాపివైన నీయొద్ద మమ్మును ఉంచి నీ రూపమునకు మమ్మునుగూర్చి నీసన్నిధిబిడ్డలయొక్క ఆత్మలను పరలోకమునకు భూలోకములోని ఆయా ప్రదేశములకు,పాతాళలోకమునకుకూడ తీసికొనివెళ్ళి నీ కిష్టమువచ్చినవి చూపించుట, మా నీ కిష్టమువచ్చినపని చేయించుట మొదలగు కార్యములను బలహీనులమైన మా ద్వారా చేయించుకొనుచున్న నీకు ప్రణుతులు. మరియు ప్రభువా! నీసన్నిధివలననే నీ విశ్వాసులకు నీతోను, నీ దూతలతోను పరలోకమందున్న పరిశుద్ధులతోను అనగా పరలోక వాస్తవ్యుల సహవాసభాగ్యము మా కనుగ్రహించిన నీకు నుతులర్పించుచున్నాను. ఆమెన్.
దైవ సన్నిధి