సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. 1. ఆదివారపు ఆరాధన

1. ఆదివారపు ఆరాధన

కనిపెట్టుట

(ఆరాధన కనిపెట్టు సమయము వరకు నిశ్శబ్దముగా కనిపెట్ట వలెను

సభ నిలువబడిఉండగా బోధకుడు ఆల్టరు వైపునకు తిరిగి మోకరించి

ప్రార్ధించవలెను.) – ప్రార్ధన-

బో : మహా పరిశుద్ధుడవగు దేవా: మహా గౌరవ పాత్రుడవగు దేవా!  తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ యను త్రైకదేవా! మా ప్రియుడవైనతండ్రీ! నీవు

దివ్య లక్షణములు గల దేవుడవు గనుక నీకనేక నమస్కారములు.

నిన్నారాదించు స్థలమునకు నన్ను రానిచ్చినందుకు నీ కనేక స్థోత్రములు.

నిన్నారాదించు భాగ్యము అనుగ్రహింతువని ముందుగానే నమ్మి నిన్ను స్తుతి

చేయుచున్నాను, తండ్రీ. నిన్నారాదించు గడియ యందు నాతలంపులను.

ఆరాధనలోని ప్రతి సంగతి తట్టు త్రిప్పి నిలుపుము. ఇతర సంగతులెంత

మంచివైనను ఆ మంచి సంగతులు గాని చెడ్డ సంగతులు గాని నాహృదయము

నాకర్షింపనీయకుము. నేను నిన్నారాదించు పనిమీదనే యుండి కృతజ్ఞతతో నా

హృదయమును నింపుకొనగలుగు నానందస్థితి నాలో కలిగించుము.

ఆరాధనలోని యొప్పుదలలు. సమర్పణలు స్తుతులు ప్రార్ధనలు. నీ

వాక్యములు. ఉపదేశవాక్యములు యీ మొదలగునవి నా ఉపయోగార్ధమై

వాడుకొన గల నేర్పు దయచేయుము.

  నాతో ఆరాధనలో నున్నవారికిని యిట్టికృపయే చూపుము. ఆరాధన 

జరుపువారికి గౌరవ బుద్ధి,

జాగరూకత, వార్తనందుకొని అందింపగల జ్ఞానమిమ్ము. ఆరాధనలో క్రమము

తప్పుటయు, ఆటంకములు కలుగుట జరుగుటయు, ముఖ్యముగా

నామకార్ధమైన ఆరాధన జరుగుటయు, నీ కనిష్టములై యున్నవి గనుక

యిట్టివేవియు చేరనీయకుము. ఆరాధన పొడుగున నీవుందువు. గనుక నీ

యెదుట మేమెంతో మర్యాదగాను, వినయముగాను, కూర్చుండ గల

కుదురుబాటు కలుగచేయుము. ఆరాధన యంతటి ములముగా నీ పరిశుధాత్మ

వలన ఉద్రేకము కలిగించి నీవు ఘనత కీర్తి పొందుము. పెండ్లి కుమారుడుగా

రానైయున్న నీకుమారునిబట్టి యంగీకరించుము, నీకు నిత్యారాధన

స్థొత్రములను చేయుచున్నాము. ఆమెన్.

 కీర్తన: 26 (326) "రండి యుత్సయించి పాడుదము"

బో: తండ్రికిని, కుమారునికిని, పరిశుధాత్మకును ఆది యందు ఇప్పుడు, 

యెల్లప్పుడు, యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక ?

ఆమెన్.

       పాపపు టొప్పుదల 

  బో: ప్రియులారా! ప్రభువు నందు ప్రియులారా! మనము అతి 

పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చునప్పుడు పూర్తిగా సర్వారాధనలో

ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుట

మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల

మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల

ఆయన నమ్మ దగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన

పాపములను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా

చేయును. మనము పాపము చేయ లేదని చెప్పుకొనిన యెడల ఆయనను

అబద్దికునిగా చేయు వారమౌదుము. మరియు ఆయన వాక్యము మనలో

నుండదు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు

ప్రాయచిత్తము పొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్ధోషి యని

యెంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.

     పాపము ఒప్పుకొందము

     సర్వజ్ఞుడవగు దేవా! మా పాపము లొప్పుకొనుటకును, మా 

యయోగ్యత నొప్పుకొనుటకును, క్షమాపణ దయచేయుమని వేడుకొనుటకును

నీ సన్నిధ్ని సమీపించుచున్నాము. నీవు మహా పరిశుద్ధుడవు. మేము గొప్ప

పాపులము. గనుక నీ సన్నిధికి వచ్చుటకు యేమాత్రమును

యోగ్యులముకాము. అయినను నీ యొద్దకు వచ్చుటకు నీ కుమారునిబట్టి నీవే

చనువిచ్చుచున్నావు గనుక వచ్చియున్నాము. మేము

మానవజన్మమునుబట్టి పాపులము తలంపులనుబట్టి పాపులము.

మాటలనుబట్టి పాపులము. చెడ్డవార్తలాలకింపగోరు వినువారునుబట్టి

పాపులము. చూపును బట్టి పాపులము. ఆటలను బట్టి పాపులము,

ప్రయత్నములను బట్టి పాపులము. క్రియలనుబట్టి పాపులము. నీవు క్షమించ్న

తరువాత మరల పాపములు జ్ఞప్తికితెచ్చుకొనుటనుబట్టి పాపులము. నీవు

సమస్తము యిచ్చువాడవని తెలిసియు అది లేదు, యిది లేదని

చింతించుటనుబట్టి పాపులము. నీవు నీచిత్త ప్రకారము ప్రార్ధన

లాలకించువాడవని తెలిసియు యొకానొక సమయమున మాప్రార్ధనలో ఒక

మనవిగాని సిద్దింపనియెడల నీమీద నీమీద విసుగుకొనుటనుబట్టి పాపులమై

యున్నాము. నీవు ఆపత్కాలమందు అడ్డుపడువాడవని తెలిసియు

అపాయము వచ్చునప్పుడు భయపడుటను బట్టి పాపులము. దుర్వార్తలు

వినునప్పుడు దిగులు పడుటను బట్టి పాపులము.

నీవు వాక్యములో సయోచితముగా మాకు చెప్పుచున్న సంగతులు త్వరలో

గ్రహింపలేని మందస్థితిని బట్టి పాపులము. నీ వాక్యమునకు వ్యతిరేకమైనదేదో

యది తెలిసినను దానిని విసర్జింపక పోవుటను బట్టి పాపులము. నీవాక్యమున

కనుకూలమైనదేదో యది తెలిసినను దానిననుసరించి నడువకపోవుటను బట్టి

పాపులము. నీవు పరిశుద్ధుడవును, ప్రేమరూపుడవును అగుటచేత యేకీడును

చేయవని తెలిసియు, కష్టములు నీవే పంపినావని యనుమాన పడుటను బట్టి

పాపులము.

 కష్ట సుఖములలో నిన్ను హృదయానందముతో స్తుతింప లేక పోవుటను 

బట్టి పాపులము. నీవు ఇచ్చునవి పుచ్చుకొనలేక పోవుటను బట్టి

పాపులము.మా మనస్సాక్షిమాట వినకపోవుటను బట్టి పాపులము.

మానవులకు ఆయాసముకలిగించు పనులుచేయుటను బట్టి పాపులము.

అనుమానము పుట్టించు పనులు చేయుటను బట్టి పాపులము.

   జీవరాసుల యెడల నిర్ధయగా నుండుటనుబట్టియు, సృష్టిలోని 

వస్తువులను సరిగా వాడకపోవుటనుబట్టియు పాపులము. ఏవిధముగా

చూసుకొనినను మేము పాపులమైయుండి అపవాది మీదను, వారిమీదను,

వీరిమీదను పెట్టుటనుబట్టి పాపులము.

   శోధనలు వచ్చినప్పుడు మాకు సహాయము దొరకలేదు. గాని దొరికిన 

యెడల పడకపోదుమని చెప్పుకొనుటనుబట్టి పాపులము.

 మ్రొక్కుకొన్న మ్రొక్కు తీర్చిన మా దేవుడు సంతుష్టి పడి బట్టి 

పాపులముక్షమించునని యూహించుటను. పాపులము. మా

సమస్తపాపములు సిలువ మ్రాను మీదనే తీరినవని వెంటనే నమ్మి సంతో

షపడక పోవుటను బట్టి పాపులము. ప్రధాన దూతలో దేవుడెందుకు

దుర్భుద్ధికలుగనిచ్చెను? అతనిని అప్పుడే హతము చేసి యుండిన యెడల

యింత ముప్పు రాక పోవును గదా! మొదటి నరులు పడిపోవుదురని తెలిసి

దేవుడేల ఆ చెట్టు వేసెను? అని యిట్టి ప్రశ్నలాలోచించుకొనుచు నీవు నీ వాక్య

గ్రంధములోను,సంఘ చరిత్రలోను, లోక వృత్తాంతములోను, మా

యనుభవములోను, చేసిన కార్యములోను గురించి యభ్యంతర పడుటనుబట్టి

పాపులము. నీవు చేయున దంతయు సరియేఅనియు, నీవొక సంగతి జరుగ

నిచ్చుట న్యాయమేననియు, తలంపకుండుటను బట్టి పాపులము.

             నీ కుమారుని మూలముగా మమ్ములను రక్షించుటకు 

యింత చేసియుండగా, యింత పాపులమైన మాకు రక్షణ యుండునా? యని

తర్కించుటను బట్టి పాపులము. మాకు తెలియక హృదయ రహస్యముల

నెరిగియున్న నీకు మాత్రమే తెలిసిన నేరములు కలిగియుండుటను బట్టి

పాపులము.

 నీ కుమారుని రాకడ సమీపమని నీ వాక్యము చెప్పిన గుర్తులలో 

కనబడుచున్నను యింకను రాలేదేమి? యని నిరుత్సాహపడుటను బట్టి

పాపులము.

 ఈ మా పాపముల ఒప్పుదలను అంగీకరించుము. మాపక్షము వహించిన నీ 

పరిశుద్ధ కుమారుని ముఖమును చూచి మా పాపములను క్షమించుమని

నిన్ను వేడుకొనుచున్నాము, ఆమెన్.

                               క్షమాపణ ప్రకటన 

  బో: పాపము లొప్పుకొన్న ప్రియులారా: సరియైన మనస్సుతో 

పాపములొప్పుకొని పశ్చాత్తాపపడి యిక మీదట పాపము చేయకుండ నడువ

ప్రయత్నింతునని ప్రమాణము చేసి క్షమాపణ నిమిత్తమై తండ్రి నాశ్రయించువారి

పాపములాయన క్షమించునని దైవవాక్యమును బట్టి మీకు

ప్రకటించుచున్నాను. మీ పాపములు రక్తము వలె ఎఱ్ఱని వైనను హిమమువలె

తెల్లబడునని దేవుడు యెషయాద్వారా వ్రాయించెను. దేవుని కృప

మహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు

విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది.

 బో: క్షమించిన తండ్రిని స్తుతించుదము.   సం:- ఓ జాలి గల తండ్రీ నీవు క్షమించుటకు సిద్ధముగా నున్నావనియు, 

మా పాపములు యెన్నటికిని జ్ఞాపకము చేసి కొనవనియు నీ వాక్యము వలన

తెలిసికొని నమ్మి నీకు స్తోత్రము చేయుచున్నాము. ఆమెన్.

  కీర్తన:- దేవసంస్తుతి - పల్లవి 1,5,6,7,చరణములు  బైబిలు చదువుట.  1) తండ్రి యైన దేవుని తలంచుకొనుచు 

పాతనిబంధన పాఠమును.

           2) కుమారుడైన యేసును తలంచుకొనుచు సువార్తలలోని 

పాఠమును.

           3) పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనుచు పత్రిక పాఠమును 

చదువవలెను.

                   స్థుతి పాట (ఉత్తరప్రత్యుత్తరములు)  బో: ఓ దేవా! నీ వాక్యములోనుండి మాతో మాట్లాడుచున్నావు గనుక 

స్థోత్రము.

  సంఘము: నీ వాక్యములో నీ చిత్తమును బయలు పరచినావు గనుక 

స్తోత్రము.

  బో: నీ కట్టాడలను బట్టి నేను హర్షించెదను

  సం:నీ వాక్యము నేను మరువక యుందును

  బో: నీ ఉపదేశములుములు నాకు అధిక ప్రియములు

  సం: నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపుము.

  బో: నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను.

  సం: అవి నాకు ప్రియములై యున్నవి.

  బో: నీ యాజ్ఞలన్నియు నమ్మదగినవి.

  సం: మాకు సహాయము చేయుము

  బో: యెహూవా! నీమాట చొప్పున,

  సం: నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు  

   బో: ఆహారము వలననే కాక నీవు సెలవిచ్చిన

 సం: ప్రతి మాటవలన నరులు బ్రతుకుదురు.           రెండవ స్తుతి పాట                      బో: ఆకాశమును, భూమియు గతించునుగాని,   సం: నీ మాటలు ఏమాత్రమును గతింపవు         

     బో: ప్రభువా! యెవని యొద్ధకు వెళ్ళుదుము?

     సం: నీవె నిత్యజీవపు మాటలు గలవాడవు.

     బో: నీ వాక్యము సజీవమై బలముగలదై.

     సం: రెండంచులు గల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి

     బో: ప్రాణాత్మలను, కీళ్ళను మూలుగులను,

     సం: విభజించునంతమట్టుకు దూరుచు

     బో: హృదయముల యొక్క తలంపులను, ఆలోచనలను

     సం: శోధించుచున్నవి.

     బో: నీవు సృజించిన వాటిలో

     సం: మేము ప్రధమ ఫలముగా నుండునట్లు

     బో: సత్య వాక్యము వలన మమ్మును,      

     సం: నీ సంకల్ప ప్రకారము కంటివి.

     బో: తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును,

     సం: ఆదియందు యిప్పుడును ఎల్లప్పుడును, యుగయుగముల 

యందుండునట్లు మహిమ కలుగునుగాక! అమెన్ .

. విశ్వాస ప్రమాణము

   దేవుడు ఆది అంతము లేని దేవుడు అని నమ్ముచున్నాను. ఆయన 

ప్రేమ, న్యాయము, పరిశుద్ధత,

శక్తి, జ్ఞాము, విశ్వాస్యత యీ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా

తేజోమయముగా

ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. లోకములు పుట్టక ముందే ఆయన

నన్ను తలంచుకొని యున్నాడనియు, భూమి, ఆకాశముల సృష్టిలో నాకు

కావలసిన సదుపాయములను నా శరీరాత్మల రక్షణను అనాదిలోనే

ఆలోచించుకొనుచు నన్ను ప్రేమిచెననియు దేవదూతలను, సర్వ లోకములను

మానవులను ఆయన పరిశుద్ధముగానే సృజించెననియు నమ్ముచున్నాను.

మంచినే గాని చెడుగును ఆయన కలుగ జేయలేదని అనగా సాతానును

పిశాచములను, వ్యాధులను, ముళ్ళను, నష్టములను కష్టములను,

మరణములను, నరకమును ఆయన కలుగజేయలేదని నమ్ముచున్నాను.

దేవుడును, దూతలును ఎల్లప్పుడు నా యొద్దనున్నారని ఆది తల్లితండ్రులు

పాపములో పడగానే ఆయన రక్షకును పంపెదనని ప్రకటించినాడని

నమ్ముచున్నాను.

  నరులను రక్షించు పనిమీద ఆయన కాలక్రమమున 

తండ్రిగాను,కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను బయలు పడినాడనియు

ముగ్గురుగాక ఒక్కడుగానే యున్నాడనియు, యిది నా గ్రహింపునకు

అందకపోయినను నమ్ముచున్నాను.

  ఆయన రక్షకుని రాకడవార్త చాలకాలము వరకు ప్రకటన 

చేయించినాడనియు తుదకు యేసుక్రీస్తు ప్రభువుగా నరరూపమున

యీలోకమందు ప్రత్యక్షమైనాడనియు నమ్ముచున్నాను.

సర్వలోక రక్షకుడు జన్మింప గలందులకు దేవుడొక జనాంగమును సర్వ

జనాంగములోనుండి విడదీసి వారి నిమిత్తమై ఎన్నుకొని ఆ జనాంగమగు

యూదులకు దైవ విషయములను బోధించి, సిద్ధపర్చి వారి ములముగా సర్వ

మతముల వారికిని రక్షణ వార్త నందించుచున్నాడని నమ్ముచున్నాను.

  యింత మాత్రమున అన్ని మతముల వారిని ఆ సర్వ దయాళుడు విడిచి 

పెట్టక వారిలోని మనస్సాక్షి మూలముగ వారికిని ధర్మము లుపదేశించుచు

వచ్చుచున్నాడనియు, సర్వలోక సృష్టిలోని మహత్కార్యములను బట్టి తన

శక్తిని, ప్రేమను, జ్ఞానమును పరిశుద్ధతను, న్యాయమును, ప్రదర్శించుచు

వచ్చుచున్నాడనియు నమ్ముచున్నాను. అయినను ఆయన యెంతగా

వారి పాపములను మాత్రము ప్రేమించలేడనియు, మానవులు పాపములు

విసర్జించు నిమిత్తమై పాపముల విషయములో భయంకరుడై, గుణవంతులు

జేయుటకు శిక్షలు రానిచ్చు మంచి యుద్ధేశములు గలవాడనియు

నమ్ముచున్నాను.

  శ్రీ యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుష్యుడుగాను, అనాది 

స్థితినిబట్టి

దేవుడుగాను సంచరించుచు, దివ్య బోధల మూలముగాను, అద్భుతములగు

ఉపకారముల మూలముగాను, నా పాపములు నా వ్యాధులు, నా శిక్షలు తన

సిలువ మ్రానుపై వేసికొని మరణమౌట మూలముగాను తన నిజదైవ స్థితిని,

ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను.

  ఆయన రెండవ రాకడకుముదుగా కొన్ని గుర్తులు జరుగనిచ్చి రాకడలో 

పాల్గొన వీలుండుటకై సర్వత్ర విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను

కుమ్మరించుననియు తరువాత మృతులై యుండిన విశ్వాసులను లేపి,

సజీవులైన విశ్వాసులకు మరణము లేకుండ జేసి మహిమ శరీరము ధరింప

జేసి వారిని, వీరిని, పెండ్లికుమార్తెగా కొనిపోవుటకై పెండ్లికుమారుడుగా మిక్కిలి

త్వరలో వచ్చుచున్నాడని నమ్ముచున్నాను.

  పిమ్మట భూమిమీద మిగిలిపోయిన వారికి యేడేండ్లు మహాశ్రమలు 

విస్తరించుననియు, ఆ శ్రమకాలములో ననేకమంది విశ్వాసులగుదురనియు

అటు పిమ్మట ఆయన భూమి మీదికి వచ్చి యేడేండ్ల రాజ్యాధికారియగు అంతి

క్రీస్తును అనగా క్రీస్తు విరోధిని,అబద్ధ ప్రవక్తను, అగ్ని గుండములో వేసి

సాతానును వెయ్యియేండ్లు చెఱసాలలో బందించు ననియు నమ్ముచున్నాను.

  ఆ శ్రమలలో అనేకులు రక్షణ పొందుదురని నమ్ముచున్నాను. ఆ పిమ్మట 

ఆయన క్రొత్తరూపము దాల్చి సర్వ లోకమునకు రాజై వెయ్యేండ్లు నీతి పరిపాలన

చేయుచు అప్పుడే పరిశుద్ధుల చేత సత్య సువార్త ప్రకటింప జేయుననియు

అందుచేత చాలమంది భక్తులగుదురనియు నమ్ముచున్నాను.

  తరువాత వెయ్యేండ్లు సువార్తవిన్న సజీవులలో నెందరు సువార్తను 

అంగీకరింతురో కనబరచుటకై గొర్రెలు, మేకలను పోలిన సజీవుల తీర్పొకటి

యేర్పర్చుననియు నమ్ముచున్నాను.

  మరియు వెయ్యేండ్ల చివర సాతానును విడుదల చేసి ఆ విడుదల 

కాలములో సహితము అతడు అగుపరచిన తిరుగుబాటును బట్టి అతని నిత్య

నరకాగ్నిలో పడవేయుననియు నమ్ముచున్నాను.

  ఆదామునుండి అప్పటి వరకు సమాధులలో నున్న అవిశ్వాసులను లేపి 

నిత్యమగు తీర్పు వినిపించుననియు నమ్ముచున్నాను.

  నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను, 

కుమారునితోను, ఏక దేవుడుగానే యుండి పనిచేయుచున్నాడనియు, ఈయన

ఆవేశము వలననే దైవ గ్రంధము వ్రాతలోనికి వచ్చినదనియు,ఈయన

వెలిగింపునుబట్టియే ఆ గ్రంధము అర్ధమగుననియు, తండ్రి ఉద్ధేశించిన రక్షణ

అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తమువలన గడించి పెట్టిన రక్షణ

పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు, క్రైస్తవ జీవితము వృద్ధి

నొందునట్లు పరిశుద్ధాత్మయే పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా లభించుననియు తండ్రి

కుమారులతోపాటు ఈయన కూడ సమానముగా ఆరాధన నొందదగు

దేవుడనియు నమ్ముచున్నాను.

  తండ్రి తండి, కుమారుడు. తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి అయినను 

తండ్రులు ముగ్గురు కారనియు, ఒక్కడే అనియు, తండ్రి దేవుడు కుమారుడు

దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడైనను, దేవుడు ముగ్గురు కారనియు, మానవుల

రక్షణార్ధమై దేవుడట్లు బయలు పడినాడనియు ఆయన నా తండ్రియు, నా

దేవుడును, నా సర్వమునై యున్నాడని నమ్ముచున్నాను.

 నరులకు కలుగు కష్టనష్టములకు దేవుడు కారకుడు కాకపోయినను వారిని 

తన తట్టు త్రిప్పుకొనుట కట్టి సమయముల నాయన వాడుకొనుననియు

నమ్ముచున్నాను.

    సర్వజనులు దైవ జనులగు నిమిత్తమై దైవ వార్త ప్రకటన 

యగుచున్ననూ యింక అనేకమంది కవి యందకపోవుచుండుటనుబట్టియు,

దేవుడు వారి మరణాంతమున హేడెస్ లోవారికి బోధ చేయించుచు అక్కడ

నమ్మువారిని రక్షించుచున్నాడనియు నమ్ముచున్నాను.

   యేసుక్రీస్తుగా వచ్చిన దేవుడుగాక మరెవరును లోకరక్షకులు 

కారనియు, ఏ మతస్తులైనను ఎక్కడో యొకప్పుడు ఎప్పుడో యొకప్పుడు

ఆయనను గురించి విందురనియు, దేవుని తట్టు తిరుగుటకు

కావలసినంతగడువు అందరకు దొరుకుననియు, అంతవరకు యెవరికిని, మోక్ష

నరకముల నిర్ణయము కలుగదనియు నమ్ముచున్నాను.

   ఈ సంగతులన్నియు యిమిడియుండి దేవుని మనస్సును 

చూపించుచున్న బైబిలను గ్రంధము దేవుడు మానవులకు దయచేసిన

గ్రంధమని నమ్ముచున్నాను.

   ఈ గ్రంధము ననుసరించిన సర్వజన రక్షణార్ధమై యేర్పడిన మతము 

క్రైస్తవ మతమనియు గ్రంధమును బట్టి కాక అభిప్రాయ బేధమును బట్టి అది

యెన్నో మిషనులుగా చీలిపోయినను ఏక దేవుని ఏక రక్షకుల, ఏక

మోక్షమును, ఏక గ్రంధమును సూచించుచున్నదనియు నమ్ముచున్నాను.

ఆమెన్.

 దేవుని చర్యలు నాజ్ఞానమునకు తెలియనప్పుడు తర్కములో పడిపోక 

దేవుడు చేయు సమస్తమును ధర్మయుక్త మైనదని నిశ్శబ్ధముగా

యూరకుండుట నాకు క్షేమమని నమ్ముచున్నాను. ఆమెన్

                           ప్రసంగము

                            ప్రార్ధన

 ఓ తండ్రీ! ప్రార్ధన నాలకించు తండ్రీ, ఎందుకనిన నీవు మా ప్రార్ధన 

వినువాడవని మేము నమ్మగల వాగ్ధానము లనేకములు వ్రాయించి

యిచ్చినావు. నీవే స్తొత్రమునకు పాత్రుడవు మా ప్రభువైన యేసుక్రీస్తుద్వారా

నీవు లోకమునకు తెచ్చిన వెలుగు అన్నిమతముల వారికి తెలియకపోయినను

వారి కగత్యమైన వెలుగుండెననియు, అదిలోకములోకి వచ్చుచు ప్రతి

మనుష్యుని వెలిగించుచున్నదని నీవు వ్రాయించిన వాక్యమునుబట్టి

అందరకును నీ వెలుగు దయచేయువాడవని గ్రహించి నీకు వందనము

లాచరించుచున్నాను.

         ఇతర మతస్తులకు మాప్పనస్సాక్షి ద్వారాను సృష్టిద్వర్రాను, 

నిన్ను గురించి తెలియపరచుచున్నందుకు నీ కనేక వందనములు, నీవు

బయలుపరచిన రక్షణ వృత్తాంతము పాపులకు పూర్తిగా తెలిసిన నీ యందు భక్తి

కుదుర్చుకొనుట యెంతో సుళువు. గనుక అది ప్రతివారికి వినిపింపజేయుము.

రక్షణపొందుటకు కందరికి గడువు దయచేయుమని విశ్వాసులెన్నో

యేండ్లనుండి చేయుచున్న మనవి నీవు తప్పక నెరవేర్తువని నమ్ముచు నిన్ను

స్తుతించుచున్నాను. విననివారు, విన్నవారు, వినియును గ్రహింపనివారు,

గ్రహించినను నమ్మనివారు, నమ్మియు తుదివరకు స్థిరముగా నుండనివారు

కలరు. వారిలో యెవరెవరికెట్టి సహాయమవసరమో వారికెట్టి సహాయము

దయచేయువాడవని తెలిసి నిన్ను స్తుతించుచున్నాను.ఇది రెండవమారు

రానైయున్న మా యేసుప్రభువు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాను.

అమెన్.

                 కీర్తన పాడుచుండగ చందా యెత్తబడును.

                        చందా కొరకైన ప్రార్ధన.

                         ముగింపు ప్రార్ధన

                            దీవెన. 
Please follow and like us:
1. ఆదివారపు ఆరాధన
Was this article helpful to you? Yes 3 No 1

How can we help?