సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. దైవిక స్వస్థత

దైవిక స్వస్థత

ఆది 20:17. నిర్గమ15:26. సంఖ్య 12:10-14, 21:4-9. 1 రాజులు 13:4-6; 17:17-24. 2 రాజులు 1 అ|| 4:8-32.37. 5:1-14; 20,17. 2 దిన7-14; 16:12-14. యోబు 33:25. కీర్తనలు 6:2; 30:2 41:3; 92:15; 103:1-5; 107:20 సామెత 3:7-8, 4:20-22 యెషయా 19:22; 38:1-9, 53:4-5 యిర్మియా 17:14. జెకర్యా 12:5 మలాకీ 4:2 మత్తయి 4:23-24; 8:2-13; 9:2-8; 20:22; 27:31 12:9-15; 14:34-36; 15:29-31; 19:1-2; 20:29-34; 21:14, 15; 26:51. మార్కు 1:40-49; 2:1-12 6:53-56; 8:22-26; 14:47. లూకా 5:12-26; 7:1-10. 13:10-17; 18: 11-19. 22:50, యోహాను 4:46-54;5:1-9; 10:38; 18:10-11 కార్య 3:1-10, 46; 5:15,16. 8:4-8. 9:15-18; 14:7-11 1పేతురు 2:24.

    మహిమ ప్రభావముగల తండ్రీ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి యాకాశములను కలుగజేసిన తండ్రీ వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావమును వుంచిన తండ్రీ నమస్కారములు. " నిన్నుస్వస్థతపరచు యెహోవాను నేనే" అని పలికిన తండ్రీ! నీ ప్రవక్తలద్వారా నీవనేక రోగులను స్వస్థపరచిన నీకు నుతులు.      మహిమ ప్రభావముగల తండ్రీ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి యాకాశములను కలుగజేసిన తండ్రీ వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావమును వుంచిన తండ్రీ నమస్కారములు. " నిన్నుస్వస్థతపరచు యెహోవాను నేనే" అని పలికిన తండ్రీ! నీ ప్రవక్తలద్వారా నీవనేక రోగులను స్వస్థపరచిన నీకు నుతులు. 

  కుమారుడవైన ! నీవే స్వయముగా నీ ప్రభావముచేత రోగులను స్వస్థపరచిన నీకు నుతులు. ప్రభువా! పక్షవాత రోగి నీ వద్దకు తేబడి నిన్ను అడుగకపోయినను వాని హృదయములో నున్న కోరికనుబట్టి స్వస్థపరచిన నీకు వందనములు. దేవ మానవుడవైన ప్రభువా! సేన దయ్యములు పట్టినవాడు నిన్నుచూచి నమస్కరించిన చర్యనుబట్టి అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు.

  జీవమైన తండ్రీ! ఒక అధికారి వచ్చి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమెమీద వుంచుము. ఆమె బ్రతుకుననెను. అధికారి నిన్ను వేడిన ప్రకారమే వెళ్ళి ఆ చిన్న దానిని స్వస్థపరచిన నీకు ప్రణుతులు.

  ఏర్పాటు రక్షకుడవైన ప్రభువా! కనాను స్త్రీ వచ్చి కుమార్తె స్వస్థత కొరకు ప్రాధేయపడి అడుగగా ఆమె కుమార్తెను బాగుచేసిన నీకు వందనములు. పరిశుద్ధుడవైన తండ్రీ! పదిమంది కుష్టురోగులు మమ్మును కరుణించుమని వేడిన వారి మనవి విని మీరువెళ్ళి యాజకులను కనబరచుకొనుడని చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచు దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్థలాంతమున బాగుచేసిన నీకు స్తోత్రములు. ప్రార్ధన చేయునపుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అపుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను అని సెలవిచ్చిన ప్రభువా! మేము ప్రార్ధించిన ఆశించిన నెరవేరనపుడు నెరవేరినదని నమ్మగల కఠిన విశ్వాస పద్ధతిని, మాకు అలవరచిన నీకు వందనములు. మా స్థితిని గతిని ఎరిగిన తండ్రీ! మేమెంత ప్రార్ధించినా నెరవేరనపుడు మా ప్రార్ధనాంశము నీ దివ్య చిత్తమునకు సంపూర్ణముగ సమర్పించి నీ సహాయము కొరకు అబ్రహాము వలె నిరీక్షింపగల కృపదయచేయుదువని నమ్ముచూ నీకు స్తుతులు చెల్లించుచున్నాము.                                                   (ఆది 18:30-33.) 

 పరిశుద్ధాత్మ తండ్రీ! నీ సంఘమునకు నీ శక్తులను దయచేసి రెండువేల సంవత్సరములనుండి అనేకులను నీ ప్రభావముచేత బాగుచేయుచున్న నీకు స్తోత్రములు, మా స్తుతులు. త్వరగా రానైయున్న యేసునామమున అంగీకరించుము. ఆమెన్. 
Please follow and like us:
దైవిక స్వస్థత
Was this article helpful to you? Yes 4 No

How can we help?