సంఘారాధనలు

 1. Home
 2. Docs
 3. సంఘారాధనలు
 4. దీవెనలు

దీవెనలు

యెషయా 7:3, లూకా 2:14, 1తిమోథి 1:17, ప్రకటన 1:6, 4:8, 11. 5:12, 13:15, 3:4 19:1 2కొరింథి 13:14,

 సంఖ్యా 6:24, 26.
 1. పాప ప్రేరేపణ గల వారలారా, దేవుడు మీకు పాపవిసర్జన శక్తి నిచ్చి మిమ్మును దీవించును గాక!
 2. అనారోగ్య వంతులారా, దేవుడు మీకు ఆరోగ్యమునిచ్చి మిమ్మును దీవించునుగాక!
 3. లేమిగలవారలారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్ములను దీవించునుగాక1
 4. బిడ్డలులేనివారలారా, దేవుడు మీకు శిశుదానముచేసి, మిమ్మును దీవించునుగాక!
 5. భూత పీడితులారా, దేవుడు మీకు విముక్తి దయచేసి మిమ్మును దీవించును గాక!
 6. మందమతి గలవారలారా, దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమునిచ్చి మిమ్మును దీవించునుగాక!
 7. శత్రుబాధ గలవారలారా, దేవుడు మీకు శత్రుబాధ లేకుండ జేసి మిమ్మును దీవించునుగాక!
 8. అన్యాయము పాలగుచున్న వారలారా, దేవుడు మీకు న్యాయమనుగ్రహించి మిమ్మును దీవించునుగాక!
 9. ఋణ బాధ గలవారలారా దేవుడు మీకు ఋణబాధ తీర్చి మిమ్మును దీవించునుగాక!
 10. యుక్తకాలమున పెండ్లి సమకూడనివారలారా, దేవుడు మీకు మంచి జత నేర్పరచి మిమ్మును దీవించునుగాక!
 11. కుటుంబ కలహములుగల వారలారా, మీకు కలహము నాపుజేసి ఐకమత్యత కలిగించి మిమ్మును దీవించునుగాక!
 12. నానావిధములైన చిక్కులుగలవారలారా, దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మును దీవించునుగాక!
 13. దైవభక్తి కుదరనివారలారా, దేవుడు మీకు మనోనిదానమును స్థిరభక్తావేశమును పుట్టించి మిమ్మును దీవించునుగాక!
 14. చదువరులారా, దేవునియెడల అపనమ్మిక భీతి విసుగుదల తొందరపడు గుణము అనాలోచన చింత నిరాశ మొదలగునవి మీలోనికి చేరకుండునట్లు దేవుడు మిమ్మును దీవించునుగాక!
 15. జీవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించునట్లు దేవుడు మిమ్మును దీవించునుగాక!
Please follow and like us:
దీవెనలు
Was this article helpful to you? Yes 2 No

How can we help?