నిర్గమ 24:18; 34:28 1రాజులు 19:8. నెహెమ్యా 1:4, ఎస్తేరు 4:16. యెషయా 58:3-12. యోవేలు 1:14, కీర్తన 109:24; యిర్మియా 36:6; దానియేలు 6:18, 9:3 మత్తయి 4:2; 6:16-18; కార్య 13:2; 14:23 2కొరింధి 6:5.
(1) ప్రభువా! మేము ఉపవాసము చేయునప్పుడు ఇతరులకు కనబడునట్లు కాక రహస్యమందుండి చూచుచు, ప్ర తిఫలమిచ్చు నీకు కనబడునట్లు చేయుమని చెప్పిన నీ ఘననామమునకు స్తుతులు. మా కోర్కెలు, మా అంశములు నెరవేరనప్పుడు ఉపవాస ప్రార్ధనవలన వాటిని నెరవేర్చు కొనగలమను విశ్వాసము మాకు దయచేసిన తండ్రీ! నీకు నమస్కారములు.
మోషే నలుబది దినములు ఉపవాసమున్నపుడు నీ నిబంధన వాక్యములను పలకపై వ్రాసి వాటిని నీ ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులకును, వారి తరువాత చాల కాలమునకు వచ్చిన మాకును, అందజేసిన ప్రభువా! నీకు వందనములు. ప్రవక్తయైన యేలీయా నలుబది దినములు ఉపవాసము చేసినప్పుడు అతనిని ప్రాణభయము నుండి తప్పించి, నీవు మాట్లాడి, ధైర్యపరచి చేయవలసిన పనులు చేయించి, చివరికి మరణము లేకుండ జేసి మోక్షమునకు కొనిపోయిన తండ్రీ! నీకు వేలాది నుతులు. మా ప్రభువా, నీకు నరరూపిగా వచ్చి సేవలో ప్రవేశింపకముందు నలుబది దినములు ఉపవాసముచేసి సాతానును జయించి సేవకు ఆయత్తపడిన నీకు మా హృదయ పూర్వక వందనములు. ఓ మా తండ్రీ! నీవాక్యములో నీ బిడ్డలైనవారు అనేకులు ఉపవాసముండి ప్రార్ధన చేయగా ప్రార్ధనలను విని, వారి కోర్కెలను నెరవేర్చిన విషయములను తలంచుకొని నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము.
సుఖోపవాసము
మమ్మును మిక్కిలి ప్రేమించిన మా ప్రభువా! నీవు గాలిలో వ్రాయించి చూపిన బైబిలు మిషను వారమైన మాకు నలుబది దినములు సుఖోపవాసములు చేయుమని నీ దాసునిద్వారా మాకు అందించిన నీకు నుతులు. ఇట్టి సుఖోపవాసములద్వారా, అనేకుల కోర్కెలు, కఠినమైన అంశములు, నీ ప్రేమనుబట్టి నెరవేర్చిన నీకు మన సంస్తుతులు. ఈ రీతిగా అనేకులను నీ రాకడకు ఆయత్తపరతువని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మా స్తుతులు, స్తోత్రములు నీ కుమారుని ద్వారా అందుకొనుము. ఆమెన్.
ఉపవాస ప్రార్ధన స్తుతులు