రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. సర్వజనోపకారి

సర్వజనోపకారి

దేశీయులారా, ప్రియులారా, మీకు శుభములు కలుగును గాక! ఒక దేశమునకు ఒకరు గొప్ప మేలు చేసిన యెడల దేశీయులందరు ఆయనను మెచ్చుకొందురు. అయితే సృష్టికర్తయైన దేవుడు ప్రతిదినము అన్ని దేశములకు యెన్నో మేళ్ళు చేయుచున్నాడు.

మనము ఆయనను ఎంతగా మెచ్చుకొనవలసినది! ఎంతగా పూజింపవలసినది!ఎంతగా ఒక, వాన ఇట్టివి ఆయన మనకు ధర్మము చేయుచున్న దానములు గదా! ఈ దానములను పూజింపక దానకర్తను పూజించుట మన ఆనందవిధియై యుండవలెను. గదా! ఈ

దానములకన్న ఎంతో ఎక్కువైన దానము ఒకటి కలదు. అదేదనగా-దేవుడే మనకు కనబడి, మనకు చేసిపెట్టవలసిన పనులు చేసిపెట్టుటకై కొన్ని ఏండ్ల క్రిదట ఆయన మనుష్యుడై తానే మనకు గొప్ప ధర్మమై వెలసినాడు. గనుక మనము యెంతగా ఆయనను

అనుదినము నమస్కరింపవలెను! మనుష్యుడుగా పుట్టిన ఆయన యేసుక్రీస్తు అను పేరు మీద ప్రసిద్ధిలోనికి వచ్చెను. మీరు ఆయనను వేడుకొన్నయెడల మీ కష్టములను తొలగించి మీకు కావలసినన్నియు దయచేయును. తుదకు జీవాంతమందు మోక్షమునకు

చేర్చుకొనును. మీరు ఆయన మీద గురియుంచి ప్రార్ధించిన యెడల ఆయన మనుష్యరూపముతో కనబడి, మాటలాడి, మీ ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పును. ప్రయత్నించండి. మీలో పాపమున్న యెడల ఆయన దానిని పరిహరించును. జబ్బున్న యెడల

బాగుచేయును. ఇబ్బందియున్న యెడల తీర్చును. బిడ్డలు కావలసిన యెడల బిడ్డలను పుట్టించును. భూతమున్న యెడల వెళ్ళగొట్టును. శత్రువులున్న యెడల వారిని మిత్రులనుగా మార్చును. అప్పులున్న యెడల అవి లేకుండ్ద్దచేయును. పెండ్లి ఏర్పాటులు

చేయును. కుటుంబ కలహములు ఆపివేయును. పొలములు బహుగా ఫలిప్మజేయును. మీరు యేదైన ఒకపని చేయలేనప్పుడు మీకు సహాయము చేయును. ఆయన తన దూతలను మీకు కావలిబంటులనుగా ఏర్పర్చును. ఆయన భూమి మీదనున్నప్పుడు

ధర్మములు బోధించెను. అనేకమైన మేళ్ళుచేసెను. మన భారము వహించినందున సిలువమ్రాను మీద ప్రాణాత్యాగము చేయవలసివచ్చెను. కాని మూడవనాడు బ్రతికి వచ్చి మోక్షమునకు వెళ్ళెను. నమ్మిబాప్తీస్మము పొందినవాడు రక్షింపబడునని అంతకుముందు

చెప్పెను. ఆయన మిగుల త్వరలోనే మేఘాసీనుడై వచ్చి భక్తులను ప్రాణముతో తీసికొనివెళ్ళును. సిద్ధపడండి.

ఈ సంగతులున్న బైబిలు గ్రంధమును కొని చదవండి. ఇది లోకమునకు దేవుడిచ్చినను పిలుచుచున్న మతము. దేవుడు స్థాపించిన మతము.  వేదగ్రంధము. దీనిని బట్టిఏ క్రైస్తవమత సంఘము నడుచుచున్నది. ఈ  మతము, అన్ని మతములను 

పిలుచుచున్న మతము. దేవుడు స్థాపించిన మతము.

Please follow and like us:
సర్వజనోపకారి
Was this article helpful to you? Yes 3 No

How can we help?