రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. రెండు దైవలక్షణములు

రెండు దైవలక్షణములు

మానవులు పాపముల  చేతను, వ్యాధుల చేతను, ఇబ్బందుల చేతను బాధపడుచున్నారు. ఇవి పరిహరింపవలెనని దేవుడే నరుడుగ వచ్చెను. ఆయన పేరు యేసుక్రీస్తు. ఒక కుష్టురోగి ఆయన యెద్దకు వచ్చి ప్రభువా! నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన “నాకిష్టమే నీవు శుద్ధుడవుకమ్ము” అని చెప్పగా తక్షణమే అతని కుష్టు రోగము శుద్ధియాయెను.

      1)ఇందులో ఉన్న మొదటి దైవలక్ష ణము ప్రేమ. ప్రేమ ఉండబట్టియే “నాకిష్టమే” అని పలికెను. “దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, నేను పాపిని, చేసుకొన్న పాపమనుభవింపక తీరదు. నా కష్టము తొలగించుట ఆయన కిష్టముండునా” అని అందువేమో? ఆ కుష్టురోగి క్రీస్తునొద్దకు రానన్నాళ్ళు రోగి, వచ్చిన తరువాతనో? భోగి, అనగా శుద్ధి పొందిన వాడు. నాకిష్టమే అన్న ఆయనకు నా కష్టము తీర్చుట కూడా యిష్టమే అని నమ్మి, ఆ కుష్టరోగి వచ్చినట్లే నీవు ఆయన యొద్దకు రమ్ము.

    రెండవలక్షణము శక్తి. “శుద్ధి చేయావు” అని ఆ రోగి అనెను. ఇష్టమున్న ప్రేమను అతడు నమ్మలేదు. శుద్ధిచేయు శక్తిని నమ్మెను. రెండును నమ్మనిదే స్వస్థత రాదు. ఈ రెండును నమ్ముము. నీ కష్టము తొలగును. కష్టమెక్కువైన కొలది నమ్మిక యెక్కువ చేసికొనుము.

    (2) రెండు లక్షణములు కలిపి ఆలోచింతము. నిన్ను బాగు చేయవలెనని ప్రేమ ఎంతో ఆశించుచుండును. బాగు చేయ  యగలనని శక్తి యత్నించుచుండును. ఇట్టి తరుణములో నీవు రెండును నమ్మవలెను. ఆయనకిష్టమని నమ్మినయెడల బాగుపడుటకు నీకును ఇష్టమున్నట్టే. బాగుపడుటకు నీకు ఇష్టమున్నయెడల ఆయన ఇష్టమును, శక్తియు గతింపనివి. నీ యిష్టమును, నమ్మికయును గూడ గతింపనివై యుండవలెను. ఆయన ప్రేమనీలోని చెడుగును చూడదు. నిన్ను చూచును. ఆయన శక్తి నీ కష్టమును లెక్కచేయదు. నిన్ను లెక్కచేయును. వ్యాధి, బలము యెక్కువ కాగా “ఇక నేమి ప్రేమ, ఇకనేమి శక్తి” అని అనిపించును. నీ నమ్మిక దానిని అణచివేయుగాక! నమ్మికయే నీకు మనశ్సాక్షి,  ప్రేమకును, శక్తికిని గల ప్రేమతోను, శక్తితోను నీ కిచ్చునది పుచ్చుకొనుటయని అర్ధము. నీవు పుచ్చుకొనకపోతే ఆయన ఇచ్చిన కార్యమేమి? నీలో పుచ్చుకొను గుణమున్నది. వాడుము. ఆమేన్.      ప్రార్ధన-“ప్రభువా, నన్ను బాగుచేయుము. నీకిష్టమని నమ్ముచున్నాను. అపనమ్మిక కలుగనీయకుము. నేనెప్పటికిని తప్పకుండునంత బాగుగ నన్ను బాగుచేయగలవు నీకు వందనములు. ” ఆమెన్.

Please follow and like us:
రెండు దైవలక్షణములు
Was this article helpful to you? Yes No

How can we help?