రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. మంచి సమరయుడు

మంచి సమరయుడు

ప్రసంగ పాఠము: లూకా 10:30-37.

   యేసు ఇట్లనెను-ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. లూకా 10:30. యెరూషలేము= ఏర్పాటు స్థలము, యెరికో = 

శాపగ్రస్తమైన స్థలము. ఈ కథలో ఒక సంగతి జరిగినది.ఒకడు ప్రయాణము చేసెను. అతడు ఏర్పరచబడిన పట్టణమైన యెరూషలేము విడచి, శాపగ్రస్తమైన యెరికో పట్టణమునకు పోవుచున్నాడు. నాశన స్థలము నుండి ఏర్పాటు స్థలమునకు, క్షేమకరమైన

స్థలమునకు, శాంతిపురమునకు పోవలసినది గాని ఈ ప్రయాణికుడు వ్యతిరేకముగా వెళ్ళెను. ఎందుకు అలా చేసెను? 1) ఏర్పాటు స్థలములో నుండు మార్గము ఇరుకైనది. అనగా లోకముననుసరించు స్వేచ్చా జీవితము కాదు కష్టమైన జీవితము. 2) భక్తి జీవితము

శ్రమలతో కూడినది. ఆ శ్రమలు సహించలేక యెరూషలేము విడిచి యెరికోకు ప్రయాణమాయెను. 3) ఏర్పాటు స్థలములో నున్న వెలుగును చూడలేక యెరూషలేము విడిచెను. చీకటి సంబంధులు చీకటి కార్యములయందే ఆనందింతురు. వెలుగు క్రియలు వారికి

ఇష్టముండదు. గనుక ఏర్పాటు స్థలము విడిచిపెట్టెను. 4) విశ్వాసమును నిలుపుకొనలేక పోయినాడు. ఏర్పాటు స్థలమందు ఎట్టి విశ్వాస జీవితము గలదో ఆ జీవితము తనకు సరిపడక విశ్వాసమును విడిచి అవిశ్వాసస్థితిలోనికి పోయెను. 5) ఏర్పాటును

దక్కించుకొనలేక పోయినాడు. ఏర్పాటు స్థలములో నుండి, ఏర్పాటు పిలుపులో నుండి, ఏర్పాటు విశ్వాసములో నుండి వెలుపలికి వెళ్ళ నిశ్చయించుకొని వెళ్ళినాడు. పై ఏర్పాటులన్నియు నాకక్కరలేదని ధిక్కరించి వెనుకకు అనగా లోక స్థితికి వెళ్ళినాడు. నూతన

స్వభావమును విడిచి పాత స్థితికి పోయెను. ఎంత విచారమైన సంగతి! మార్గమందు దొంగల చేతిలో చిక్కెను. ఇతడు శాపగ్రస్థమైన యెరికో నుండి ఏర్పరచబడిన యెరూషలేమునకు భిన్నముగ నడచినందున ఇంత ముప్పు తెచ్చుకొనెను. ప్రాణమునకే అపాయము

కలిగెను.

   ఈ కథలో జరిగిన నష్టమును గూర్చి అంతయు గ్రహించలేకపోయిన కొంతవరకు పరిశీలింతుము. "వస్త్రములు దొంగిలించిరి" -తాను కలిగియున్న 1) మహిమ వస్త్రము 20 స్తుతి వస్త్రము 3) ఉల్లాస వస్త్రము 4) తెల్లని వస్త్రము 5) రక్షణ వస్త్రము 6) పెండ్లివస్త్రము 

7) నీతి వస్త్రము-ఇవన్నియు సాతాను కొట్టివేసెను. అతనిని సాతాను దిగంబరిగా చేసి విడిచిపెట్టెను. ‘కొట్టబడెనూ అనగా శిక్షించబడెను. తాను చేయకూడని ప్రయాణము చేసినందున శిక్ష తెచ్చుకొనెను. ప్రాణాపాయము తెచ్చుకొనెను గాని కొర ప్రాణము

మాత్రముండెను. ఇందు దేవుని యొక్క మహా కనికరము కనబడుచున్నది. పూర్తిగా ప్రాణము పోనియ్యక మరల లేపుటకు తండ్రి కనికరము చూపెను. కొర ప్రాణము గలదు గనుక ప్రాణ రక్షకులెవరైన వచ్చి అతనిని రక్షించవచ్చును. ఇదే మహా కనికరము. ఈ

దురవస్థ కాలములో అతడు ఏర్పాటు స్థలమునకు దూరముగా నుండెను. కుటుంబమునకు దూరస్థుడాయెను మరియు స్నేహితులకు కూడ దూరస్థుడాయెను. బాటసారిలోనున్న మంచి గుణము ఏదనగా బాధ అనుభవించు చున్నప్పటికిని, వస్త్రము పోయెననును

చింత కలిగియుండెను. తన దిగంబరత్వము తెలిసికొనెను. “ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను……మెళకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు”ప్రకటన 16:16. ఈ వాక్యమునందలి హెచ్చరిక ఈ సందర్భమున జ్ఞాపకమునకు వచ్చును. ఈ

హెచ్చరిక మనకు మేలు. ఈ కాలమందు సంఘములో ఇట్టి దుస్థితిలో నున్నవారు గలరు. సాతాను వలన తమ వస్త్రములు దొంగిలింపబడిన బలహీనులు అనేకులు గలరు. ఇక్కడ గ్రహించ వలసిన మర్మము ఒకటి గలదు. వాక్య ప్రకారము గాయపరచబడిన

బాటసారి ఎవరి సహాయమును అడుగలేదు. ఇది గొప్పలోటు, అయినను త్రోవ ప్రక్కను మాత్రము పడియుండెను. ఇతడు అడిగినను, అడుగకపోయినను క్రీస్తు యేసు యొక ప్రేమ ఎవరియందు నిలిచియుండునో లేక నిజముగ క్రీస్తును పోలిన వారెవరున్నారో

అట్టివారు బయలు పడవలసిన గడియ వచ్చెను. కొందరు విశ్వాసులైనను తమ మూర్ఖతను విడువక, విశ్వాసుల యొక్క సహాయము కోరకయుందురు. అట్టివారు సహాయము కోరినను కోరకపోయినను గుర్తించి, గమనించి పరిచర్య చేయు బాధ్యత విశ్వాసులపై

గలదు. ఈ కథలో నున్న పొరుగువాడు అట్లు చేసెను.

  సంఘములోని విశ్వాసులుకూడ ఇతర విశ్వాసుల అక్కరలను గుర్తించి సహాయపడవలెను. అతడు నూనెయు, ద్రాక్షరసమును పోసి గాయములు కట్టెను. నూనె-పరిశుద్ధాత్మకు గుర్తు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారములోను, దేవాలయములోను, యాజక 

ధర్మములలోను నూనె వాడుక చేయుట గలదు. గ్రహించ గలిగిన యెడల నూనె అనగా ఆత్మ తన పనులను అనేక రీతులుగా చూపించును. ద్రాక్షారసము = దీవెనలు. బాటసారి ఆత్మను పోగొట్టుకొన్నాడు మరియు దీవెనలు కూడ పోగొట్టుకొన్నాడు. ద్రాక్షారసము

ప్రభువు యొక్క రక్తమును కూడ సూచించును. వీటన్నిటిని బాటసారి పోగొట్టుకొనుట వలన మంచి సమరయుడు లేక నిజ విశ్వాసి తన పరిచర్య లేక సేవ ద్వారా అతడు పోగొట్టుకొనిన ఆత్మ శక్తిని, దేవుని దీవెనలను తిరిగి పొందునట్లు చేసెను. ఇంతటితో ఈ పరిచర్య

చాలదు. అతడు సంపూర్ణ స్వస్థత పొందవలెను గనుక, ఎక్కువ పరిచర్య అవసరము గనుక పూటకూళ్ళ వాని ఇంటిలో అప్పగించెను. అనగా విశ్వాసుల గుంపులో చేర్చెను. ఇక్కడ విశ్వాసులు, బోధించువారు, ప్రార్ధించువారు, పరిచర్య చేయువారు,

ప్రేమించువారు-రకరకముల వరములు గలవారుండి పడిపోయిన వారిని బలపరతురు. నష్టముపొందిన వారి నష్టము తీర్చి బాగుచేయుదురు. ఈలాగు బాగు చేయుట ఎంత ఆశ్చర్యము! ఎంత బాధ్యతగల పని విశ్వాసులపై నున్నదో గుర్తించండి-పొరుగువాని వలె

దేవుని చిత్తము నెరవేర్చవలెను. విశ్వాసులు అనేకులను బాగుచేయవలెను. ఇట్టి పనులు చేయగల ధన్యత అందరకును కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:
మంచి సమరయుడు
Was this article helpful to you? Yes 5 No

How can we help?