రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. ప్రార్ధన పట్టు

ప్రార్ధన పట్టు

“దేవుడు తాను ఏర్పర్చుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?” లూకా 18:7.

చదువరులారా! పట్టులేని ఏ పని అయినను నెరవేరునా? మీ కోరికలు దేవునికి చెప్పుకొని ప్రార్ధించుటయందును ప్రార్ధించి,  నెరవేరునని నమ్ముటయందును, తీవ్రముగా నమ్మి పట్టుదల కలిగియుండవలెను. అప్పుడు మీ మనవులు నెరవేరును. ఒక సిం హము 

చీమగా మారవలసి వచ్చినప్పుడు ఎంత కష్టము? ఎంత అసాధ్యము? నిజముగా అట్లు జరిగినయెడల అద్భుతమే. దేవుడు మనుష్యుడగుట ఎంత కష్టమైన పని? ఎంత అసాధ్యమైన పనియైనను, మనతో నుండుటకును, మన విషయమై సమస్త కార్యములు

చేయుటకును, ఈ విధముగా మనకు కనబడుటకును, మనతో మాట్లాడుటకును నిశ్చయించుకొని మనుష్యుడైనాడు. మనము పేర్లు పెట్టుకొను రీతిగానే ఆయనను అందరు పిలుచుటకు వీలుగా నుండునట్లు “యేసు” అను పేరు పెట్టుకొన్నాడు. ఆయన మన

నిమిత్తమై బోధించి, శ్రమ ననుభవించి ప్రాణము బలిచేసి, చెడుగును గెలిచి, మరణము కూడా గెలిచి, పరలోకమున కేగెను. ఇంత గొప్ప పని చేసిన ఈ దేవ మానవుడు మనకు ఏ పని చేసి పెట్టడు? ఏ మనవి వినడు? ఏ కోరిక నెరవేర్చడు? మనుష్యుని కొరకు

దేవుడు మనుష్యుడైన చరిత్ర ఒక్కటే మీ మనసు లో పెట్టుకొని సంతోషముతో నీ ఇష్టము వచ్చినది అడుగుము. ఆయన మనుష్యుడు గనుక మన మనవి వినుటకు ఇష్టపడును. ఆయన మన దేవుడు గనుక మన మనవి నెరవేర్చుటకు శక్తి గలవాడై యుండును.

ఇష్టమున్నను శక్తి లేనివాడై యున్న యెడల మన కోరిక నెరవేర్పలేడు. శక్తి యున్నను ఇష్టము లేనియెడల మన కోరిక నెరవేర్చడు. యేసుక్రీస్తు ప్రభువునకు ఇష్టమును, శక్తియును, ఉన్నందున ఆయన మన కోరికలన్నియు నెరవేర్చును.

కనుక చదువరులారా! మీరు ఏ మతస్థులైనను, ఎంత గొప్ప పాపులైనను, వ్యాధి గ్రస్థులైనను, ఎంత గొప్ప పేద వారి యైనను, ఎంత గొప్ప అజ్ఞానులైనను, ఎన్నెన్ని చిక్కులు గల వారైనను, క్రీస్తు ప్రభువును ఆశ్రయించి, నిత్యము ఆయననే పూజించుచు, మీ 

మనవులు వివరించుకొనండి. నమ్మకము లేకపోయినను ప్రార్ధించి చూడండి! మీరు క్రీస్తును ఆశ్రయించిన తర్వాత ఏ దైవమునైనను ఆశ్రయించిన యెడల మీ కోరికలు నెరవేరవు. మీ కోరిక ఏమియై యుండవలెను? పాపపరిహారము, వ్యాధిపరిహారము, ఇబ్బంది

పరిహారము, చిక్కుల పరిహారము మొదలైనవి. నమ్మిక, సంతోషము, ధైర్యము, నిశ్చింత, సుబుద్ధి, సత్యవర్తన, పాపవిసర్జన, దైవసేవ అనగా దేవుని విషయమైన సంగతులు ఇతరులకు బోధింపగల సేవ, రక్షణ, జీవాంతమందు నెమ్మదియైన మరణము అవసరము

ఇవికాక ప్రతి దినము నీకు ఏవి అవసరమో అవి అడిగి అందుకొనవచ్చును. ఆయన అందరి ప్రార్ధనలు, అన్ని ప్రార్ధనలు ఆలకించును. ఇది ఆయనలోనున్న సంతోషమని గ్రహించుకొనవలెను. ఆయన త్వరలో మీ కోరికలన్నియు నెరవేర్చక ఆలస్యము చేయును.

అప్పుడు చింత, అధైర్యము దిగులు, భీతి, అనుమానము, విసుగుదల, నిరాశ, ప్రార్ధన మానివేయుట,మా కోర్కె నెరవేర్చుట ఆయనకు ఇష్టములేదు కాబోలును అని అనుకొనుట- ఈ మొదలైనవన్నీ ప్రార్ధనవలన కలుగునట్టి పట్టు. మంచివాటిని అందుకొనుటకు

ఏర్పడగల పట్టు. రెండవది అక్కరలేని వాటిని విసర్జించుటకు అవసరమైన పట్టు. మా కోర్కె నెరవేర్చుట ఆయనకు ఇష్టములేదు కాబోలును అని అనుకొనుట – ఈ మొదలైనవన్నీ దయ్యములతో సమానము. ఈ దయ్యములను మీ లోనికి రానీయకండి. తేళ్ళను,

పాములను మీ ఇంటిలోనికి రానిస్తారా? రానీయరు. అట్లే వీటిని కూడ రానీయకండి. వచ్చుచున్నను త్రోసివేయుచుండండి. అట్లు త్రోసివేసిన యెడల వాటిని విసర్జించుటలో మీ పట్టు గట్టిపడును. మొదటిది ప్రార్ధనవలన కలుగునట్టి పట్టు. మంచివాటిని అందుకొనుటకు

ఏర్పడగల పట్టు. రెండవది అక్కరలేని వాటిని విసర్జించుటకు అవసరమైన పట్టు. ఈ రెండును కలిగియుండవలెను. ప్రార్దింపగా, ప్రార్ధింపగా నెరవేరని యెడల అవలంభింపవలసిన ఉపాయము గలదు. ఒకరోజంతా ఏకాంత స్థలమందు ఉపవాస ప్రార్ధన చేసి చూడండి.

అప్పుడు మీకు పట్టు కుదురును. ప్రార్దించుటకు, సమయము, స్థలము, వీలు దొరకదు. ఏమి చేయవలెనని కొందరడుగుచున్నారు. నీళ్ళు త్రాగుటకు, అన్నము తినుటకు, తీరికగా కూర్చుండుటకు. నిద్రపోవుటకు అన్నిటికి సమయమున్నది. ప్రార్ధనకు సమయము

లేదనువారికి ఏమి సమాధానము చెప్పవలెను? మిషను (నెపములు) మీ బ్రతుకునకు అడ్డముగా నుండును గనుక తొలగించుకొనండి. మీ కష్టములన్నియు ప్రార్ధనా పూర్వకముగా నుండును గనుక తొలగించుకొనండి. మీ కష్టములన్నియు ప్రార్ధనా పూర్వకముగా

క్రీస్తు ప్రభువు నెదుట విదల్చి వేసికొనండి. అప్పుడు మీ మనోభారము అంతరించును. ఆయన మీ ప్రార్ధన వినును అని అనుకొనుటయే మీ సంతోషమై యుండవలెను. అప్పుడు కార్యసిద్ధి కలుగును.

 యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానము వినండి. భర్త పోయిన ఒక స్త్రీ న్యాయాధిపతి యొద్దకు మిగుల తరచుగా వెళ్ళి తన కష్టము తీర్చండి అని ఎంత బ్రతిమాలినను ఆయన చేయలేదు. అయినను ఆమె నిరాశ పడక, పట్టినపట్టు విడువక మరల మరల వెళ్ళి 

బతిమాలుకున్నందున ఆ న్యాయాధిపతి ఆమె కష్టము నివారణ చేసెను. చదువరులారా! విన్నారా! చూచినారా! ఆమెలో ఎంత పట్టు ఉన్నదో? మీలో అంత పట్టు ఉన్న యెడల క్రీస్తు ప్రభువు మీ కష్టములను పరిహరించును. ప్రార్ధించండి అని ఆయనే చెప్పినాడు

గనుక మీరు ప్రార్ధించిన యెడల ఎందుకు వినడు? (వినడు) అని ఎవరు చెప్పినను నమ్మకుము, నీ మనస్సాక్షి చెప్పినను నమ్మకుము. ఆయన చెప్పినదే నమ్మండి. అపుడు మీరు ధన్యులగుదురు.మీ చేత పట్టుదల ప్రార్ధన చేయించుటకే ఆయన పై ఉపమానము

చెప్పెను. దేవుడు మీకు తోడై నిత్యము దీవించుచుండును. గాక! ఆమెన్.

Please follow and like us:
ప్రార్ధన పట్టు
Was this article helpful to you? Yes 5 No

How can we help?