రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. పక్షవాత రోగి

పక్షవాత రోగి

     వాక్యభాగములు: మత్తయి 9:1-8; మార్కు 2:1-12; లూకా 5:17-26.

     ప్రార్ధన:ఓ యేసు ప్రభువా! నీవు లోకములో నునప్పుడు పక్షవాత రోగిని నీ ప్రభావము వల్ల బాగుచేసినావు. అట్లు చేసి నీ ప్రేమ, శక్తి, దయాళుత్వము కనుపర్చినావు. దీనియందున్న సారాంశము మాకు బోధపరచుము. నీ వాక్యము మా చేతిలో ఉంచినావు. నీ వాక్యము మా తెలివికి, జ్ఞానమునకు మిచినది. అట్టి వాక్యము చదివినాము. వివరించుకొనుచున్నాము. అందరికిని బోధపర్చుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.

   ప్రియులారా! మీరందరు ఆసక్తితో వచ్చినారు. ఆసక్తితో వినండి. ఆసక్తితో నమ్మండి. ఆసక్తితో బాగుపడండి. ఆసక్తిలేక బాగుపడకుండ వెళ్ళవద్దు. ఆసక్తితో ఇక్కడే ఉండి బాగుపడండి. ఇంటికి వెళ్ళిన అనుమానములు వచ్చును. విని, నమ్మి బాగుపడండి. పూర్వము ప్రభువు గ్రామాదులు తిరిగి బోధచేసినారు. ఎవ్వరును చేయలేని గొప్ప పనిచేసిరి. ఆయన మాటలు వినసొంపుగా నుండెడివి గనుక అనేకులు ఆ మాటలు వినుటకు వచ్చిరి. ఈ కాలములో ఎవరైన మీటింగులు జరిపిన పేపర్లు అచ్చువేసి అందరికి పంచుదురు. అది చదువుకొని మీటింగులకు వస్తారు. యేసుప్రభువు కాలములో అచ్చులేదు. ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత 15 వందల సంవత్సములకు అచ్చు పుట్టినది.

     అచ్చు కాగితము లేకపోయినను, ఈ కాలములో, మీటింగులకు వచ్చువారి కంటె ఎక్కువగానే, యేసుప్రభువు మాటలు వినుటకు ప్రజలు వచ్చేవారు. ఆయన సముద్ర తీరమున బోధించిన మాటలు విన్నవారు వెళ్ళి ఇతరులకు చెప్పగా వారు కూడ వచ్చి ఆ వినసొంపైన మాటలు వినువారు. ఈలాగు బోధచేసిన ప్రభువు అలసిపోయి ఒక శిష్యుని ఇంటిలోనికి వెళ్ళిరి. ఆ ఇంటిలోనికి ప్రభువు వచ్చినారని తెలిసికొని చాలామంది వచ్చిరి. అక్కడ నున్నవారికి ప్రభువు వాక్యము ఉపదేశించెను. అక్కడ చెవిటి వారున్నా, ఆయన దేవుడు గనుక వారికి వినబడునట్లు బోధచేసెను. ఆయన మాటలు చెవులలోనికి, హృదయములలోనికి, వెళ్ళినవి. ఆయన వాకు చెవిటితనములో నుండి, హృదయములో నుండి శరీరములోనికి వెళ్ళి జబ్బు అంత ఊడ్చివేసెను. ఆయన మాటలు 1. చెవి లోనికి 2. హృదయములోనికి 3. శరీరము లోనికి వెళ్ళి రోగికి 4. పరిపూర్ణ స్వస్థత ఇచ్చెను. ఈ ఇంటినినిండ మనుష్యులున్నారు. వెలుపల కూడ ఉన్నారు. ఆయన మాట అందరికి వినబడినది. ఎందుకనగా ఆయన దేవుదు గనుక బూరగాని, మరగాని (మైక్) లేకపోయినను ఆయన మాట దూరముగానున్న వారికి కూడ వినబడేది. ఈ కాలములో మనము పై సాధనములతో దూరముననున్న వారికి వినబడునట్లు మాట్లాడుదుము. ప్రభువు మండువాలో కూర్చుని బోధించెను. ఆయన ఈ లోకములో 1. బోధపని 2.జబ్బులు బాగుచేయు పని. ఈ రెండు పనులు చేసెను. ఇప్పుడు ఈ ఇంటిలో జబ్బులు బాగుచేయవలెనని తలంచలేదు. బోధ పని మాత్రమే చేయవలెనని తలంచెను. ఒక్క బోధ పని మాత్రము చేసిన సంతుష్టి కలుగునా? ఆయన బోధ మాత్రము చేసినను సంతుష్టి కలుగును. ఎందుకనగా ఆయన  బోధలు వినసొంపుగా నుండెడివి గనుక మా జబ్బులు తీసివేయి అని ప్రజలు అడుగుటకు సమయములేదు. ఈ ఇంటిలో ఎవరును జబ్బులు బాగు చేయుమని అడుగలేదు. అందరు బోధలు వింటున్నారు. బోధ ముమ్మరముగా జరుగుచున్నది. ఇంతలో అచ్చు కాగితము లేకపోయినను, ఈ కాలములో, మీటింగులకు వచ్చువారి కంటె ఎక్కువగానే, యేసుప్రభువు మాటలు వినుటకు ప్రజలు వచ్చేవారు. ఆయన సముద్ర తీరమున బోధించిన మాటలు విన్నవారు వెళ్ళి ఇతరులకు చెప్పగా వారు కూడ వచ్చి ఆ వినసొంపైన మాటలు వినువారు. ఈలాగు బోధచేసిన ప్రభువు అలసిపోయి ఒక శిష్యుని ఇంటిలోనికి వెళ్ళిరి. ఆ ఇంటిలోనికి ప్రభువు వచ్చినారని తెలిసికొని చాలామంది వచ్చిరి. అక్కడ నున్నవారికి ప్రభువు వాక్యము ఉపదేశించెను. అక్కడ చెవిటి వారున్నా, ఆయన దేవుడు గనుక వారికి వినబడునట్లు బోధచేసెను. ఆయన మాటలు చెవులలోనికి, హృదయములలోనికి, వెళ్ళినవి. ఆయన వాకు చెవిటితనములో నుండి, హృదయములో నుండి శరీరములోనికి వెళ్ళి జబ్బు అంత ఊడ్చివేసెను. ఆయన మాటలు 1. చెవి లోనికి 2. హృదయములోనికి 3. శరీరము లోనికి వెళ్ళి రోగికి 4. పరిపూర్ణ స్వస్థత ఇచ్చెను. ఈ ఇంటినినిండ మనుష్యులున్నారు. వెలుపల కూడ ఉన్నారు. ఆయన మాట అందరికి వినబడినది. ఎందుకనగా ఆయన దేవుదు గనుక బూరగాని, మరగాని (మైక్) లేకపోయినను ఆయన మాట దూరముగానున్న వారికి కూడ వినబడేది. ఈ కాలములో మనము పై సాధనములతో దూరముననున్న వారికి వినబడునట్లు మాట్లాడుదుము. ప్రభువు మండువాలో కూర్చుని బోధించెను. ఆయన ఈ లోకములో 1. బోధపని 2.జబ్బులు బాగుచేయు పని. ఈ రెండు పనులు చేసెను. ఇప్పుడు ఈ ఇంటిలో జబ్బులు బాగుచేయవలెనని తలంచలేదు. బోధ పని మాత్ర  చేయవలెనని తలంచెను. ఒక్క బోధ పమ్ని మాత్రము చేసిన సంతుష్టి కలుగునా? ఆయన బోధ మాత్రము చేసినను సంతుష్టి కలుగును. ఎందుకనగా ఆయన   బోధలు వినసొంపుగా నుండెడివి గనుక మా జబ్బులు తీసివేయి అని ప్రజలు అడుగుటకు సమయములేదు. ఈ ఇంటిలో ఎవరును జబ్బులు బాగు చేయుమని అడుగలేదు. అందరు బోధలు వింటున్నారు. బోధ ముమ్మరముగా జరుగుచున్నది. ఇంతలో అల్లరి జరిగినది. నలుగురు మనుష్యులు పక్షవాత రోగిని తీసికొని వచ్చిరి. ఆయన దగ్గరకు వెళ్ళుటకు వీలులేదు. ఏలాగైన ఆయన దగ్గర ఈ రోగిని నుంచవలెనని మంచమునకు పగ్గాలు .కట్టి, ఇంటి కప్పువిప్పి ఆయన ముందు మంచము దించిరి.  నెట్టివేసినా సరే వారు ఆగలేదు.  అల్లరి జరిగినది. నలుగురు మనుష్యులు పక్షవాత రోగిని తీసికొని వచ్చిరి. ఆయన దగ్గరకు వెళ్ళుటకు వీలులేదు. ఏలాగైన ఆయన దగ్గర ఈ రోగిని నుంచవలెనని మంచమునకు పగ్గాలు .కట్టి, ఇంటి కప్పువిప్పి ఆయన ముందు మంచము దించిరి.  నెట్టివేసినా సరే వారు ఆగలేదు.

  ప్రభువు దగ్గరకు వచ్చుటకు రోగికి ఉన్న ఆటంకములు 1. నాకు పక్షవాతము: సగము బాగున్నది. సగము బాగుగా లేదు. నన్ను ఎవరు మోసికొని వెళతారు. 2. నలుగురు కావలెను. నలుగురు మనుషులు వస్తారా? ఆశ ఉన్నది. ఆటంకములు కూడ ఉన్నవి. అయితే నలుగురు వచ్చిరి. 3. అడ్డు: ఇంటిలోకి వెళ్ళుటకు స్థలము లేదు. మనకు కూడ ప్రభువు దగ్గరకు వచ్చుటకు ఆటంకములు ఉండును; అడ్డులున్నప్పటికిని రావలెనని ఈకథ వలన నేర్చుకొనుచున్నాము. జబ్బు పోవునని అతనికి నమ్మకము ఉన్నది. మోసికొని వచ్చిన వారికి కూడ నమ్మకమున్నది. యేసుప్రభువు రోగి విశ్వాసము, మోసికొని వచ్చిన వారి విశ్వాసము అనగా ఇరువురివిశ్వాసము చూచిరి. యేసుప్రభువు బాగుచేయును అను పుకారు లేక వదంతి వారిని ప్రభువు దగ్గ్రకు తీసికొని రాగలిగినది. ఇల్లు ఎక్కుచుండగా ఎవ్వరైన ఏమైన అంటారు. ఆటంకము చేస్తారు, కోపపడతారు. ఇవన్నీఅనుకొనక ధైర్యముతో వచ్చెను. అలాగే ఎన్ని అడ్డులున్నప్పటికిని మనము కూడా ప్రభువు దగ్గరకు రావలెను. అలాగే ఎన్ని అడ్డులున్నప్పటికిని మనము కూడా ప్రభువు దగ్గరకు రావలెను. అప్పుడు ప్రభువు రోగిని చూచిఅతని జబ్బు స్థితిని అడుగక, పాపస్థితిని చూచి నీ పాపములు క్షమించినానని చెప్పెను. కాబట్టి ముఖ్యవిషయము పాపమును బటి జబ్బుగాన మొదట పాపము తీసివేసిన జబ్బు దానంతట అదే పోవును. మహాప్రభోబగుచేయి అని రోగి, ఆ నలుగురు అనలేదు. ప్రభువు “కుమారుడా” అనెను. అతడు ఆయనను తండ్రీ! అనలేదు, కుమారుడా-నేను అందరికి తండ్రిని అని తెలియజేయుటకు “కుమారుడా” అని పిలిచెను. ధెర్యముగానుండుము అనెను. ఇల్లు విడిచి, కప్పువిప్పి వచ్చినను ఇంక ధెర్యము చాలదు. జబ్బువల్ల వాడిపోయి, వడిపోయి, వడలిపోయాడు గనుక ప్రభువు మాటవల్ల ధైర్యము రావలెను. మనిషిలో బాగుపడనియ్యదు. రోగికినమ్మమున్నది. కాని ధైర్యము పుట్టుటకు, ధైర్యము తెచ్చుకొమ్మనెను. నేను కొన్ని నెలల క్రిందట పాపము చేసినాను. అందుకని ఈ వాతము వచ్చినది. వదలుటలేదు అనే అధైర్యమున్నది. గనుక ప్రభువు జబ్బుమాటఎత్తక, పాపము మాట ఎత్తి పాపములు క్షమించువాడనని చూపించెను. ఉదా: నోరు అంటుకొని పోయిన వానికి అనగా అరుకు పోయిన వానికి పచ్చడి ఇచ్చిన శాంతి కలుగునా? నీరు ఇవ్వవలెను. పాపములున్నవని రోగికితెలుసు. గనుక కుమారుడా! అని పిలిచెను. ఎంత సంతోషము. 3 మెట్లు. ఇక్కడ ఉన్నవి. 1. కుమారుడా అనిన సంతోషము. 2. ధైర్యముగా నుండు అనుమాట ఇంకా సంతోషము. 3. ని పాపములు క్షమింపబడెను అనుమాట మరీ సంతోషము. ఒకదాని కంటె ఒకటిమించి సంతోషము. గాని జబ్బు సంగతి ఇంకా రాలేదు. అతడు ఒక్కటే (బాగుచేయుట) అనుకున్నాడు గాని ప్రభువు మూడు కార్యములు చేసెను.

     ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు. ప్రభువు ఏమిచేస్తారు అని ప్రభువువైపు, రోగివైపు అందరు చూచుచున్నారు. ఏది ఎక్కువ కీడు-పాపమా? రోగమా? పాపము వలన రోగము వచ్చినదిగాన పాపమును తీసివేసెను. పాపమున్నయెడల మరల రోగము వచ్చును గనుక పాపము తీసివేసెను. ప్రభువు అతని పాపములు క్షమించెను. తర్వాత నీ జబ్బు పోయినది అని అనవలసినది గాని అనకుండ మరొక మాట చెప్పెను. అందులో మూడుమాటలున్నవి. లెమ్ము, నీ పరుపెత్తుకొమ్ము, ఇంటికిపొమ్ము. అయ్యయ్యో, ఇదేమిటి జబ్బుపోయిన లేవగలడు,జబ్బుపోయిన పరుపెత్తుకొనగలడు, జబ్బుపోయిన ఇంటికి పోగలడు గాని జబ్బు పోకముందు ప్రభువు ఈమాటలు అన్నారు. చాలా విడ్డూరము! ప్రభువా జబ్బుపోయిన తరువాత అలాగే లేస్తాను అని రోగి అనలేదు. ప్రభువు చెప్పగానే లేచినాడు. అనగా జబ్బు పోయినట్లు ప్రభువు చెప్పెను. గుర్తు ఏమనగా ప్రభువు అన్న మూడుపనులు రోగి చేసెను. జబ్బు పోయినది, పాపాలు పోయినవి. అందరు నమ్మిరి. ప్రజలలో కొందరు సణుగుకొన్నారు. జబ్బ పోయినందుకు కాదు; పాపములు క్షమించుటకు ఈయన ఎవరు? అని సణిగిరి. ఇప్పుడు కూడఇటువంటి వారు ఉన్నారు. 

     మంచము: మంచము ఒక రోగిని మోసికొని వచ్చెను. ఇప్పుడు రోగి ఆ మంచమును మోసికొని పోవుచున్నాడు. ఇప్పుడు రోగికాదు, భోగి, యోగి అయినాడు. ఆశ్చర్యము! ఇక్కడ కాకాని స్వస్థిశాలలోని వారు రోగముతోవచ్చి సంతోషముతో వెళ్ళుచున్నట్లు పక్షవాతరోగి వెళ్ళినాడు. బోధ వలననే – మీ పాపములన్ని ఇచ్చటనే స్వథి శాలలో విడిచిపెట్టి సంతోషముతో, స్వస్థతతో వెళ్ళండి. రోగి జబ్బు: పక్షవాతము, అనగా సగము బాగుండును, మిగతా భాగము బాగుండదు. వాతము వలన ఎండిపోవును. సగము జబ్బుండి, సగము బాగున్న సుఖమేముండును? బ్రతుకు వర్ధిల్లదు. ఆలాగే మనిషిలో దుర్గుణాలు ఉండినా బాగుండునా? అతడు మంచివాడ్ద్దా, చెడ్డవాడా? పాపము, పుణ్యము రెండు ఉన్న మనిషి మోక్షమునకు వెళ్లునా? మోక్షమునకు వెళ్ళడు. చిన్న పాపమయినా ఉండకూడదు. జబ్బు ఉంటే పరవాలేదు. మోక్షమునకు వెళ్ళగలము. మీ పాపములు ప్రభువుదగ్గర ఒప్పుకొని శుద్ధిపొందండి. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.

Please follow and like us:
పక్షవాత రోగి
Was this article helpful to you? Yes 2 No

How can we help?