రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. త్రాణ

త్రాణ

 1. సర్వ మతస్థులకని  ఉద్దేశించి, మోక్షప్రాప్తికి, అవసరమైనవి, దేవుడే స్వయముగా 

వ్రాయించి  1,150 భాషలలోనికి పైగా మార్పించిన  బైబిలు అను గ్రంధమే సంపూర్ణ దైవ గ్రంధము.

    2. ఆ దేవుడే దేవుడుగానేయుండక, కేవలము మనుష్యుడై  అవతరించి మన  నిమిత్తమై  చేయవలసిన సమస్త కార్యములు చేసి పరలోకమునకు వెళ్ళి, మరల రానైయున్న శ్రీ యేసుక్రీస్తే సంపూర్ణ దైవ రక్షకుడు.

    3. అందరి దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి, నమ్మిన అందరి రక్షకుడగు యేసుక్రీస్తై  క్రైస్తవ మతమును  స్థాపించినాడు  గనుక ఇదే సంపూర్ణ దైవ మతము.

    4. అన్ని మతములను పిలుచుచు,  సోదర భావము కలిగి, శరీరాత్మీయ జీవితోపకార్యములు చేయుచున్న ఇదే సంపూర్ణ దైవ మతము. దైవ ప్రార్ధన  చేసి సత్యము తెలిసికొనుడి.

   సీ|| మతము సర్వజనుల మతము కాకున్నచో ! మతమను మతము

         సమ్మతముగాదు “పూర్తి రాగా నసంపూర్తి  పోవును” అను!

         బైబిలు వాక్కు శుభము గాదె దేవుండే పూర్తిగా దిగి వచ్చి

         ప్రత్యక్ష ! మాయెను తేటగా మహిని బుట్టి గాన మతాలన్ని

         గలిసి పరీక్షించి ! ప్రార్ధింప సత్యంబు బయలు పడును.

   గీ|| సూర్యుడుదయింప చుక్కలజోలియేల! దైవమతముగన్ పడ

         ఈ మతంబు లేల అన్నిమతములొక్కమత మైనయెడల!

         ఈ విదేశ స్వదేశాల యెగ్గుపోదె.

Please follow and like us:
త్రాణ
Was this article helpful to you? Yes No

How can we help?