రక్షణ వార్తావళి

 1. Home
 2. Docs
 3. రక్షణ వార్తావళి
 4. క్రీస్తు పలుకులు

క్రీస్తు పలుకులు

 1. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. యోహాను 6:37
 2. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. మత్తయి 11:28
 3. నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి 11:29.
 4. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14:14.
 5. నేనే మార్గమును, సత్యమును, జీవమును, యోహాను 14:6
 6. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 14:12.
 7. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు. దేవుని సంబంధియైన వాడు దేవుని మాటలు వినును. యోహాను 8:46-47.
 8. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి 5:8.
 9. హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8.
 10. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపర్చబడుదురు. మత్తయి 5:6.
 11. సమాధానపర్చువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి 5:9.
 12. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగ చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి, ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును.” మత్తయి 5:11,12.
 13. “మీరు లోకమునకు వెలుగై యున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగై యుండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి, కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండు వారందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ

సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపర్చునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” మత్తయి 5:14-16.

 1. “ధర్మ శాస్త్రమునైనను, ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకై గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును, భూమియు గతించిపోయిననే గాని ధర్మ శాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను,

ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగ మీతో చెప్పుచున్నాను,” మత్తయి 5:17,18.

 1. ” నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా-తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును; తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని

చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును” మత్తయి 5:21,22.

 1. ” మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్ధన చేయుడి.” మత్తయి 5:44.
 2. “ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును

ఆలాగు చేయుచున్నారు గదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” మత్తయి

5:45-48.

 1. “నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక యుండవలెను.”
 2. మీలో నెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు మత్తయి 6:27.
Please follow and like us:
క్రీస్తు పలుకులు
Was this article helpful to you? Yes 1 No

How can we help?