1. Home
 2. Docs
 3. దైవ సాన్నిధ్యము
 4. నాలుగవ ప్రసంగము – పరిశుద్ధుల సన్నిధి

నాలుగవ ప్రసంగము – పరిశుద్ధుల సన్నిధి

ప్రార్ధన:- తండ్రీ! నిరాకారుడవైన తండ్రీ! మాకు కనబడకుండ ఉండలేని తండ్రీ! మాకు కనబడక పోయినను సహాయము చేస్తున్న ప్రభువా! కనబడక పోయినను తోడైయున్న తండ్రీ! నీకు వందనములు (మా కూటస్థులందరికి చల్లదనము దయచేయుము నెమ్మది. చలువ దయచేయుము) ఎవరికి శరీరము వేడిగా నున్నదో వారికి చల్లదనము దయచేయుము. దీవెన, చల్లదనము దయచేయుము. నెమ్మది నీవల్లనే వచ్చును. మందముగా ఉన్న వారికి వేడి దయచేయువాడవు నీవు వేడి కావలసివస్తే వేడి, చలువ కావలసివస్తే చలువ, దయచేయువాడవు నీవే ముగ్గురు బాలురు అగ్నిహోత్రములో నున్నారు. వారికి వేడి, తగులలేదు. బట్టలు మాడలేదు. అగ్నిలో ఉన్నట్లు లేదు వారికి ఎందుకంటే నీవు ఉన్నావు ఒకప్పుడు నీ వారు నీళ్ళ మధ్యను ఉన్నారు. చలి వారికి హాని చేయలేదు. జలము, చలి హానిచేయలేదు. ఇంకొకప్పుడు నీ వారు గాలిలో ఉన్నారు. హానిచేయలేదు ఎక్కడుంటే ఏమిగాక ! నీవారు నీవు అక్కడుంటావు గనుక ఎక్కడ ఉన్న హానిలేదు కాబట్టి నీకు స్తొత్రములు. మరల మాకు వర్తమానము దయచేయుము, ఇక్కడలేనివారిని (కాకానిలో) దీవించుము అక్కడ అది వరకు వచ్చినవారిని దీవించుము. సూర్యునియొక్క కిరణములు పడునట్లు కష్టములు సముదాయమువల్ల వేడి సహించలేని వారియొక్క హృదయ భూమిమీద వర్షము ధారలు కురిపించును అప్పుడు చల్లదనము నీకృపాధారలువల్ల నీ కృపావర్షమువల్ల చల్లబడునుకాబట్టి స్తోత్రములు. పగలు ఎండదెబ్బ రాత్రి వెన్నెలదెబ్బయైనను తగులనీయవు అని నీవు పుస్తకములో వ్రాయించినావు కాబట్టి నీకుస్తోత్రములు. కొంతమందికి సూర్యబింబమువల్ల కలిగే వేడికాక ఆత్మ ప్రేరేపణ వల్ల వేడి కలుగును. అది సహించే కృప దయచేయుము. చల్లదనము దయచేయుము. ఆ వేడి ఉపయోగకరమైనది. మండువేసవిలో నుండే వేడి హానికరమైన వేడి. అయితే ఆత్మ వల్ల వచ్చే వేడి హానిచేయదు. గొప్ప ఉపకారము చేయును గనుక నీకు స్తోత్రములు. (ఇప్పుడు) నీ వర్తమానము మాకు కిరణములవలె, వాహనధారవలె, చలువ గాలివలె అనుగ్రహింపుము. మా అందరి పుస్తకములు వ్రాతతో నిండునట్లు, మా అందరి హృదయములు నీ వర్తమానముతో నింపుము నీ ఆశీర్వాదము, నీ వాక్యము మీద వాక్యబోధ మీద, నీ వాక్య బోధ విన్న వారిమీద కుమ్మరించుమని యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.

   దావీదు కీర్తనలు 56:4. 9 వ||లు

   దైవసన్నిధి గురించి మనము పూర్తిగా తెలిసికొనకుంటే ప్రవక్తలు వ్రాసిన వ్రాతలన్నియు చదువవలెను.

   పైన చెప్పిన సంగతులు దైవసన్నిధికి సంబంధించినవే కాని అక్కడొకటి అక్కడొకటి. అయితే ప్రవక్తలో అలాగుకాదు ప్రతి ప్రవక్తయొక్క వ్రాతలో దైవసన్నిధి సంపూర్ణముగా నున్నది. వర్తమానము సంపూర్ణముగా నున్నది.

 1) వర్తమానము 2)సన్నిధి సంపూర్ణముగా నుండుటయేకాక వారుకూడ సంపూర్ణముగా నున్నారు దేవుడు వారికి ఒక వర్తమానము ఇచ్చినపుడు అది వారికి తెలియనప్పుడు మరల అడిగేవారు వారిలో ఒక ప్రవక్త విసుకొన్నాడు.

 1) మహాభక్తుడు 2) సన్నిధిలో నుండే భక్తుడు, దేవునివల్ల పిలువబడిన వాడే. అప్పుడు ప్రభువు జవాబు చెప్పినాడు ఎప్పుడైన ప్రార్ధనలో నునప్పుడు ఈ వరండమీద అటువంటి మహాత్ములైనా ఉన్నారా? ఉంటారు) హబక్కూకు 3:17,18:

 1. అంజూరపు చెట్లు పూయకుండినను

 2. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను. 3. ఒలీవచెట్లు కాపు లేక పోయినను. 4. చేనిలోని పంట రాకపోయినను. 5. గొర్రెలుదొడ్డిలో లేక పోయినను, సాలలో పశువులు లేకపోయినను మొదట విసుగుకొన్నాడుగాని తర్వాత ఆనందించెను కమ్మిన మేఘము లేదు, పలికిన తండ్రి లేడు, కనబడ్డ మోషే, ఏలియాలు లేరు అలుముకొన్న కాంతిలేదు యేసుప్రభువు ఒక్కడే ఉన్నాడు ఆఒక్కనిని (అనగా ప్రభువును) ఆ ముగ్గురు చూచారు పేతురు, యాకోబు, యోహాను, పాతనిబంధన వెళ్ళిపోయింది. క్రొత్తనిబంధన అనగా ముగ్గురూన్నారు. వెళ్ళిపోయిన పాతనిబంధనకు ఉండిపోయిన క్రొత్తనిబంధనకు మధ్యవర్తిగా యేసుప్రభువు ఉన్నాడు (రేపుకూడ) మనమధ్యనున్న వారందరు వెళ్ళిపోతే యేసుప్రభువు ఉంటారు. ఎవరువెళ్ళిపోయినా ఏదివెళ్ళిపోయినా ప్రభువు మాత్రమే ఉండడము మానడు. అయ్యగారు (నిన్న) యేసుప్రభువుయొక్క ముప్పైమూడున్నర సంవత్సరముల జీవితములో ఉన్న దైవసన్నిధిని గురించి చెప్పెను, (అది, నది, తట, మది, జన, అనునది) 

 ఎఫ్రాయీము సంగతి చెప్పెను గాని ఇది చెప్పలేదు అన్నిటి కంటే గొప్పది. ఎందుకంటే పేతురు, యాకోబు, యోహాను అనే సంగతి క్రొత్త నిబంధనలో నున్నది. పేతురు యాకోబు, యోహాను అదే క్రొత్త నిబంధన, ఎఫ్రాయీములో గలిలయ దోనెలో, ఎఫ్రాయీములో నది, తట, జనపదములో ఈ రెండూ లేదు. అంత ప్రకాశతలేదు. స్నేహములేదు. తండ్రి శెలవులేదు. ఏదో ఒకటి తక్కువైనది.

 1) పాత నిబంధన 2) క్రొత్తనిబంధన 3) ప్రకాశత.

  బైబిలులో ఉన్న కథలలో ఎక్కువ నోట్సుదొరికే కథలలో ఇది ఒకటి అన్నిటికీ అన్నీ ఉన్నవి. ఇంకా కొన్ని బయలుదేర బోయేవి పర్ణశాలలు అనుకోవడమే గాని రాలేదు. అ (బాగావినండి) ఎవరైతే ఈ భూమి మీద దైవ సన్నిధిలో ఉంటారో వారు బైటికి వచ్చేటప్పుడు కళతో వస్తారు. మీరు సన్నిధికూటములోనికి వెళ్ళకముందు 1) విలాపముండును 2) శ్రమకలాపముండును. 3) కళావళుల్ ఉండును గనుక సన్నిధి కూటము పెట్టుకొనుట మానవద్దు. అయ్యగారు చెప్పిన కథలో ఇదివరకు చెప్పిన యేసుప్రభువు యొక్క సన్నిధిని చూచినారు. ఇప్పుడది కాదు ప్రభువే సన్నిధిలో నున్నాడు. ఎంత ఆశ్చర్యము! తక్కిన సమయములో ఆయన తండ్రి సన్నిధిలో నున్నాడు. ఆయన ఒంటరిగానున్నప్పటికిని తండ్రి సన్నిధిలోనున్నాడు గాని ముగ్గురు సన్నిధిలో నున్నారు, 12 మంది శిష్యులు కలిసి ప్రభువు సన్నిధిలో ఉన్నారు, ముగ్గురు ప్రభువు కలిసి సన్నిధిలో ఉన్నారు, చాలరాత్రి ప్రభువు ఒక్కడే తండ్రి సన్నిధినున్నారు. ఎఫ్రాయీములో 12+ ప్రభువు ప్రక్కన ఉన్నారు. శిష్యులు యేసుప్రభువు కలిసి తండ్రి సన్నిధిలోనున్నారు పేతురు అన్నాడు మనమిక్కడే ఉందాము పర్ణశాల కడదామన్నాడు అలాగే మీరు (ఇంటిదగ్గర) సన్నిధిలోనున్నప్పుడు మానివేయుటకు ఇష్టముడదు అక్కడ కథే ఇక్కడ ఉన్నది పరలోక పరిశుద్ధులు వస్తారా? మీ కూటాలకు వస్తారు. ఆకథే ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడైనా తండ్రియైన దేవుడు వస్తారా? వస్తారు. మీ సన్నిధిలోనికి మహిమ మేఘము వచ్చిందా ? (రూపాంతర కొండమీద కథ ఇప్పుడు జరుగుతుంది) రూపాంతర కొండ మీద ఉండి టక్కున ఆగిపోయింది. అప్పుడు ప్రభువు ఒక మాట అన్నారు. లెండి పోదము అన్నాడు. రూపాంతర కొండమీద ఇంకొక చిన్నమార్పు కనబడెను. మీరు చేస్తున్న సన్నిధి కూటములలో ఇవన్నీ ఉండును. లెక్కపెట్టి చూడండి ప్రార్ధన చేసిన కొలది యేసు ప్రభువులోనుండి వెలుగు కాంతి బయటకు వచ్చింది. ఆయన లోపలనుండే వచ్చినది.

యేసుప్రభువు చేసిన కొలది ఆయనలోనుండి వెలుగు వచ్చింది. వారు కన్నులెత్తిచూడగా యేసుతప్పమరేమియు కనబడలేదు మత్తయి 17:8 కొందరికి భయము కలుగును. చూడలేక అప్పుడు ప్రభువేవచ్చి ఆదరించును, మోషే ఎందుకు వచ్చెను నేనువ్రాసిన ధర్మశాస్త్రము మీకు వివరముగా ఎవరును పూర్తిగా నెరవేర్చలేక పోయినారు గాని నీవు ఒక్కడవే నెరవేర్చినావు గనుక నమస్కరించడానికి వచ్చినాను అని చెప్పడానికి మోషే వచ్చినాడు. 

 2. రాబోయే సంగతులన్నియు ప్రవక్తలు వ్రాసిపెట్టియున్నారు. వాటి పేరు ప్రవచనములు.

 3. ఆ ప్రవక్తలందరికిని ప్రతినిధిగా ఏలీయా వచ్చియున్నాడు ఎందుకంటే మత్తయి 5అ||లో ఈ రెండును ఉన్నవి. మోషే చేతిలో ఉన్న ధర్మ శాస్త్రమును, ఏలీయా చేతిలో వున్న ధర్మ శాస్త్రమును ఏలీయా చేతిలో వున్న ప్రవచనములును మత్తయి 5:17లో ఉన్నవి. ధర్మ శాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకే నేను వచ్చితిని. ప్రవక్తవచనముల తరపున ఏలీయా ఎందుకు వచ్చెను? లూకా 1:17 మరియు అతడు తండ్రుల హృదయములను..., నేను వస్తాను అనడానికి వచ్చెను అనడానికి తేడా ఉన్నదా? లేదా? దానిలో ఏలీయా ఏ ప్రవచనము యొక్క నెరవేర్పై యున్నది. ఆ వాక్యము యొక్క వివరములో మత్తయి 17అధ్యాయములో దాని వివరమున్నది. ఏలీయా యొక్క శక్తియు అని తక్కిన ప్రవక్తలు రాలేదు, ఏలీయా ప్రవక్తే వచ్చి వెళ్ళిపోయినాడు ప్రవచనము పలుకుల కంటే తానే యోహాను లోనికి వచ్చింది ఈయన పలికాడు. యోహానులోనికి వచ్చినాడు గనుక ఈయన గొప్పవాడు అదిమాత్రమే కాదు తక్కిన అందరి ప్రవక్తల కంటే తగినవాడు సన్నిధి కూటములోనికి వచ్చేవాడు అది నా అనుభవము మార్కు 9:11-13 వ|| 

  రాకడకు ముందు ఏలీయా వచ్చెను మెదటి రాకడకు ముందు ఏలియా వచ్చెను మలాకీ 4:5,6: ఏడేండ్ల శ్రమకాలమునకు ముందు వచ్చును.

 ప్రభువు యొక్క మొదటి రాకడకు ముందు యోహాను అనే ఏలీయా వచ్చి క్రీస్తునిగురించి ప్రవచించెను. ఈ ప్రకారముగా అదివరకే సిద్ధపడుచున్న వారిని సిద్ధపరచినాడు, తీరా సిద్ధపడిన తరువాత "లోకపాపములను మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో" అని చెప్పెను ఆ చెప్పడమే కాదు అంద్రెయును పేతురును అక్కడికి పంపినాడు. అప్పుడు సిద్ధపడినవారికి వేలతరబడి ప్రజలకు బాప్తిస్మములు ఇచ్చినాడు యోహాను గొప్ప ప్రసంగములు చేసినట్లు మత్తయి 3అ|| లో నున్నది.

 ఈ ప్రసంగము పధ్యములలో పెట్టితిని సన్నిధి పాఠమును రాకడ పాఠమును కలిపి చెప్పవలెను.

2. ఏలియా వస్తాడని (శాస్త్రులు) చెప్పుచున్నారు. ఇదేమిటని అడిగితే ప్రభువు అప్పుడాయన వచ్చినాడు సిద్ధపర్చినాడు మీరు ఆయనను చంపివేసినారు మీ ఇష్టమువచ్చినట్లు ఆయనను చేసినారని చెప్పెను. 

  3. రెండవ రాకడకు ముందు ఆయన రావలెను ప్రజలను సిద్ధపరచవలెను సంఘము 7ఏండ్ల శ్రమలలోకి వెళ్ళకుండా ఆపుచేయవలెను ఆ పని మీద ఏలీయా ఉన్నాడు ఇపుడున్నాడని దర్శనము లేక పోయినా వాక్యమునుబట్టి సిద్ధపరచుటకంది హృదయములోపల వచ్చినాడని నమ్మవచ్చు అనేకమంది హృదయములోపల (ఇప్పుడు) రాకడ రాకడ అంటున్నారు. అది ఏలీయా పని అదేపని కాదు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకూ బుద్ధిచెప్పిన వాడెవడు? అని చెప్పినట్టు అటువంటి మాటే మన తలంపులో పెట్టినాడు. ఏలీయా యొక్క ఆత్మయును, శక్తియు స్నానికుడైన యోహానులోనికి వచ్చెను. ఆ ఆత్మయే ఇప్పుడు సన్నిధిలోనికి వస్తే వెలిగించును.

ఏలీయాలో ఉన్న చరిత్ర అంశములలో కొన్ని యోహానులోనికి వచ్చెను అన్ని ఎందుకు? అన్ని రావు యోహానులోనికి ఎక్కువ వచ్చినది ఏమిటంటే హత్య. హతసాక్షి యగుటకు పూర్వము మచ్చుకు ఒకహతసాక్షి కావలెను అందుకు తగినవాడు యోహాను మొదటి రాకడకు ప్రజలను సిద్ధపరచినాడు ఇప్పుడు రెండవరాకడకు సిద్ధపరచవలెను మొదటి రాకడకు భూలోక ప్రజలను సిద్ధపరచినాడు. ఇప్పుడు పరలోక పరిశుద్ధులును కూడా సిద్ధపరచవలెను. ఆ పనికి కూడ యోహాను తప్ప మరి యొకడు పనికిరాడు సిద్ధపరచుటలో ఇది ఒక రకము అందుచేతనే మేము రాకడకు త్వరగా సిద్ధపడుదుము 7ఏండ్ల వరకు వుండము అనికొందరు అనుచున్నారు. భీతి కలిగినది.

 ప్రార్ధన:- ఓ ప్రభువా! ఏలీయాను గురించి మేము నేర్చుకొన్న పాఠములు మమ్ములను సిద్ధపరచేటటువంటి పాఠములను చూపించుము ఆమెన్.
Please follow and like us:
నాలుగవ ప్రసంగము – పరిశుద్ధుల సన్నిధి
Was this article helpful to you? Yes 1 No

How can we help?