1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము
  4. ఏడవ ప్రసంగము – సింహాసనము

ఏడవ ప్రసంగము – సింహాసనము

యెషయా 4అ||

సిరా కాని సిరా ఎంతమంది దగ్గరనున్నదో చెప్పండి. కుండగాని కుండ గాని కుండ ఏమి? మీరు నేను లేకుండ నేను ఏమి చేయను.

ప్రార్ధన:- దయగల ప్రభువా ! ఒకప్పుడు నీవు కొండమీద అడవిలో, దేవాలయములో, తీర్ధములో, ఇంటిలో, వనవాసములో, కోర్టులో, పంచాయితీ సభలో, తోటలో, సిలువమీద, దారిలో, రహస్యమైన ఇంటిలో, అనేక వాక్యములు పలికినావు. ఆ పలుకులన్ని సమకూర్చి చూస్తే నీవు దేవుడవని, సంపూర్ణ మానవుడవని ప్రజల యందు దయారసముగల వాడవని తెలిసికొంటున్నాము అలాగే ఈ వేళ సన్నిధి గురించి గ్రంధములో నున్నటువంటి మాటలను తీసి కొని చిలికేటట్లు కృపదయచేయుము. అప్పుడు దానిలో నుంచి మేము చిలికేటప్పుడు మా జ్ఞానములే కవ్వముతో చిలికేటప్పుడు నీ సన్నిధ్ధానమందుగల వన్నె తేలును. అప్పుడు మాకు వన్నె (అందుచేత అట్టికృప నిన్నటివలె ఈవేళ కూడ దయచేయుము.)    విసుగుకలిగేటట్లు వ్రాసికొనుటలో ఆయాసపడకుండేటట్లు కట్టడలైతే మంచివే కాని, మేమెక్కడ నెరవేర్చగలము అని అనుకొనకుండేటట్లు నీ కృప మా అందరి మీద క్రుమ్మరించుము మేము చేసిన విజ్ఞాపన ప్రార్ధన యుక్తకాలమందు, నెరవేర్చుదువని నమ్ముచున్నాము. నీ కనేక వందనములు నీ ఆత్మ ప్రేరేపణ సంతోషము బలము, ఆరోగ్యము, జ్ఞానము, పవిత్రత, మాకు దయచేయుము రేపు శ్రమలు వచ్చేటప్పుడు ఎవ్వరును తగ్గిపోకుండ కాపాడుము ఆమెన్.

 ప్రసంగము:- సన్నిధి వన్నె వాక్యము చిలకాలి సన్నిధికి దూరముగా నుండే కళలేదు సన్నిధిలోనికి వస్తే వన్నె మనకు కళ వస్తుంది అనగా ఆత్మకు పైన సన్నిధివన్నె అని ఉన్నది క్రింద త్రియేక దేవుని గుర్తు ఉన్నది ఆ గుర్తు కుడిప్రక్కన సింహాసనమున్నది బోర్డు క్రింద 1) ఆజ్ఞలు 2) సలహాలు 3) జాగరూకతగల వచనములు 4) బహుమానములు 5) తీర్పులు 6) శిక్షలు.

శిక్షలన్నియు సింహాసనము దగ్గరనుండియే రావలెను పరలోకమునకు, భూలోకమునకు, పాతాళమునకు అంతే ఏలివచ్చిన సింహాసనము దగ్గరనుండియే రావలెను రేపు శ్రమలు వస్తే సహింపు సింహాసనము దగ్గరనుండియే రావలెను. దయ్యములకు చెప్పవలసిన మాటలు ఉంటే సింహాసనము దగ్గరనుండియే వచ్చును మూడుకాలముల విషయములు సింహాసనము దగ్గరనుండియే రావలెను. చరిత్రలు, వ్రాతలు, అద్భుతములన్నియు సింహాసనము దగ్గరనుండియే రావలెను మన కంటికి కనబడుచున్నవి. చెవికి వినబడుచున్న పనియు సింహాసనము దగ్గర నుండియే రావలెను ఈ సంగతి ప్రకటన గ్రంధములో వివరముగా నున్నది అక్కడ వాడుక పదమున్నది. అదేమనగా సింహాసనము నందు ఆశీనుడై యున్నవాడు అనునది (ఇప్పుడు) గడ్డు ప్రశ్నలేమైనా ఉంటే మనకు శ్రమపెట్టె కుట్రాలోచన చేయువారికి కూడా సెలవు సింహాసనము నుండియే రావలెను. వారు కదల మెదలలేకుండా ఉండే దేవదూతలు వచ్చి సరే సెలవైనది మీ యిష్టము వచ్చినట్టు చేసికొనండి అని అంటారు ఆసమయములో భూలోకములో భక్తులు ప్రార్ధనలు కూడుకొనరు మనస్సులో అనుకొంటారు. అప్పుడు దేవదూతలువచ్చి సింహాసనము దగ్గర “బై ఆర్డరు” అయ్యింది. ప్రార్ధన పెట్టుకొనండి. శత్రువులకు సింహాసనము వద్దనుండియే సెలవు. భక్తులకు సిం హాసనము వద్ద నుండియే సెలవు. ఈ కథ అంతా అయ్యగారికి కనబడుచున్నది ఏమిచెప్పను? అట్లే మీకు కూడ ఆత్మజ్ఞానమునకు కనబడవలెను ఒకదయ్యము అనుకొంటున్నది ఈ క్రైస్తవ జనసమూహము మీదికి, ఏవో తెగుళు వస్తే బాగుండును. అప్పుడు సింహాసనము దగ్గరనుండి దయ్యమునకు సెలవు వచ్చును. అప్పుడు జబ్బువల్ల గ్రామమంతా వ్యాపిస్తుంది. అది విని భయపడి ఒక భక్తుడు ఇంటింటికి తిరిగి మనము ప్రార్ధన పెట్టుకొందాము రండి అని ఆలోచించుకొనుచుండగా సింహాసనము వద్దనుండి సెలవు వచ్చెను పెట్టుకొనుటకు ఇంకొక ఆయనకు ఫలానా గ్రామం వెళ్ళిసేవ చేయవలెనని ఉన్నది సహాయకులులేరు అనుకొను సమయములో సింహాసనము వద్దనుండి సరే వెళ్ళు నేను నీకు తోడుగానుంటాను అని సెలవువచ్చును, దేవదూతలు మనకు పరిచారకులుగదా! గనుక సింహాసనము వద్దనుండి ఆర్డరు మనకు తెచ్చునుకాని మనకు తెలియదు భక్తులకైనను తెలియదుగాని సన్నిధానవర్తులకు తెలియును వెళ్ళి బోధిస్తే ఒక్కడైన వినడు అప్పుడే భక్తుడు ప్రభువా నీవు నన్ను వెళ్ళమన్నావు, ఒక్కడు వినలేదు సరిగదా ఇంకాస్తసేపు ఉండి కొట్టనైయున్నారు. ఇదేమీ అనుచు అప్పుడు పైనుండి వచ్చును నీవు కదలవద్దు బెదురవద్దు, నీవు చెప్పుకొంటూ వెళ్ళిపో. అని ఈ ప్రకారము, అన్ని ఆజ్ఞలు, కష్టములు సేవకులందరికి వచ్చును. అలాగే బహుమానములు కూడ వచ్చును ఆది 4:12-14.

 దీని క్రింద వ్రేలెడు గీతగీసి కొందరు వెళ్ళిపోవుదురు. ఇప్పుడు మీకు వచ్చే దర్శనములన్నియు   

నాకు ఇదివరలోనే వచ్చినవి రాజమండ్రిలో నున్నప్పుడు నీకు విరోధులు లేరు. రేపు నీ చుట్టాలే విరోధులుగా లేస్తారు అని ప్రభువు అన్నారు. ఏమిటి ప్రభువా! ప్రేమగా చూస్తూ ఉంటే విరోధులు ఎట్లా ఉంటారని అన్నాను. గాని ఇప్పుడు నెరవేరుచున్నది. బలములోని దయ్యములు సహా బైటకు రావలెనంటే రావలెనంటే సింహాసనము నుండి సెలవు రావలెను. కొందరు దేవుడెంత చెప్పిన ఎంత చాన్సు ఇచ్చినా, ఎంత కనికరము కనుపరచినా, ఎంత బాబూ, నాయనా అని బ్రతిమాలిడినా సన్నిధి నుండి వెళ్ళిపోవుదురు. జాగ్రత్త!

సరిగా అట్టివారికి కయీనుకు ఏగతి అబ్బునో ఆగతి అబ్బును అలాగే కయీను వలె దేశదిమ్మరిగ తిరుగక పోయినప్పటికి, వారి మనస్సు మాత్రము గిరగిర తిరుగుచుండును శాంతి, నెమ్మది ఉండదు మా వాళ్ళందరు సన్నిధి కూటములు పెట్టుకొన్నారు. మాకైతే కుదురుటలేదు. అదే కుదురుబాటు లేకపోవుటయు దేశదిమ్మరితనములై యున్నది అనేక మంది కది జరుగుచున్నది. ఎందుకంటే నా సన్నిధికూట పత్రికలు ఎవరికందినవో వారందరికీలాగు జరుగును, అంగీకరించని వారికీలాగు జరుగును. కయీనుకు ఈ సంగతులన్ని దేవుడు చెప్పాక దేశదిమ్మరి అయ్యాడా? చెప్పకముందా? అలాగే సన్నిధి కూటములు చెప్పకముందా? అలాగే సన్నిధి కూటమును గురించిన సంగతులన్ని పత్రికలద్వారా తెలియజేసిరి. గనుక అంగీకరింపని వారికి మనస్సులో దేశదిమ్మరి తనము పుట్టును సింహాసనము దగ్గరనుండి "బై ఆర్డరు" రాకపోతే ఆపత్రిక వ్రాయరు 1. సన్నిధి కూటమునకురారు. 2. సన్నిధికూటమునకు కొందరు వచ్చెదరు. 3. సన్నిధికూటమునకు వచ్చిన కయీను వలె కొందరు వెళ్ళిపోవుదురు. 4. గాని సన్నిధికి వత్తురు గాని వచ్చిన సన్నిధిలో కయీనువలె నుండరు, దేవుడు మాట్లాడేటప్పుడు కయీను సన్నిధిలో నున్నాడుగదా! ఆయన చెప్పినది విన్నాడు, ఉన్నాడు గాని పోయాడు నేడుకూడ అలాగే జరుగుతుంది కయీను కథ ఇక్కడే చదవండి. ఇంటికి వెళ్ళిన తరువాత మీరు చదువరు చదువుతారనే విశ్వాసము నాకు లేదు.   

 1. ఆగ్రహము 2. ముఖము చిన్నబుచ్చుకొన్నాడు. 3. సత్క్రియ చేసిన సంతోషముగా నున్నాడు. 4. పాపము పొంచి యుండును. 5. వాంఛకలుగును, 6. అది నిన్ను ఏలును కయీను విన్న తరువాత చెడినట్లు మనవారును అంతే.

 1) తమ్మును ఎరుగును. 2) కావలివాడనా? సన్నిధినుండి వెళ్ళుటకు మెట్లు 1) దేవుడు అన్నది ఏమిటి? నీవు చేసినది ఏమిటి? రక్తపుమొర, పంటరాదు. దిగులు సన్నిధికూటమునకు రాకపోయినా దిగులే, వచ్చినా దిగులే, కాబట్టి మీరు ఎవ్వరు సనిధికూటము విడిచి పెట్టవద్దు ఎవరేమన్నా సరే సన్నిధి కూటములు జరుగుచుండగా బైటవారు మేమువెళ్ళలేకపోతిమే అని తొంగి తొంగి చూస్తున్నారు దిగులు పడుదురు ఇంకొకరు ఇంకొకటి లోపలనుండువారికి కూడ కయీను గుణములబ్బునువారికి దర్శనములు వచ్చినవి నాకు రాలేదు ఈ సన్నిధి కూటము వల్ల అనేక మంది మనస్సు చెడిపోతుంది మొట్టమొదటి ఒకమంచి పనిజరిగినందువల్ల కయీనుకు మనస్సు చెడిపోయింది తన తమ్ముడైన హేబేలు అర్పణను దేవుడు అంగీకరించెను మరియు అర్పణ మంచిదే అబ్బాయి మంచివాడే తన అర్పణ మంచిదే ఈ మూడు మంచితనములు చూచి సంతోషించుటకు బదులు కయీను చెడిపోయెను హేబేలువలె మన కూటము సన్నిధికి వస్తుంది అర్పణ చేస్తుంది అంగీకరింపబడుతుంది. ఇది చూచి కయీనువలె ఇతరులు కొందరు కూటములోనికిరారు బైటవారు చెడుదురు దేవుడు ఎన్నిచెప్పినా కయీనువలె చెవికందెను గాని తలకెక్కలేదు అనగా మనస్సున కెక్కలేదు కారణమేమంటే లోపల కోపమున్నది తమ్ముని చంపుట దేవునిపై కష్టము చొప్పున, దేవునికి బుద్ధిచెప్పుటకు చేసెను.  

ప్రార్ధన:-దయగల ప్రభువా! ఈవేళ మేము సన్నిధిలో నుండి వెళ్ళిపోవుట అనే భయంకరమైన వర్తమానము విన్నాము ఈవేళ వర్తమానమును సన్నిధి పత్రిక చదివిన వారందరు మానకు తమ ఇంటివద్ద సన్నిధికూటము పెట్టుకొనే కృప అనుగ్రహించుమని వినయముగా వేడుకొంటున్నాము ఆమెన్.

కయీనుకు సెలవు ఇచ్చివేస్తాము అతడు దేశదిమ్మరియై చాల దేశములు తిరుగవలెను.

సన్నిధి వన్నె చక్రము:- కయీనును గురించిన ఒక మాట ఉన్నది. కయీను అను మాటకు సంపాదన అని అర్ధము. నేను సంపాదించితిని అనుకొన్న అవ్వమ్మ కొడుకును పోగొట్టుకొన్నది. గనుక సంపాదనపోయింది. అనగా లోకమునకు రావలసిన స్త్రీ సంగతి అగు క్రీస్తు ప్రభువు ఈ కయీనే అని పొరపాటుగా అనుకొన్నది అనుకొన గూడనిది అనుకొన్నది గనుక పోయినది పోవలసినది గనుక పోయినది సాతాను అవ్వకు ఆదిసర్పము ఇచ్చిన విషపు ఇంజక్షనులాగ శరీరమునకు ఎక్కి, శరీరము తగ్గి, మెదడుకు కూడ ఎక్కి జ్ఞానము తగ్గినది అజ్ఞానము వచ్చినది. గనుక ప్రభువు చెప్పనిదే సాతాను చెప్పినందువల్ల ఈ కయీనే రక్షకుడని అనుకొన్నది మనకాలంలో అనేకులు ఇట్లే అనుకొనుచున్నారు, రక్షకుడు కాని ఒకరిని చూచి రక్షకుడని, ఒక మతగురువును చూచి ఇతడే రక్షకుడనుకొని, భ్రమపడి మోసములో పడిపోవుచున్నారు.

 నెవాబు దేశము వొళ్ళోడు కయీను సంగతి ఆ దేశమువెళ్ళి  ఆ పేరు పెట్టుకున్నాడు. గనుక మోషే ఆ పేరు వ్రాశాడు కొందరు బైబిలు విధ్యార్ధులు అదివరలో దేశాలు, ప్రజలు వేరుకదా? ఎలా వెళ్ళాడు అని ప్రశ్నించుచున్నారు. (ఒక చెట్టుయొక్క) అన్ని మతముల వారికి, అన్ని మిషనులవారికి, కవీశ్వరులకు క్రైస్తవులు జవాబు చెప్పవలెను (బైబిలు మిషనువారు) అన్ని మిషనులోని క్రైస్తవులు వారికి జవాబు చెప్పకపోతే బైబిలుమిషనువారు చెప్పవలెను బైబిలులోని కఠినమైన మాటలకు అర్ధములు చెప్పుమని అడుగవలెను అప్పుడు సరియైన అర్ధములు వాక్యాలు చెప్పుదురు ఆది 4అ|| ఫిలిప్పు 2అ|| యెషయా 9వ అధ్యాయములోనిదే క్రైస్తవ మతమైయున్నది నిర్గమ 33:14; నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కయీను దగ్గరకు సన్నిధి వచ్చింది గాని కయీను వెళ్ళిపోయాడు మోషే దగ్గరకు వచ్చింది గాని సన్నిధిలో ఉండి పోయినాడు.
Please follow and like us:
ఏడవ ప్రసంగము – సింహాసనము
Was this article helpful to you? Yes 2 No

How can we help?