1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము
  4. ఎనిమిదవ ప్రసంగము – స్వస్థత

ఎనిమిదవ ప్రసంగము – స్వస్థత

యెషయా 5అ|| : రోమా 16 అధ్యాయము.

యాకోబు 4:7; యోహాను 3:3; మార్కు 5అ||అర్జంటు కేసులు వచ్చుట మనకు అభ్యాసము కొరకు. ప్రతి సోమవారము కాకానిలో పనిచేసేవారు దయ్యాలను వెళ్ళగొట్టుచున్నారు అది కాదు ఇది కాదు ఎక్కడో దూరాన ఉన్న గోదావరిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. 1889వ సం|| ఆగస్టు 22వ తేదీన అయ్యగారిని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దొరసానమ్మగారు వెళ్ళిపోయారు. జర్మనీ వెళ్ళిపోయారు జర్మనీలో యుద్ధము జరిగినపుడు కొందరికి గాయాలు తగిలినప్పుడు ఆసుపత్రిలో ఉండగా రాత్రిపూట ప్రభువు వారికి కూజానీళ్ళు పట్టించెవారు. ఒక ఆయన గమనించి మీ చేతిలో నున్న మచ్చ ఏమిటని అడుగగా ఇదివరకు ఒక యుద్ధము జరిగినది, నేను ఆ యుద్ధములో గెలిచాను ఆ గాయమిదే. (ప్రార్ధనయే సాధనము, దూరమున నున్నవారికి సహాయము చేయవలెనంటే ప్రార్ధన సహాయమే సహాయము మనము వెళ్ళకపోయినా ప్రార్ధన సహాయము చేస్తుంది. యేసుప్రభువును గెదరేనీయుడు పిలువకపోయినను అతని తరపున ఎవరైనను పిలువక పోయినప్పటికి నీవే స్వయముగా స్మశానమునకు వెళ్ళి అతనిచేత ఆరాధన చేయించుకొని దయ్యములను వెళ్ళగొట్టినావు; అలాగే నీవు తణుకులో నున్న అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఆ అబ్బాయిలోని దయ్యమును నీవు వెళ్ళగొట్టుము ఇప్పుడు మేము టెలిగ్రాము ఇస్తున్నాము దానిని వెళ్ళగొట్టువారి ద్వారా ఆదరణ కలిగించుము. మార్కు  

ప్రభువు మనసులో గద్దించినాడు. ఆ గద్దింపు ఆ దయ్యానికి తెలిసిపోయింది. "దేవా తండ్రీనీకు" అనే పాట సువార్తలలో ప్రభువు ఏయే రొగులకు స్వస్థపరచెనో ఆ కథలు చదివి ఎత్తి వివరించిన ఇప్పుడు ఆయా రోగుల కొరకు ప్రార్ధన చేయవలెను.

మన ప్రార్ధనకు మొదటిస్థానమియ్యకూడదు. రోగమునకు సంబంధించిన సువార్తకథకు, వాక్యమునకు వివరమునకు స్థానమియ్యవలెను, అప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది. (సువార్తలలో లేకపోయినప్పటికిని కాకాని మొదలగు స్థలములో క్రొత్తక్రొత్త రోగులను బాగుచేసిన విషయమెత్తిప్రార్ధన చేయవలెను కాకానిలోగాని సువార్తలలోగాని, బైబిలులో మరెక్కడాగాని లేని జబ్బువస్తే అప్పుడేమి చేయవలెను. మత్తయి 4:24; నానావిధము అను మాటలో తక్కిన జబ్బు లన్నియు ఇమిడియున్నవి. కొంతమంది చాదస్తపు పండితులు యేసుప్రభువు క్షయ రోగులను బాగుచేసినాడా? అని అంటారు. అట్టివారికే వాక్యము చూపించవలెను "ఎఫ్తా" అని చెప్పి నత్తి, చెవిటివానిని బాగుచేసిన ప్రభువా ఇక్కడవున్న బిడ్డను బాగుచేయుము. కాకినాడలో నీవు వానిని ముట్టి విశ్వాసము పుట్టించి బాగుచేయుము. పిశాచి ఒక మాట అంటాడు వారిని గురించి, వీరిని గురించి మహా చక్కగా ప్రార్ధించావు. గాని నీవు తిన్నగా ఉన్నావా? అంటాడు తిన్నగా ఉన్నావా ఏమిటి? నేను పాపినైనా నా మీద నీకు అధికారము లేదు నీవు నా నిమిత్తమై సిలువమీద రక్తము కార్చినావా ఏమిటి? నీకంటిలోనున్న దూలము మాట చెప్పక, నాకంటిలోనున్న నలుసు నీవు ఎత్తడానికి నీకు ఏమి అధికారము?

” గెటౌట్” ఇది నా ప్రభువు చెప్పారు ఇది నామాట కాదు. ముందు నీకంటిలోనున్న దూలమును తీసివేసికొని అప్పుడు సిలువదగ్గరకువచ్చి నమస్కారము చెపితే వింటాను. గాని ఇప్పుడు చెప్పడానికి నీకేమి అధికారమున్నది. శ్మశానభూమిలో నున్న పిచ్చివాడు నమస్కారము చేశాడు. గాని నీవు చేశావా ఏమిటి? దేవుని వాక్యము ఎత్తితే నీ ప్రార్ధనకు ఎక్కువ బలము కలుగుతుంది. దయ్యాలను గురించి వాక్యములో ఎక్కడెక్కడ నున్నదో ఆ వాక్యాలన్ని అచ్చువేసి పంపాలని చాలకాలము నుండి ఉన్నది, గాని ఇంకా జరుగలేదు.

Please follow and like us:
ఎనిమిదవ ప్రసంగము – స్వస్థత
Was this article helpful to you? Yes 1 No

How can we help?