క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. రాకడ పండుగ
  5. రాకడ పండుగ – II

రాకడ పండుగ – II

తండ్రి: యెషయా 2: 1-4: కుమార: మార్కు 13: 32-37; పరిశుద్ధాత్మ:

ప్రకటన:22:20,25. మహిమలోకంబునకు – అను కీర్తన.

రాకడ కొరకు కనిపెట్టుచున్న విశ్వాసులారా! నేటి ఉదయము నేను మీకు, కొన్ని సంగతులు వినిపించబోవు చున్నాను. ఇది వరకు వాటిని మీరు విన్నను ఈ దినము పద్ధతి మాత్రం క్రొత్తది. ఈ లోకములో సంఘము, లోకస్థులు అనేకులు రాకడ తలంపు గలవారై యున్నారు. 1) కొందరు విశ్వాసులు రాకడ వచ్చివేసినట్టే, ఆనందించి నిరీక్షించుచున్నారు. 2) అన్యులు రాకడను గూర్చిన సంగతులు తెలిసికొనుటకు ఆశపడుచున్నారు. మా ప్రభువు ఎప్పుడు వచ్చునో మేము కూడా తెలిసికొనుటకు ఇష్టపడుచున్నాము అని అనుచున్నారు. 3) క్రైస్తవులలో, అన్యులలో నమ్మని వారు – రాకడ గూర్చి అడుగుచున్నారు. కనుక ఈ భూలోకమందు 3 గుంపుల వారున్నారు.

1) విశ్వాసులు, 2) అభిమానులు, 3) విమర్శకులు (హేళనాపరులు). వీరు – మేము చదివినాము అయినను మాకు తెలియలేదు. అర్ధం కాలేదు అని అందురు. ఈ మూడు తరగతుల వారు భూలోకమందు ఉన్నారు. కనుక ఈ మూడు తరగతుల వారి అనుభవములు విశ్వాసులు మాట్లాడుకొంటే మంచిది. సంవత్సరము చివరలో, అనగా నవంబరు చివరలో రాకడ గురించి మాట్లాడవలెననే ఒక ఏర్పాటు లూథర న్ మిషనులో ఉన్నది. అదే అడ్వెంటు కాలము.

ప్రకటన 22:20 అవును, ఆమెన్; రమ్ము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచున్నారు. నేను ఇప్పుడు ప్రసంగ వాక్యముగా ఏర్పర్చుకొన్న వాక్యము. యేసుప్రభువు చెప్పిన ఒక చిన్నమాట. అదేమనగా ‘ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.’ ఈ ఒక్క వాక్యము 4 భాగములుగా ఉన్నది. ‘త్వరగా’ అను ఒక్క మాట చెప్పి 2000 ఏండ్లు అయినది. నా ఉపన్యాసము; గాలిలో ఈ అక్షరములు వ్రాసిన పిదప మరికొన్ని భాగములు ఊహించండి. కొన్ని ఈ దిగువ నున్నవి. 1) ఆయనకే 2) ఆయన దృష్టికే 3) ఆయనకే ఆలస్యం (జాగు) 4) సువార్త ప్రకటన 5) ఆత్మ స్నానం (బాప్తిస్మం) 6) ఎత్తబడవలసిన వారుసిద్ధపడుట (సంఘము సిద్ధపడుట).

1) త్వరగా:- అన్నమాట దిగువనున్న మొదటి భాగము ‘ఆయనకే; రెండు వేల సంవత్సరముల క్రిందట

ఈ మాట చెప్పునప్పుడు ఎప్పుడు రెండవ రాకడ వచ్చునో ఆయనకు తెలుసును. మార్కు సువార్తలో కుమారునికి తెలియదు అని వ్రాయబడియున్నది. మనుష్య కుమారుడు మేఘాసీనుడై వచ్చును అనెను గాని ప్రకటనలో, ‘నేను వచ్చెదను ‘ అనెను. భూమి మీదున్నప్పుడు మనుష్యత్వమునకు తెలియదు గాని ఆయన మహిమలోనికి వెళ్ళెను గనుక త్వరగా వచ్చుచున్నాను అనెను. ఆ మాటే సువార్తల కాలములో అన్నారు. ఆ మాట వంద సంవత్సరముల క్రిందట కాలములో లేదు.

ఉదా:- నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని ఊరికి వెళ్ళునప్పుడు అంటారు. తెలిస్తే త్వరగా వస్తానంటారు. ఆలాగే యేసుప్రభువుకు అతి త్వరగానే అన్నట్లుగా ఆయనకు తెలియును. మనకు ఆలస్యముగాని ఆయనకు త్వరగానే ఉండును. మనకు ఆలస్యమన్నట్లు చెప్పుదుము, అయితే ఆయన లెక్క ప్రకారము త్వరగానే, విశ్వాసులు ఆయనవారు, ఆయన తన విశ్వాస జనమునకు సంబంధించినవాడు. ఆయన విశ్వాసుల రక్షకుడు, విశ్వాసులు ఆయన బిడ్డలు, ప్రభువు యేమనునో విశ్వాసులుకూడా ఆ మాటే అందురు, అనగా త్వరగా అనే మాటే విశ్వాసులందురు. అవిశ్వాసులైతే ఆలస్యమందురు. వారు లోకస్థులు గనుక ఈ ‘త్వరగా’ అను మాట యేసుప్రభువునకే చెందియున్నది అని అంటారు. విశ్వాసులలో కూడ లోకస్తులు ఉంటారు. అది అనగా ఆ మాట ఆయనకే. ఆయన మనస్సులో త్వరగా వస్తాను అని ఉన్నది గనుక త్వరగా అన్నారు. భూలోకములో నున్న రాకడ విశ్వాసులు ఆయన మాటే అంటారు. అప్పుడు తక్కిన వారు, త్వరగా వస్తాడని మీకు తెలిసినదా! అని అడుగుదురు. విశ్వాసులైతే ఆయన చెప్పెను గనుక మేము నమ్ముదుము అందురు.

1) రాకడ విశ్వాసులకును, తక్కిన విశ్వాసులకును,

2) రాకడ విశ్వాసులకును, లౌకికులకును,

3) రాకడ విశ్వాసులకును, తెలియనివారికిని ఈ ముగ్గురకును అదే భేదము గలదు.

ప్రభువు త్వరగా వస్తానన్నారు గనుక ఇక వాదమక్కరలేదు.

2) వాదము:- దృష్టి అనగా దేవుని దృష్టిలో, 1000 సంవత్సరములు ఒక దినము అని పేతురు వ్రాసెను. దానిని బట్టి చూస్తే, ఈ రెండు వేల సంవత్సరములు రెండు దినములు మాత్రమే. గనుక ఇప్పుడు ఆయన దృష్టికి త్వరగా అన్నట్లున్నది. ఆయనకు త్వరగా గనుక, మేమును అట్లే కనిపెట్టుదుము అని విశ్వాసులంటారు.

3) ఆలస్యము:- పేతురు – మీ నిమిత్తమే గదా! ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనెను. మన నిమిత్తము ఆలస్యం గాని ఆయన నిమిత్తము కాదు. ఇదంతా చిక్కులు గాను, మర్మముగాను ఉన్నట్లున్నది, గాని వాక్యమును వివరిస్తే ఎక్కడా చిక్కులేదు. మనవల్ల తప్ప ఆయనకు ఆటంకము లేమియు లేవు. గనుక ఆయన యొక్క త్వరగా అను మాటను, మన యొక్క ఆలస్యము అను మాటగా మార్చుకొన్నాము. యోహాను మరియు శిష్యులు, యూదుల భయమువల్ల తలుపు వేసికొని ఉండగా, ఎవరు తీయకుండ ప్రభువు లోనికి వెళ్ళెను. వారికి తలుపు ఆటంకముగాని, ఆయనకు ఆటంకము కాదు. ఆలాగుననే యేసుప్రభువు వచ్చుట కూడా ఉన్నది. అది జాగు అనే భాషలో చెప్పవలసినది.

4) సువార్త ప్రకటన కాలము:- అనగా యేసుప్రభువు రాకడకు ముందు సువార్త ప్రకటన యున్నది. అనగా ఆ కాలము వారు ప్రభువు కొరకు ఎదురు చూచిరి. సుమెయోను సిద్ధపడినాడు “నాధా!” నిన్ను చూచు భాగ్యము కలిగినదని సంతోషించెను. సువార్త ప్రకటన లేనిదే అందరుసిద్ధపడగలరు గనుక 1) వచ్చాడు అనే సువార్త. 2) వస్తున్నాడనే సువార్త; సంఘము అందరికి చెప్పవలసి యున్నది. ప్రభువు త్వరగా వస్తున్నాడు కాబట్టి మేము త్వరగా ప్రకటించాలి. కొంతమంది మిగిలిపోతే మమ్మును లెక్క అడుగును. 1) వస్తాననే చెప్పాడు అది ఒక సువార్త 2) వచ్చి మూడున్నర సంవత్సరములు వాక్య పరిచర్య చేసాడు. 3) ఇక త్వరగా వస్తాడు. 4) నాల్గవ భాగం, యోవేలు గ్రంధములో వ్రాయబడి యున్నది. అంత్య దినములలో యున్న జనాంగము మీద నా ఆత్మను కుమ్మరించెదను అని యున్నది. ఇప్పుడు జరుగవలెనో, ఎప్పుడు జరుగవలెనో మనకు తెలియదు గాని ఇప్పటి కాలం చూస్తే ‘బైబిలు చదవవలెను, ఆత్మను పొందవలెను ‘ అను ఆలోచన చాల మందిలో ఉంటుంది. అదియొక గురుతు గనుక తప్పకుండ ఆత్మను పొందవలెను. పెంతెకొస్తు దినమున యూదులు ఆత్మను బొందిరి. వారికొక బలము కావలసి వచ్చినది. ప్రభువు వారితో చెప్పినట్లుగా వారు శక్తి పొందిరి. మనకు కూడా అదే రీతిగా ప్రభువు అనుగ్రహించగలరు. ఇప్పుడు మనము కూడా మరిఎక్కువగా ఆత్మ శక్తి పొందవలెను.

Please follow and like us:
రాకడ పండుగ – II
Was this article helpful to you? Yes 3 No

How can we help?

Leave a Reply