క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. మట్టలాదివారము
  5. మట్టలాదివారము 2

మట్టలాదివారము 2

(వాక్య భాగము:మత్తయి 21:1-17; మార్కు11:1-17; లూకా 19:29-46; యోహాను 12:12-16)

దావీదు కుమారునికి జయము

ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక!

సర్వోన్నతమైన స్థలములలో జయము, మత్తయి 21:9.a

ఈ స్తుతిలో ప్రభువునకు జయము అని వారు పలిక్రి ఈ వారము యేసుప్రభువు సర్కీటులోనుండి, సేవ ముగించుకొని, ఆదివారము యెరూషలేము పట్టణములో నున్న దేవాలయములో నుండిరి. సోమవారము బేతనియకు వెళ్ళిరి. ఈ ఆదివారమునుండి ప్రభువు, తన శిష్యులకు ఆఖరు బోధలు చేసిరి. తరువాత వారికి ప్రభురాత్రి భోజనమిచ్చి గెత్సెమనే తోటకు వెళ్ళిరి. అక్కడనుండి కోర్టులకు ఆయనను నడిపింతురు. ఈ వారములో ప్రభువునకు, శ్రమ తరువాత శ్రమ వచ్చుచునే యుండును. శుక్రవారమునకు మహాశ్రమ వచ్చును. ప్రభువు సర్కీటు చివరిలోనున్న కైసరయ నుండి పట్టణమునకు వచ్చిరి. తన శిష్యులను బేత్సగే అను గ్రామమునకు గార్ధభము కొరకు పంపిరి. ఇచ్చట ప్రభువుయొక్క 70 మంది శిష్యులలో ఒకరున్నారు. ప్రభువునకు గల విచారమేమనగా, యూదా మత గురువులు ఆయనను అంగీకరించుట లేదు. వీరికి గ్రంధము ఉన్నది. అందులో ప్రభువును గూర్చిన ప్రవచనములున్నను, వీరు ఆయనను అంగీకరించుటలేదు. అయితే ప్రభువునకు గల సంతోషము ఏమనగా సామాన్య జనులు ఆయనను అంగీకరించు చున్నారు. ఎందుకనగా వారు కండ్లతో ప్రభువు చేసిన అద్భుతములు చూచుచున్నారు. గ్రంధమున్ననూ శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను అంగీకరించుట లేదు, చూచుటలేదు.

పై స్తుతిలో దావీదు కుమారునికి జయము అని గలదు. భూమి మీద ప్రభువునకు జయము ఈ లోకములో ప్రభువు దావీదు కుమారుడుగా జన్మించెను. శరీరముతో ఈ లోకములో ఆయన చేసిన పని అంతటికిని జయము అని ఆ స్తుతిలో గలదు. సర్వోన్నతమైన స్థలములలో జయము అనగా పరలోకములో ఆయనకు జయము. తన పని అంతయును భూలోకములో జయకరముగా ముగించెను గనుక పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. గనుక ఆయనకు భూలోకములోను, పరలోకములోనూ జయము. క్రీస్తు ప్రభువు పనివలన దేవునికి జయము ఆయనను నమ్మిన వారందరికిని జయము. పరలోకములోనున్న పరిశుద్ధులకు జయము – సర్వో జయము! అయితే ప్రభువు ఎదుట – సనెహడ్రిన్ సభవారు ఆయనను సభలోనికి తీసికొని పోవుట, తర్వాత గవర్నమెంటు కోర్టులో కేసు విచారణ తర్వాత సిలువతో ఊరేగింపు, సిలువ, మరణము, సమాధి ఉన్నవి. ఇవన్ని అపజయములు. ఇన్ని అపజయములు ఎదురుగా కనిపించు చున్నవి గనుక ఇప్పుడు కాదు జయము. పునరుత్థానము తర్వాత జయము. అని ప్రభువు చెప్పవలసినది గాని ప్రభువు అట్లు చెప్పలేదు. ఆయన జీవమై యున్నాడు గనుక ఆ శ్రమలకు, అపజయములకు ఎదురెక్కెను. గాని వాటికి దడిసి వెనుకకు తిరుగలేదు. అలాగే విశ్వాసి కూడ శ్రమలకు ఎదురెక్కవలెను గాని శ్రమలను చూచి వెనుకబడి పోరాదు. శ్రమలకు ఎదురెక్కక ముందు గార్ధభమును ఎక్కెను. అనగా శ్రమలొక లెక్కా ఏమిటి! అన్నట్టు, “జయము” నాదే అన్నట్టు, ముందే గార్ధభము ఎక్కెను. రెండు కొరకంచుల (పెద్ద అగ్నిగోళముల) మధ్య మంచుగడ్డవలె ఆయన ఉన్నాడు. అగ్నివలె నిందలు, శోధనలు, బాధలు వచ్చినవి గాని ఆయన వాటన్నిటిని సహించు కొన్నాడు. అగ్నిలోనికి ఆయన వెళ్ళినాడు. సహించుకొన్నాడు. అలాగే విశ్వాసి కూడ శ్రమలు ఉన్నపుడు ప్రభువు వలె శాంతముగా నుండిన యెడల, ఆ శ్రమలు చల్లారిపోవును. విశ్వాసి ప్రభువు వలె సహించుకొనుట వలన జయించగలడు. యేసు ప్రభువునకు పునరుత్థానమగుదును అను విశ్వాసము, ధైర్యము గలదు. గనుక శ్రమలనినా ఆయనకు లెక్కలేదు. ఆయన విశ్వాసమునకు ధైర్యము, సహింపు శక్తి, శ్రమలనినా లెక్కలేని తనము గలదు. అట్టి విశ్వాసమున్న మానవుడు కూడ ఎట్టి శ్రమలు, శోధనలున్నను లెక్కలేనట్టే యుండును. అగ్నిగుండము మధ్యను నీళ్ళు పోయవలెను. అలాగే కష్టముల మధ్యనే జయము రావలెను. విశ్వాసికి ఎన్ని జయములు కావలెనో అన్ని కష్టములు వచ్చును. అప్పుడు మనము భూమి మీద జయము, పరలోకములో జయము అనవలెను. ఇచ్చట మనము ‘జయము ‘ అనిన యెడల పరలోకములోని వారుకూడ అక్కడ ‘జయము ‘ అని అందురు.

మనము ‘జయము కీర్తన ‘ యొక్క చరణము పాడిన పరలోకములోని వారు పల్లవి పాడుదురు శ్రమలకు ఎదురెక్కి ‘జయము ‘ అని అనగల దీవెనలు మీకు కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:
మట్టలాదివారము 2
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply