క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. శ్రమకాల ధ్యానములు
  5. సిలువ ధ్యానములు 1వ ప్రసంగము

సిలువ ధ్యానములు 1వ ప్రసంగము

ప్రార్ధన:- యేసుప్రభువా! ఈ శ్రమ కాల ధ్యానములో మా హృదయములను జ్ఞానమును, మనస్సును నీ సిలువ తట్టు త్రిప్పుచుండుము. నీ సిలువనుండి విశ్వాసులయొక్క హృదయములలోనికి సూర్యకిరణములవలె విషయములను ప్రసరింపజేయుము. ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యునితట్టు తిరుగునట్లు హృదయములను నీ సిలువ తట్టు త్రిప్పుము. ఇక్కడ ఉన్న మేము కొన్ని నిమిషములు లోకములోనున్న పనులవైపు చూడక, గలిలయ స్త్రీలు నీ సిలువవైపు చూచిన విధముగా, మేమును చూచునట్లు మమ్మును నడిపించుము. ఇప్పుడు నీ వాక్యవర్తమానమును మాలో ప్రతివాడు ఎవరిమట్టుకు వారే అన్వయించుకొను దీనమనస్సు అనుగ్రహింపుము. ఆమెన్.

హెబ్రీ 6: 4-6. బైబిలులో నున్న వాక్యములలో ఇది ఒక కఠోరమైన వాక్యము. మారుమనస్సు లేనివారును, మారుమనస్సు కోరని వారును, తప్పుదిద్దుకొనగోరని వారును, ఎంత గద్దించినా వినని వారును, ఎన్ని కష్టములు వచ్చినా మారని వారును ఈ వాక్యము దగ్గరకు వచ్చేసరికి కండ్లు మూసుకొంటారు. ఈ వాక్యము చదువుటకు వారికి ఇష్టముండదు. యేసుప్రుభువును సిలువ వేసిన తర్వాత ఆయన శరీరమునకు శ్రమ, మనస్సునకు వేదన, ఆయాసముకలుగుటయేగాక బాహాటముగా ఆయనకు అవమానము కూడకలిగినది. 2వేల సంవత్సరముల క్రితము యెరూషలేము బైట యూదులాయనను సిలువ వేసినప్పుడు ప్రభువునకు సిలువ వేసేవారు క్రైస్తవులలో నున్నారు. అట్టివారిని గూర్చి ఈ వాక్యము వ్రాయబడియున్నది. యెరూషలేము బయట కర్ర సిలువ మీద ఆయన ఇప్పుడు లేడుగాని, మరొక సిలువ మీద ఆయన ఉన్నాడు.” మరల సిలువ వేయుచున్నారు” అనగా 2వేల సంవత్సరముల క్రిందట వేయబడిన సిలువకాదు. ఇది ఆత్మ నేత్రాలకుకనబడే సిలువ. ఈ సిలువ ఆయనను ఎరిగినవారు వేయుచున్న సిలువ. అప్పటివారు ఆయనను ఎరుగక సిలువవేసిరని పౌలు వ్రాసెను. ఆ మహిమ వారుఎరిగియుంటే, ఆయనను సిలువ వేసియుండరని పౌలు వ్రాసెను. (1కొరింథి 2:8) ఆ మాటలువ్రాసిన పౌలు ఈ మాటలు కూడ వ్రాసెను. గనుక కర్రసిలువ వేరు, తప్పిపోయినవారు వేసే సిలువ వేరు. వీరేప్రభువును మరల సిలువవేసి బాహాటముగా అవమానపరచు చున్నారు. ఆయనను ఎరిగినవారు, తప్పిపోయినవారు వేసే సిలువ రెండవ సిలువ. వీరే ఆయనకు బాహాటముగా అవమానము కలుగుటకు కారకులు.

(1) మనము తప్పిపోయినప్పుడు ఆయన సిలువవేయబడుట మనము చూస్తున్నాము. వీరొక గుంపు. వీరు అంతరంగ సిలువపైనున్న ప్రభువును చూచేవారు, గనుక ప్రభువునకు మన ఎదుట బాహాటముగా అవమానము. తప్పిపోయిన మన ఎదుటే ఆయన సిలువ ఉన్నది. గనుక వీరు ఒక గుంపు.

(2) తప్పిపోయినవారిని ఇతరులు చూచు చున్నారు. గనుక వారి ఎదుట ప్రభువునకు బాహాటముగా అవమానము కలుగుచున్నది. ఇది రెండవ గుంపు.

(3) మనము సిలువ వేయుచున్నప్పుడు దేవద్దుతల గుంపు కూడ చూస్తున్నారు. వారికంతా బహిరంగమే గనుక వారొక గుంపు లూకా 15వ అధ్యాయములో ఒకరు మారుమనస్సు పొందినయెడల దేవదూతలు చూచి పరలోకములో సంతోషిస్తారు. అని వ్రాయబడియున్నది. ఆలాగే పాపములో గనుక పడినప్పుడు వారు విచార పడుదురు. గనుక దూతల యెదుట ప్రభువునకు బాహాటముగ అవమానము.

(4) ఈ మనిషి తప్పిపోయినప్పుడు క్రీస్తుకు బాహాటముగ అవమానము కలిగినది క్రైస్తవులకు తెలుసు. గనుక ఇది నాలుగవ గుంపు. వీరియెదుట ప్రభువునకు బహాటముగ అవమానము కలిగినది.

(5) అన్యులైనవారు తప్పిపోయిన ఇతనిని చూచి, ఇంతకాలము ప్రభువుయొక్క భక్తిలో ఉండి ఎందుకు పడిపోయినావని అంటారు. అప్పుడు ప్రభువునకు అన్యుల ఎదుట బాహాటముగ అవమానము కలిగినది. పడిపోయిన విశ్వాసి తన ఎదుట ప్రభువును సిలువ వేసి అవమానపరచుట, మరియు రహస్యముగా తాను చేసిన పాపము అందరికి తెలిసినప్పుడు అందరి యెదుట ప్రభువునకు అవమానము.

(6) పరలోకమునకు వెళ్ళిన భక్తులున్నారు. ఈ మనిషి పాపము చేయుట వారికి తెలియును. ఎందుకనగా వారు దూతలవలె ఆత్మలు గనుక తెలియును. వారియెదుట ప్రభువునకు బాహాటముగ అవమానము కలుగుచున్నది. గనుక ఈ ఆరు గుంపుల ఎదుట ప్రభువునకు బాహాటముగ అవమానము. ఆరు విధములుగా ప్రభువునకు అవమానము. ఈ ఆరుగురి ఎదుట ప్రభువునకు బాహాటముగ అవమానము. దీనివలన మనము నేర్చుకొను పాఠము మనలో ఎవరైతే తెలిసిన తరువాత కూడ పాపము చేస్తారో, రహస్యముగానైనను, బహిరంగముగానైనను తప్పు చేసినవారు ఇట్లు ప్రభువును బాహాటముగ అవమానపరచుచున్నారు. ఇట్లు తప్పిపోవువారు ఒక్కరే కాదు, అనేకులున్నారు. వారందరు ఒక గుంపు. మనలో ఎవరైనా ఆ గుంపులో నున్నయెడల ఆ గుంపు నుండి తప్పించుకొనవలెను. ఆ గుంపు నుండి తప్పుకొను వాక్యము బోధకులు వారికందించవలెను.

యేసుప్రభువు సిలువమీద నున్నప్పుడు రాణువవారు బల్లెముతో ఆయనను ప్రక్కలో పొడువగా ఆ పోటు ప్రభువునకు తగిలినది. ఇప్పుడు తప్పిపోయినవారు పాపము చేసినప్పుడెల్ల ఆయనకు బల్లెపు పోటు, అయితే ఆయన పరలోక సిం హాసనమందు మహిమ శరీరముతో నున్నాడు గదా! ఆయనకు ఈ పోట్లు ఎట్లు తగులును? సిలువపై పోటు తెలిసిన ప్రభువునకు, ఇప్పుడు పొడుచుచున్న ఈ పోటు తెలియదా? జ్ఞానముగలవారికి ఎక్కువ దుఃఖము. యేసుప్రభువునకు మనము చేయు పొరపాట్లు బాగా తెలియును. ఇతర మనుష్యులకు కొన్ని పాపములే తెలియును. ప్రభువునకు అన్నీ తెలియునుగాన ఎక్కువ అవమానము. ఎక్కువ పోటు. ఎక్కువ బాధ, ఈ ధ్యానకాలములో ప్రభువా ఏ పాపము వలన సిలువ వేయుచున్నానో అది నాకు తెలియజేయుము అని ప్రార్ధించి ఇట్లు తప్పిపోవువారు ఒక్కరే కాదు, అనేకులున్నారు. వారందరు ఒక గుంపు. మనలో ఎవరైనా ఆ గుంపులో నున్నయెడల ఆ గుంపు నుండి తప్పించుకొనవలెను. ఆ గుంపు నుండి తప్పుకొను వాక్యము బోధకులు వారికందించవలెను. యేసుప్రభువు సిలువమీద నున్నప్పుడు రాణువవారు బల్లెముతో ఆయనను ప్రక్కలో పొడువగా ఆ పోటు ప్రభువునకు తగిలినది. ఇప్పుడు తప్పిపోయినవారు పాపము చేసినప్పుడెల్ల ఆయనకు బల్లెపు పోటు, అయితే ఆయన పరలోక సిం హాసనమందు మహిమ శరీరముతో నున్నాడు గదా! ఆయనకు ఈ పోట్లు ఎట్లు తగులును? సిలువపై పోటు తెలిసిన ప్రభువునకు, ఇప్పుడు పొడుచుచున్న ఈ పోటు తెలియదా? జ్ఞానముగలవారికి ఎక్కువ దుఃఖము. యేసుప్రభువునకు మనము చేయు పొరపాట్లు బాగా తెలియును. ఇతర మనుష్యులకు కొన్ని పాపములే తెలియును. ప్రభువునకు అన్నీ తెలియునుగాన ఎక్కువ అవమానము. ఎక్కువ పోటు. ఎక్కువ బాధ, ఈ ధ్యానకాలములో ప్రభువా ఏ పాపము వలన సిలువ వేయుచున్నానో అది నాకు తెలియజేయుము అని ప్రార్ధించి పశ్చాత్తాప పడి మానివేయవలెను. పరలోకములోనున్న ప్రభువునకు నీ వలన సిలువ అని పౌలు వాక్యము వలన మనకు తెలియుచున్నది. గనుక ఈ 40 దినములు క్షమించు ప్రభువా! అని ప్రాధించి తప్పుకొనవలెను. నాలో, నా నైజములో గతకాలములో, ఈ దినము వరకు ఉన్న పాపాలను తలంచి ప్రభువా తీసివేయుము, క్షమించుమని ప్రార్ధించవలెను పాపముంటేనే పాపాలుండకపోతే అది వేరే కథ. దేవదాసు అయ్యగారి అనుభవములోని సంగతి: మిషనువారు ఆయనకు పని అప్పగించినారు. తెల్సినంతవరకు నమ్మకముగానే చేస్తున్నారు. గాని ప్రభువు “నీవు ఈ పని ఆరంభించినప్పుడు నాడొక్కలో నొప్పి పట్టుకొన్నది” అని చెప్పిరి. అయ్యగారు ప్రభువుతో ప్రభువా! నీవు అప్పుడే అయ్యగారి ఆత్మలో చెరుకుగానుగ తిరిగినట్లుగానుండి, చాల విచారముతో ఆలోచించినారు. మిషనుయందలి అభిమానము బట్టి మంచిపని మానివేయడమేమిటి అని అనుకొందురు. తరువాత కొంతకాలమునకు కాపవరములో పశువుల కాపరులు పరిశుద్ధాత్మను పొందిరి. డా|| మార్టిను లూథరువచ్చి, 20 సంవత్సరముల క్రితమే బైబిలు మిషను పెట్టమంటే వినలేదు అని చెప్పిరి. ఎందుకనగా అయ్యగారికి లూథరన్ మిషనుమీద నిండా అభిమానము గనుక వినలేదు. అందుకే హెబ్రీ 6:4-6 వాక్యము సరిపోయింది. ప్రభువుమాట విననందున, గ్రహించనందున దేవదూతల ఎదుట, భక్తుల ఎదుట ప్రభువునకు సిలువ, తర్వాత నోరు నెత్తి బాదుకుంటే ఏమిలాభము! దిద్దుకుంటే దిద్దుకొనవచ్చునుగాని పోయిన 20 సంవత్సరములు మరల రావుగదా! కాలము వృధా అయినది. అప్పుడే ఒప్పుకుంటే ప్రభువుఏ గొప్పపని చేయించునో! చేసింది పొరపాటు, తగిలింది ఆయనకు బల్లెపుపోటు, అది ఎల్లప్పుడు ఉండేలోటే. ఒక నాటు మనిషితో వచ్చింది ఒక చేటు. సాతాననే సర్పము మనిషికి వేసిన ఒక కాటు. మీకు ఈ కాలములో ధ్యానము కుదరకపోతే మీ హృదయములో ఏదో ఒకపొరపాటు ఉన్నదని గ్రహించి, దానిని విడిచిపెట్టండి. నేను ఇక్కడకు రాకముందు గదిలో ధ్యానముచేసే వాలు కుదిరినది. అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి రాగా, ధోరణిగా ప్రార్ధన వచ్చి ఈ వర్తమానము అందినది. ఇది మీ ఆదరణ కొరకు మాత్రమే. బాగా సిలువ ధ్యానము చేయండి. మరల ప్రభువును సిలువ వేయవద్దు.

Please follow and like us:
సిలువ ధ్యానములు 1వ ప్రసంగము
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply