క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. బైబిలు పండుగ
  5. బైబిలు పండుగ – II

బైబిలు పండుగ – II

ఈ బైబిలు పండుగను మతోద్ధారణ పండుగ లేక దిద్దుబాటు పండుగ అనికూడా అందురు. దిద్దుబాటు నాయకుడైన మార్టిన్ లూథర్ ను ఆ పనికై సిద్ధపరచిన దేవుని స్తుతించుటకు, ఈ పండుగను అక్టోబరు 31వ తేదీన ఆచరింపవలెను. మొదట దేవుడు, తన హృదయమును దిద్దుకొనునట్లు లూథర్ ను తయారు చేసెను. తరువాత లూథర్ నకు ఒక పనిని అప్పగించెను. అది ఏమనగా, సంఘమును దిద్దుబాటు చేయు పని. “నిన్ను దిద్దుకొన్న రీతిగా నా సంఘమును కూడ సరిచేయుము. నేను నీకు సహాయము చేసెదను” అని దేవుడు చెప్పినట్లుగా లూథర్ చేసెను. లూథర్ ను దేవుడు, ఆ పని నిమిత్తము బయటికి లాగినాడు. ఆ పని లూథర్ నకు కష్టమైన పని. ఎందుకనగా సంఘము, సంఘమే ఆయన మీద పడును. సంఘములోనుండి ఎందుకు బయటికి పోదువని అందరూ నిందింతురు. దేవుడు ఈ పని చేయమన్నాడని లూథర్ చెప్పిన యెడల ఎవరు నమ్ముదురు? అయితే దిద్దుబాటు పనిని ప్రారంభింపక ముందు దేవుడే, బైబిలు గ్రంధమును లూథర్ చేతిలో పెట్టి, ముందు ఇది చదివి దిద్దుబాటు పనిని ప్రారంభించుము అన్నట్లు, ఆ తరువాత దేవుడే అన్నియు జరిగించుచూ వచ్చెను.

దేవుడే తన చేతిలో పెట్టిన వాక్యమును లూథర్ తర్జుమా చేసి అచ్చు ఆఫీసులో పెట్టెను. ఆ తరువాత ఆ గ్రంధమును అచ్చువేసి, సంఘస్థుల యొక్క చేతులలో నుంచుట జరిగినది. అంతటితో లూథర్ యొక్క పని ముగిసెను. అప్పటినుండి నేటివరకు, అచ్చు ఆఫీసులలో నుండి బైబిళ్ళు బైట పడుచునే యున్నవి. ఇప్పుడు బైబిలు సొసైటీ వారు సుమారు 2000 భాషలకంటే ఎక్కువ భాషలలో బైబిలును అచ్చువేయుచున్నారు. ఆ పని ఇంకా ముగింపు కాలేదు. క్రొత్తవారు పుట్టేకొలది క్రొత్త భాషలలోనికి తర్జుమా చేయుచునే యున్నారు. నేటివరకు బైబిళ్ళు అచ్చు వేసేవారికి తీరుబడి లేనేలేదు. లూథర్ ఎంత మంచి పని చేసినాడు! అయితే లూథర్ తో పనిచేయించిన దైవాత్మ యొక్క మరియొక క్రొత్త పనిని గూర్చి వినండి. మనము ప్రార్ధన చేయునప్పుడు మనము దేవునితో మాట్లాడుచున్నాము. అది తృప్తిగా లేదు. దేవుడు కూడ మనతో మాట్లాడవలెను. ఆ ధన్యత మనకున్న యెడల చాలా మేలు. మనము దేవునితో మాట్లాడుట బాగా అలవాటైనది, గాని దేవుడు మనతో మాట్లాడుట అలవాటు కాలేదు. లూథర్ దేవునితో మాట్లాడుట కంటే దేవుడే లూథర్ తో మాట్లాడుట అనేది క్రొత్త సంగతి. దేవుడు మనిషితో మాట్లాడుట లూథర్ తోనే ఆరంభమాయెను.

పాత నిబంధన, క్రొత్త నిబంధన కాలములలో దేవుడు నరులతో మాట్లాడెను. తరువాత 1500 సంవత్సరములు గతించెను. అప్పుడు లూథర్ వచ్చెను. ఆయన కొరకు దేవుడు కనిపెట్టెను. నేను మాట్లాడితే, వినే మనిషి వచ్చినాడని దేవుడు సందుచేసుకొని లూథర్ తో మాట్లాడెను. అదివరకు దేవుడు ఏ భాషతో మాట్లాడెను? పరలోక భాషతోనే దేవుడు ఆయనతో మాట్లాడెను. (పరలోకభాష లూథర్ నకు తెలుసును.) ఈ సంగతి సవరన్ అను దొరు పుస్తకములో వ్రాసిరి. ఇంకా చాలా సంగతులు లూథర్ గురించి ఆయన వ్రాసెను. దేవుడు మాట్లాడిన ధైర్యమును బట్టియే, లెక్కకు మించిన శత్రువులున్నను ఎవరికిని లూథర్ జంకలేదు. దయ్యములకు ఆయన జడియలేదు. మనుష్యులు ఆయనను వెలివేసినారు. అయినను లెక్కచేయలేదు. సంఘము ఆయనను వెలివేసినారు. అయినను లెక్కచేయలేదు. సంఘము ఆయనను వెలివేసెను, కాని దేవుడాయనను సంఘము లోపల చేర్చెను. గనుక దేవుడు ఆయనను వెలివేయలేదు. గాని వీటన్నిటిని జయించుటకు దేవుడాయనతో మాట్లాడెను. గనుక ఈ దినమున ప్రభువును మనము స్తుతించవలెను. లూథర్ జన్మింపక పోయిన యెడల బైబిలు మన చేతికి రాదు. ఇప్పుడు గ్రంధము ఎక్కడబడితే అక్కడ ఉన్నది. శత్రువుల చేతిలో నున్నది. దానిని అర్ధము చేసికొనలేని వారి చేతిలో కూడా అది ఉన్నది. నమ్మనివారి చేతిలో కూడ ఉన్నది. ప్రభువు యొక్క రెండవ రాకడ సమిపమని సంఘము తెలిసికొని, ఎక్కువగా బైబిళ్ళు అచ్చువేసి కోటాను కోట్లు, ఓడలలో అన్ని దేశములకు పంపుచున్నారు. లూథర్ చేసిన పనికంటే గొప్ప పని నేడు చేయుచున్నారు. బైబిలు సొసైటీకి దేవుడు కోట్ల రూపాయల నిచ్చినాడు. లూథర్ కు అంత సొమ్ము ఇవ్వలేదు. ఆయన పేదవాడు. పేద కుటుంబము నుండి వచ్చినవాడు. అప్పుడు లూథర్ ను. ఇప్పుడు బైబిలు సొసైటీని దేవుడు తయారు చేసినాడు. ఎందుకనగా లోకమునకు ఈ గ్రంధమును అందజేయుటకు, దేవుడే నాటి నుండి నేటి వరకు ప్రయాసపడుచుండెను.

బైబిలులో చాల తప్పులున్నవి అవి చెప్పువారున్నారు. తప్పులున్న యెడల దేవుడెందుకు ఇంతగా వ్యాపింప చేయును? చదువువారు, అర్ధము కాక తప్పులున్నవని అనుచున్నారు. లూథర్ దేవునితో మాట్లాడినట్లు, మనమును దేవుని మాటలు విని, గ్రహించి, ఈ గ్రంధమును గురించి అందరికిని తెలియజేయవలెను. లూథర్ ను గూర్చి లూథర్ మిషను వారికి ఎక్కువ అతిశయము. తక్కిన మిషనులవారు కూడ బైబిలును బోధించుచున్నారు. బైబిలును నమ్ముచున్నారు, ఆ ప్రకారము నడిచేటట్లు ప్రయత్నము చేయుచున్నారు. ఇదంతయు మంచిదే. అయితే లూథర్ వలె దేవుని మాటలు వినగలిగిన యెడల గొప్పపని జరుగును.

దైవ గ్రంధమును లోకమునకు బైలుపరచిన తండ్రికి స్తోత్రము!

కీర్తన:

బైలు పరచినావు – నీ బైబిలు గ్రంధంబు = బైలుపరచినందున – ప్రభువా వందనంబు ||

1 . బైలు పరచినావు – ఒక వ్యక్తికే మొదట = బైలు పరచినావు – ఆ కాల సభకు పిమ్మట ||

2. బైలు పరచినావు – ప్రపంచ దేశములకు = బైలు పరచినావు – రెండువేల భాషలకు =

3. బైలు పరచినావు – నీ వాసులమౌ మాకు = బైలు పరచినావు – రెండు వేల కాల జనులకు ||

Please follow and like us:
బైబిలు పండుగ – II
Was this article helpful to you? Yes 4 No

How can we help?

Leave a Reply