క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. బైబిలు పండుగ
  5. బైబిలు పండుగ – I

బైబిలు పండుగ – I

అక్టోబర్ 31వ తేదీన మతోద్ధారణ లేక దిద్దుబాటు పండుగ చేయుదురు. రోమా 3వ అధ్యాములో విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుటను గురించి వ్రాయబడినది. దిద్దుబాటు నాయకుడగు డా|| మార్టిన్ లూథర్ ఈ సిద్ధాంతమునే,. వాక్యము నుండి ఎత్తి చూపించెను. ఆ కాలమందు సంఘములో అనేక పొరపాట్లు గలవు. లూథర్ గారు వాటిని సరిచేసెను గనుక దీనినే దిద్దుబాటు పండుగ అనిరి. కాబట్టి బైబిలును చూచి నేటి సంఘములోని అనేక పొరపాట్లు దిద్దుకొనవలెను. సంఘములో లేనివి బైబిలులో నున్న యెడల వాటిని సంఘములో చేర్చవలెను. సంఘములో ఉన్నవి బైబిలులో లేకపోయిన యెడల వాటిని తీసిపారవేయవలెను. ఈ పనికి లూథర్ 400 సంవత్సరముల క్రితము పూనుకొనెను. బైబిలులో లేనివి ఆ కాలపు సంఘములో చాల గలవు గనుక ఆయన అట్టి వాటిని చెరిపివేయుటకు పూనుకొనెను. ఇట్టి పని చేయుటకు ముందుగా బైబిలును బాగా చదువవలెను. లూథర్ గారు ఈ పని చేయపూనుకొనినప్పుడు అందరు ఆయనకు ఎదురు తిరిగిరి. అప్పుడు సంఘములో అల్లరి బయలుదేరెను. సంఘము దేశములో నున్నది గనుక దేశములో కూడ అల్లరి బయలుదేరెను. దేశములో కూడ ఆ కాలమందు అల్లరి రేగెను. ఎవరో ఒక బైరాగి, సంఘమును బైబిలు ప్రకారము సరిదిద్దు చున్నాడట అని అనేకులు చెప్పుకొనిరి. లూథర్ బైబిలులో లేని వాటన్నిటిని ఖండించెను. వాక్యమును బోధించెను. ఆయనయొక్క స్నేహితులు వద్దని చెప్పిన వినలేదు.

ఆ కాలమందు బైబిలు గ్రీకు భాషలో గలదు. ఒకరోజు మార్టిన్ లూథర్ గారు పుస్తకశాలలోనికి వెళ్ళి, చదువుటకు పుస్తకములు వెదుకుచుండగా బైబిలు దొరికెను. ఏదో పుస్తకము అని తీసెను గాని అది బైబిలు, ఆయనకు గ్రీకు, హెబ్రీ భాషలు తెలియును. బైబిలు చదువగా సంఘములో నున్న కట్టడలు బైబిలునకు వేరుగా నుండెను. ఇవన్నియు బైబిలులో లేవు అని గ్రహించెను. ప్రభువా! నాకు ఒక బైబిలు దయచేయుము అని ప్రార్ధించి, బైబిలును చదివి బోధించుట ప్రారంబించెను. 1. లూథర్ గారికి దొరికింది బైబిలు, 2. ప్రభువును అడిగింది బైబిలు,3. డా|| మార్టిన్ లూథర్ బోధది బైబిలు; ఈ పనులు జరుగుచున్నవి గనుక సంఘములోను, దేశములోను గొప్ప తుఫాను చెలరేగెను. మతాధికారులకు ఇదంతా చాల గందరళముగా నున్నది గనుక ఫలాని పట్టణమునకు వచ్చి తన బోధలు చెప్పవలసినదని లూథర్ నడిగిరి. “దేవుని యొక్క ద్రాక్ష తోటను బుడ్డగించుటకు (పాడుచేయుటకు) ఒక పంది వచ్చినదని” వారు లూథర్ ను దూషించిరి. తన స్నేహితులు అ క్కడకు వెళ్ళవద్దని చెప్పినను, అక్కడకు వెళ్ళి మతాధికారులకు బైబిలును బోధించెను. ముందు వాక్యమును సంఘమునకు బోధించెను. తరువాత అచ్చటనున్న మతాధికారులకు కూడ బోధించెను.

ఆ తరువాత బైబిలు అందరికి తెలియవలెనని తన స్వంత భాషయైన జర్మనీ భాషలోనికి తర్జుమా చేసెను. ఆ సమయముననే అచ్చుయంత్రము కూడ కనుగొనబడెను. గనుక 1. దొరికింది బైబిలు, 2. కోరింది బైబిలు. 3. చదివింది బైబిలు, 4. బోధించింది బైబిలు, 5. మార్చింది బైబిలు, 6. అచ్చువేసినది బైబిలు. ఈ ఆరు పర్యాయములు లూథరు,’బైబిలు ‘ అను మాటను ఎత్తి చూపించెను. తరువాత చాలమంది బైబిలు విషయములు తెలిసికొనిరి. 14దినములలో, ఐరోపా ఖండమంతా దిద్దుబాటు సంగతి వ్యాపించెను. బైరాగి అట, బైబిలు తీసినాడట, తర్జుమా చేసినాడట, బైబిలు అందరికి దొరికినదట అని చెప్పుకొనిరి. ఆయన బోధ విన్నవారిలో -సంఘస్థులు కొందరు, మతాధికారులు కొందరు, గవర్నమెంటు అధికారులు కొందరు ఆయన పక్షమున చేరిరి. వీరందరును ‘లూథరన్ లు ‘ అను పేరు పెట్టుకొనిరి. ఆయన నా పేరు పెట్టుకొనవద్దని చెప్పి ఏడ్చెను. తరువాత ఆయన గుండెనొప్పి వలన 60 సంవత్సరముల వయస్సప్పుడు చనిపోయెను. ఆయనను అనుసరించినవారు ఆయన చనిపోవు వరకు ఊరుకొని, మరల ఆయన పేరు పెట్టుకొనిరి. ఆయన పేరు పెట్టుకొనుటలో తప్పేమిటి? అని ఆ పేరు పెట్టుకొనిరి. గనుక ఆ విధముగా 400 సంవత్సరముల క్రితము లూథరన్ మిషను ఏర్పాటయినదని వారే చెప్పుచున్నారు.

తరువాత లూథరన్ మిషనులో నుండి ఒకరిని పిలిచి బైబిలు మిషనును చూపించెను. దేవదాసు అయ్యగారికి పగలు 4గంటలకు ప్రభువు గాలిలో వ్రాసి చూపించెను. ఇది బహిరంగ దర్శనము, కోరిక కాదు, తలంపు కూడా కాదు. దేవుడు లూథర్ గారికి బైబిలును చూపించినట్లుగానే, ఇప్పుడు బైబిలు మిషనును ముంగమూరి దేవదాసు అయ్యగారికి చూపించిరి. ఆ బైబిలు పేరు మీద ఇప్పుడు సంఘము నడుచుచున్నది. ప్రభువే ఈ పేరును చూపించియున్నారు. దేవుడు లూథర్ గారికి బైబిలును చూపిన రీతిగా, ఇప్పుడు దేవుడు బైబిలు మిషనును చూపించుట జరిగినది. ఆ కాలములో లూథర్ గారికి కన్న గొప్పవారు అనేకులున్నారు గాని ఆ గొప్పవారికి చూపించకుండ లూథర్ గారికి మాత్రమే బైబిలును చూపించెను, అలాగే ఈ కాలములో అనేకులు గొప్పవారు కలరు గాని బైబిలు మిషనును యం. దేవదాసు అయ్యగారికి మాత్రమే చూపించెను. ఆ మిషను నుండి యువరాజువలె రమ్మని ప్రభువు చూపించెను. సముద్రములోనికి దిగినట్లుగా కనబడెను. ప్రతి రోజు దేవదాసు అయ్యగారిలో పోరాటము జరిగెను. అప్పుడు ఆరాటముతో పోరాడెను. లూథర్ పేరు మీద నున్నది లూథర్ మిషను, లూథర్ బైటకు తీసిన బైబిలు పేరు మీద నున్నది బైబిలు మిషను. ఇతర మిషనులకున్న బలహీనతలు వీరికిని గలవు. వారికన్న వీరు ఎందులో ఎక్కువగా, దేవుడు చెప్పిన సంఘములో వీరున్నారు. బైబిలు మిషను వారు ఈ దినమున- ‘దేవుడు లూథర్ గారి ద్వారా బయటకు తీసినది బైబిలు గనుక బైబిలు పండుగను చేయుచూ ప్రభువును స్తుతించుచున్నారు.

Please follow and like us:
బైబిలు పండుగ – I
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply