క్రైస్తవ పండుగలు

 1. Home
 2. Docs
 3. క్రైస్తవ పండుగలు
 4. బైబిలు పండుగ
 5. బైబిలు పండుగ స్తుతులు

బైబిలు పండుగ స్తుతులు

 1. దేవా! నీ వాక్యము లోకము యొక్క నేత్రములకు కనబడేటట్టు, దానిని వ్రాతలో పెట్టించినావు. కాబట్టి నీకు స్తోత్రములు.
 2. ఓ తండ్రీ! లోకమునకు నీ స్వరము వినబడదు గనుక నీ వాక్యము కనబడేటట్లు అచ్చు వేయించినావు గనుక నీకు వందనములు.
 3. నేటికి నీ గ్రంధము సుమారు 2000 భాషలలోనికి తర్జుమా చేయబడినందువల్ల ఇప్పుడది లోకము యొక్క హస్తభూషణము అయినది. అందుచేత నీ కనేక వందనములు.
 4. నీ వాక్య గ్రంధము అందరు చదివినా, చదవకపోయినా, చూచి ప్రక్కన పెట్టి వెళ్ళిపోయినా; సాక్ష్యార్ధముగా లోకము యెదుట ఉన్నది. గనుక నీకు వందనములు.
 5. ఓ దేవా! నీవు హెబ్రీ భాషలో పలికిన పలుకులు మా కాలములో 2000 పలుకుగా వినబడుచున్నవి. గనుక నీకు స్తోత్రములు.
 6. ఓ తండ్రీ! 2000 భాషల వారు ఒక చోట కూడుకొని, అందరు యోహాను 3:16 చదివితే, ఒకరి మాట ఒకరికి అర్ధము కాకపోయినను, అందరికి అర్ధము తెలుసు గనుక అందరు నిన్ను స్తుతిస్తారు. ఇన్ని భాషలలో నీకు స్తుతి వస్తుంది. కాబట్టి నీకు వందనములు.
 7. లూథర్ బయటికి తీసిన ఒక్క బైబిలును అన్ని భాషలోనికి మార్చేటందుకు బైబిలు సొసైటీ వారిని లేపినందుకై నీ కనేక స్తోత్రములు.
 8. ఓ తండ్రీ! అక్షరాలు లేని భాషలలో కూడ, నీ గ్రంధములోని సంగతులు నీ సేవకులు బోధిస్తున్నారు. గనుక నీ కనేక స్తోత్రములు.
 9. ఓ ప్రభువా! అనేక మంది భక్తులను లేపి, నీ గ్రంధము యొక్క అర్ధాలు వ్రాయించినావు. కాబట్టి నీకు స్తోత్రములు. ఆ అర్ధాలు గల వ్యాఖ్యానములు చదివి, నీ సేవకులు సంఘాలకు బోధిస్తున్నారు. గనుక నీకు స్తోత్రములు.
 10. ఓ తండ్రీ! నీ గ్రంధము అచ్చువేయించుటకు చాల ధనము అవసరము. బైబిలు సొసైటీ వారు నీ గ్రంధమునకు సరియైన ఖరీదేర్పర్చితే అందరు కొనలేరు. అందరికి అందుబాటులో ఉండేటట్లు తక్కువ ఖరీదు పెట్టించినావు గనుక నీ కనికరము నిమిత్తమై అనేక వందనములు.
 11. ఓ దయగల తండ్రీ! ఇన్ని యేళ్ళ నుండి నీ పుస్తకము అచ్చువేయుటకు బైబిలు సొసైటీ వారికి సామర్ధ్యము దయచేసినందుకు స్తోత్రములు. ఇంకా శక్తి ఇస్తావని నమ్ముచూ, ఆనందిస్తూ స్తుతిస్తున్నాము.
 12. ఓ దేవా! నీ వాక్య గ్రంధము లోకములోని గొప్ప గొప్ప పుస్తకశాలలో, ఒక ముఖ్యమైన పుస్తకమైనది. అందుచేత నీకు స్తోత్రములు.
 13. ఓ దయగల తండ్రీ! గ్రంధమును అనేక మంది తప్పులు పట్టవలయునని, ఖండింపవలయునని చదివినారు. అట్టివారు చదివి చదివి, మారుమనస్సు పొందినారు. కాబట్టి నీకు అనేక స్తోత్రములు.
 14. కొందరు బైబిలులో పండితులు కావలెననే కోరికి గలవారై నలగ చదివినారు. అట్లు చేయుటవల్ల బైబిలు వారినే నలగ గొట్టినది. గనుక నీకు స్తోత్రములు.
 15. ఓ దేవా! నీ వాక్యమును పురుషులు వెళ్ళలేని ఘోషా గృహములలోనికి కూడ పంపించినావు. గనుక నీ కనేక స్తోత్రములు.
Please follow and like us:
బైబిలు పండుగ స్తుతులు
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply