క్రైస్తవ పండుగలు

 1. Home
 2. Docs
 3. క్రైస్తవ పండుగలు
 4. నూతన సంవత్సరము
 5. నూతన సంవత్సరము

నూతన సంవత్సరము

(యెహోషువ1:1; మత్తయి 1:18; దా.కీ. 90; లూకా 2:21; లూకా 1:26; గలతి 1:6)

నూతన సంవత్సరానంద పరులైన విశ్వాసులారా! ఈ దినము లోకమంతా గొప్ప పండుగ ఆచరించు చున్నాము. గత సంవత్సరము గడిచిపోయినది, గనుక ఈ దినమందు మనము. ఆశీర్వచనములు, దీవెనలు వినవలెను.

సంఖ్య 6:22-26లో యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకయని ఉన్నది. సంఘమొక పంచాంగము తయారు చేసినది. పాతనిబంధన పాఠము, క్రొత్తనిబంధన పాఠము, పత్రికల పాఠము. ప్రత్యేకముగా క్రొత్త సంవత్సరమున చదువుటకు ఒక పాఠము ఏర్పాటు చేసినారు. సువార్త పాఠము (లూకా 2:21) చదువుకొందాము. అన్ని స్థలములలో ఈ వాక్యము కూడ చదివి ప్రసంగము చేయుదురు. చదవడము ఆ వాక్యము చదివి ఇంకొక వాక్యమెత్తి కూడా ప్రసంగము చేయవచ్చును. ఈ దిన ప్రసంగ వాక్య పదము లేక అంశము “యేసు.

సువార్తలలో యేసు అనుమాట 3 పర్యాయములు బయలుపడెను. 1). మొట్టమొదటి పర్యాయము నజరేతులో మరియమ్మ ఒంటరిగా నున్నప్పుడు నీకు పుట్టబోవు శిశువు పేరు “యేసు” అని దేవదూత, ఆమె గర్భము ధరించక పూర్వము చెప్పెను. అంతకు పూర్వము బైబిలులో ఆ పేరు బయలు పడలేదు. 2) రెండవదిగా నజరేతులో యోసేపున్నప్పుడు మీకు పుట్టబోవు శిశువు పేరు “యేసు” అని దేవదూత కలలో చెప్పెను. 3) 8వ దినము బిడ్డకు పేరు పెట్టవలెను. ఆ బిడ్డకు ఎనిమిదవ దినమున బెత్లెహేములో “యేసు” అని పేరు పెట్టిరి.

 1. మరియమ్మకు యేసు అను పేరు బైలుపడుట,

 2. యోసేపుకు యేసు అనుపేరు బైలుపడుట,

 3. ఇద్దరూ కలిసియున్నపుడు యేసు అను పేరు బైలుపడుట.

“యేసు” అనగా రక్షకుడు. ఈ పేరు అన్నిటికి సరిపోయినది. ఆయన తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును. గనుక ఆయనకు యేసు అనేపేరు పేరు పెట్టబడినది. (మత్తయి1:18). పాపముల వలన వ్యాధి, దుఃఖము, నరకము, ఇవి కూడా తీసివేయుటకై ఆయన వచ్చినాడని తెలియుచున్నది. ఈ నూతన సంవత్సరము మొదటి దినమునకైన యేసు అను పేరు పెట్టబడిన విశ్వాసులు, సంవత్సరము మొదటి రోజున యేసు పేరు పెట్టబడిన విశ్వాసులు, సంవత్సరము మొదటి రోజున యేసు అను పేరు చూచెదరు. గనుక ఈ 365 రోజులు యేసు అను శుభకరమైన పేరునే చూడవలయును. అప్పుడు అనగా క్రిస్మసునకు శిశువు స్మరణ, ఇప్పుడు యేసు నామస్మరణ చేయవలెను. ఈ పేరును బట్టి అపోస్తలులు సువార్త ప్రకటించిరి. యెహోషువ కివ్వబడిన వాగ్ధానము, ‘నీవడుగు పెట్టిన దేశమెల్ల నీదగును ‘. క్రొత్త దేశమునకు వెళ్ళగానే ఈ వాగ్ధానమివ్వబడినది. యెహోషువ అనగా రక్షకుడని అర్ధము. యేసు అను పేరు వినుట, క్రొత్త సంవత్సరమునకు శుభకరమైన సంగతి. మీ అందరికి ఈ దినమున యేసు అను పేరు ఇచ్చుచున్నాము. అందుకోండి.

 1. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక!
 2. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక!
 3. యెహోవా తన సన్నిధి కాంతి నీమీద ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక!

అట్లు వారు ఉచ్చరించుట వలన నేను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెదను.

1) బోధకులు పలుకుట అనగా మొషే అహరోనులు మాట్లాడుట

2) దేవుడు దీవించుట

3) సంఘము అందుకొనుట

ఈ మూడు సమయముగా నుండవలెను. సంఘము అందుకొని తీరవలెను. అందుకొనక పోతే దీవెన దొరకదు.

బోధకుడు దీవించగానే ప్రభువు నన్ను దీవించుచున్నాడని నమ్మవలెను. ఇశ్రాయేలీయులకు యెహోవా నామము ఇవ్వబడెను. మనకు యేసు నామము ఇవ్వబడెను.

మన ద్వారబంధములపైన యేసు అను పేరు వ్రాయబడినట్లు విశ్వాసనేత్రములతో చూడండి. యేసుప్రభువు మొదట ఏ విధంగా భూమిమీద జన్మించినాడు? శిశువుగా, అంతకుపూర్వము ఆయన దేవుడు. ఆ దేవుడే నర శిశువుగా మారిపోయినాడు. పరిశుద్ధమైన స్థితిలో ఉన్న వారికే దీవెనలు. హృదయశుద్ధి లేనివారికి కాదు. చేతులు శుద్ధిగా లేనపుడు కాదు కదా ఎవరికైనా మంచి ఫలహారములు, పరిశుద్ధుడైన దేవుడు శిశువుగా మారెను. ఆయన పరిశుద్ధుడుగానే ఉండి శిశువుగా మారెను. పరిశుద్ధ శిశువుగా మారెను, అట్లే పరిశుద్ధులైన మీరు మరియొక రకమైన పరిశుద్ధులుగా మారిపోవలెను. దేవుడు అక్కడే ఉంటే లాభము లేదు. నరరూపము వలననే ఇతరులకు ప్రయోజనము. గనుక తనను తాను కనబరచుకొనెను. అట్లే మన పరిశుద్ధత బైటికి కనపరచవలెను. మన మాటల వలన, క్రియలవలన, ఇతరులు మనలను చూడగానే తెలిసికొనవలెను. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధత ఆలాగు బైటికి కనపర్చవలెను. దేవుడు లోకములో జన్మించి, మానవులకు బైలుపడిన రీతిని, మనము పాపులముగా ఉండి పరిశుద్ధులుగా మారుట మాత్రము కాదు గానీ మారిన వారు ఇంకా అనేకులను మార్చవలెను.

 1. మీ పరిశుద్ధత ఇతరులకు కనబడవలెను. ఇప్పుడే మారిపోయిన మీ మార్పు ఈ సంవత్సరము అంతా ఇతరులకు కనబడునట్లు, క్రొత్త సంవత్సరము దీవెన మీకు కలుగునుగాక!
 2. నాలుగు సువార్తలలో క్రీస్తు అను పేరు లేదు. యేసు అను పేరు మాత్రం వ్రాయబడి యున్నది (కొర్టులో తప్ప). ఈ సంవత్సరము పొడుగునా యేసు అనే పేరుండవలెను. అట్టి దీవెన మీకు కలుగునుగాక!
 3. యేసుప్రభువు అరణ్యములో సాతానువల్ల శోధింపబడి జయము పొందిననాడు. గడ్డైన శోధనలో జయము పొందినాడు. ఆలాగుననే శోధనలన్నిటిలో జయము కలిగే దీవెన మీకందరకు కలుగునుగాక!
 4. యేసుప్రభువు శోధింపబడిన తరువాత బోధ పని ప్రారంభించినారు. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడినారు. ఆయన శాస్త్రులు, పరిసయ్యులువలె కాక అధికారముతో బోధించినాడు అని అందరు చెప్పుకొనిరి. మన బోధ వలన దేవునికి మహిమ కలుగవలెను. మీ బోధ ఇతరులకు ఆశ్చర్యముగానూ, సంతోషముగానూ ఉండవలెను. ఈ నూతన సంవత్సరమున మీ బోధలు ఇతరులకు ఆనందకరముగా యేసు ప్రభువు బోధవలె నుండునట్లు దేవుని దీవెన మీకు లభించునుగాక! ఆమెన్.
 5. ఎన్ని శ్రమలు, ఎంతమంది శత్రువులు, ఎన్ని నిందలు ఉన్ననూ ఆయన మారలేదు. మీకు నిందలు, జబ్బులు, అపాయములు, గండములు, చిక్కులు వచ్చిననూ ఆయన వలె మామూలుగానే ఉండవలెను. యేసువలె ఎన్ని చిక్కులు వచ్చిన స్థిరముగానే, నెమ్మదిగానే, సంతోషముగానే ఉండవలెను. యేసును కలిగి ఉండు దీవెన మీకు మెండుగా కలుగును గాక.
 6. పునరుత్థానము అనగా, శత్రువులు, నిందలు, సైతాను కురూపిగా చేసినా, ఆయన లొంగలేదు, పొగడినా ఆయన లొంగలేదు, చివరకు చంపినా గాని ఆయన లేచినాడు. అదే ఆయన పునరుత్థాన బలము, అట్లే క్రైస్తవులందరు పునరుత్థానబలము కలిగి యుండవలెను. ఆయన పునరుత్థాన బలము మనకొరకే. ఆయన పునరుత్థాన బలము వలన మరణమంత అపాయము వచ్చిననూ మీరు లేవవలెను. ఆలాగున శ్రమలలో కూడా మీకు యేసునివంటి పునరుత్థాన బలము కలుగునుగాక!
 7. యేసుప్రభువు తన పునరుత్థాన బలము చూపించి, అందుకు సాక్ష్యార్ధమై భూమిపై సంచరించి ఆరోహణమాయెను. యేసు ప్రభువుకైనా మరణమున్నది గాని విశ్వాసికి మరణము లేదు. రాకడ విశ్వాసులందరు మరణము లేకుండగనే ఎత్తబడుదురు. మీకందరకూ ఆరోహణ ఆశీర్వాదము. క్రొత్త సంవత్సరము రోజున కలుగునుగాక! అన్ని స్థితులలోను యేసు యేసు లాగానే ఉన్నాడు. రక్షకుడు రక్షకుడుగానే ఉన్నాడు. మీరందరుకూడ, పరిశుద్దులు పరిశుద్ధులుగానే, విశ్వాసులు విశ్వాసులుగానే ఉండు దీవెన కలుగును గాక.

ఈ ఏడు దీవెనలు మీకు కలుగునుగాక! (ఆదికాండం 49:22). యోసేపు దీవెన, ఇది పూర్వీకుల దీవెనకంటె గొప్పది. ఇప్పటి మన దీవెనలు యోసేపు దీవెన కంటే గొప్పవి.

అట్టి దీవెనలు మీలో ఈ నూతన సంవత్సరము అంతయు స్థిరపడునుగాక. ఆమెన్.

Please follow and like us:
నూతన సంవత్సరము
Was this article helpful to you? Yes 3 No

How can we help?

Leave a Reply