క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మస్ సంభాషణ

క్రిష్ట్మస్ సంభాషణ

1. ప్రశ్న : యేసుప్రభువునకు యెషయా 9:6లో ఏయే బిరుదులున్నవి?
జవాబు: శిశువు, కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుడు, తండ్రి, సమాధానాధిపతి.

2. ప్రశ్న: యెషయా ఏ సంవత్సరమున ఈ బిరుదులు చెప్పియుండును?
జవాబు: ప్రభువు పుట్టుటకు 740 యేండ్లకు ముందే ఆయన ప్రవచించెను.

3. ప్రశ్న: ఈ సంగతులు యెషయాకు ఏలాగు తెలిసినవి?
జవాబు: దైవాత్మ వలన తెలిసినవి.

4. ప్రశ్న: ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరినది?
జవాబు: ఇది క్రిష్ట్మస్ రోజున నెరవేరుట ప్రారంభమైనది గాని నిత్యమును నెరవేరుచునే యుండును.

5. ప్రశ్న: యేసుప్రభువుయొక్క మొదటి రాకడకు సంబంధించిన ఈ ప్రవచనములో రెండవరాకడ జ్ఞప్తి తెచ్చుకొనుటకు ఏమైన సూచన గలదా?
జవాబు: ఈ లోకములోనుండి మోక్షలోకమునకు ఆరోహణము కావలసిన సంఘమొకటి ఇప్పుడు సిద్ధమగుచున్నది. యేసుప్రభువు మేఘాసీనుడై వచ్చునప్పుడది మరణ మొదకుండనే వెళ్ళిపోవును. అప్పుడే సంఘమునకు పూర్ణమైన సమాధానము కలుగును.

6.ప్రశ్న: అంతకుముందు సమాధానముండదా?
జవాబు: అంతకు ముందుకూడా సమాధానము అనగా శాంతికలుగును గాని అప్పుడప్పుడు శాంతి అంతరించుచుండును. సమాధానాధిపతిఉండును గాని ఆయన ఇచ్చు సమాధానము సంఘస్థులు నిలుపుకొనలేని కారణమున అది కనబడకపోవును.

7. ప్రశ్న: రెండవ రాకడ సూచన యెక్కడ ఉన్నది?
జవాబు: రాజులకు రాజు అను బిరుదు ఉండనే ఉన్నది. సమాధానము అనుమాట దగ్గర రాజు అని లేదు గాని అధిపతియని యున్నది. గనుక యువరాజు అని అర్ధము చేసికొనుటకు వీలుకలదు.

8. ప్రశ్న : ఈ సూచన ఎక్కడ ఉన్నది?
జవాబు: పెండ్లికుమార్తె అను బిరుదుగల సంఘమును ప్రభువు తీసికొని వెళ్ళుటకు వచ్చునప్పుడు, ఆయన అధిపతి అనగా యువరాజు అని అనిపించు కొనును. పరలోకములో సంఘమునకు పెండ్లివిందు అయిన పిమ్మట, ఆయన భూలోకమునకు ఆ వధువు సంఘముతో వచ్చి, వెయ్యేండ్లు పరిపాలన చేయునప్పుడు, రాజు అను బిరుదు కలిగియుండును. గనుక సమాధానాధిపతి అను మాటలో రెండవ రాకడ సూచనయున్నది.

9. ప్రశ్న: దీనినిబట్టి చూడగా ఆయనకు యువరాజు, రాజు అను రెండు బిరుదులు కూడ ఉన్నవి గ్రహించుకొనవచ్చునా?
జవాబు: అవును, ఆయన యువరాజే, ఆయన రాజే. ఆయన రాజ్యభారము వహించిన రాజే. శాతి పరిపాలన చేయనైయున్న రాజే. ఆయన బహిరంగముగ భూమి మీద రాజైనప్పుడు, విశ్వాసులు అవిశ్వాసులు మహా సౌఖ్యమనుభవింతురు. అదే శాంతి పరిపాలన, అదే సమాధాన పరిపాలన, అదే వెయ్యేండ్ల పరిపాలన.

Please follow and like us:
క్రిష్ట్మస్ సంభాషణ
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply