క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మసు వర్తమానము

క్రిష్ట్మసు వర్తమానము

తండ్రి: యెషయా 9:6:కుమార:లూకా 2:1-14:పరిశుద్ధాత్మ:ఫిలిప్పి2:6,7:

నీవు సమస్త క్రియలను చేగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.’ యోబు 42:2.

యోబు మొదటగా దేవుని క్రియనుగూర్చి చెప్పెనుగాని ఉద్దేశ్యమునుగూర్చి చెప్పవలస్యున్నది. గాని అట్లు చెప్పలేదు.

దేవుడు లోక జనాంగములన్నిటిలోనుండి యూదా జనాంగమును వేరుచేసెను, వారిలో మొదటి వాడు నోవాహు. దేవుని ఉద్దేశ్యము ఎప్పుడు నెరవేరదు అని అపవాది పల్లవి పాడితే, అవిశ్వాసులు ఔను నెరవేరదు అని చరణములు ఎత్తుకొందురు. నేటివరకును అలాగుననేయున్నది. అంత్యతీర్పు వరకు అట్లే యుండును. లోకరక్షకుడు రావలసిన వరుసలో తండ్రిగా నిలుచున్న నోవాహు ద్రాక్షరసము త్రాగి పాపములో పడెను. ఈ స్థితి సాతానుకు లోకువ, ఆనందముగాని దేవుడు అతనిని ఆ స్థితినుండి లేవనెత్తెను. అతని నోటనుండి షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక! అను స్తుతి ప్రవచనము వచ్చెను.

రెండవ తండ్రి అయిన అబ్రహాము పొరబాటులోపడెను. తొందరపడి హాగరును తీసికొనెను. గాని ప్రభువు అతనితో హాగరును వెళ్ళగొట్టు అని చెప్పి అతనిని సరిదిద్దెను. అతని సంతానములోనుండి ఇస్సాకు వచ్చెను. ఈయనకు గొప్ప శోధన వచ్చెను. తండ్రి ముసలివాడు, కుమారుడు యౌవనుడు. అయినను తరువాత ఇస్సాకు పొరపాటులో పడెను. యాకోబును ఆశీర్వదించడానికి బదులు ఏశావును ఆశీర్వదించ ప్రయత్నించెను. యాకోబును ఆశీర్వాదించాలని గర్భములోనున్నప్పుడే తెలుసును. యాకోబు తన తండ్రిని ఏశావును మోసగించెను. యాకోబులో నుండి యూదా వచ్చి గొప్ప పొరపాటులోపడెను. గాని దేవుడతనిని దిద్ది సరిచేసెను.

“షిలోహు వచ్చువరకు యుదా యొద్దనుండి దండము తొలగదు-క్రీస్తువారు వచ్చిన తరువాత ఆ అధికారము సంఘమునకు అప్పగించెను.

అలాగే దావీదు గొప్ప పొరపాటులో పడెను, గాని తిరిగి లేచెను. అలాగే సొలొమోను కూడ పడి తిరిగి లేచెను. ఆ తరువాత మరియమ్మను విడిచిపెట్టాలి అనే గొప్ప శోధన యోసేపునకు వచ్చెను. మరియమ్మకుకూడ గొప్ప శోధన వచ్చెనుగాని దేవుని ఉద్దేశ్యము, క్రియ నెరవేరుట ఆగలేదు. “పిశాచి నన్ను ఏమిచేయుచున్నదో, ఇక ఏమిచేయనై ఉన్నదో అది నెరవేరదు గాని దేవుడు నన్ను గూర్చి ఏమి ఉద్దేశించినాడో అది నెరవేరును.

Please follow and like us:
క్రిష్ట్మసు వర్తమానము
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply