క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మసు వర్తమానము

క్రిష్ట్మసు వర్తమానము

వాక్యభాగము: (యెషయా 9:6; లూకా 2:1-2)

ప్రార్ధన:- ఓ తండ్రీ! నీ కుమారుని బహుమానముగా ఇచ్చియున్నావు నీకు వందనములు. ఆ బహుమానము లోకమంత పెద్దది కాదు. ఆకాశమంత పెద్దది కాదు. వీటన్నితిని మించినది. ఈ కాలమందు నీ బహుమానమును జ్ఞాపకము చేసికొని చిన్నచిన్న బహుమానములు ఇచ్చుచున్నాము. ఇది జ్ఞాపకార్ధము. నీ విచ్చినది గొప్ప బహుమానము.

“మనకు కుమారుడు అనుగ్రహింపబడెను” అని ప్రవక్త పలికెను. మమ్ములను కుమారులనుగా స్వీకరించు నిమిత్తము, ఈ ప్రేమ అంతస్థు నిమిత్తము నీకు వందనములు. ఆ కాలమున గొల్లలు, జ్ఞానులు, దూతలు చేసినంతగా స్తుతులు మేము చేయలేకపోయినను మా స్తుతులు అంగీకరింతువని నమ్మి స్తుతించుచున్నాము. మాకు చిక్కులు, ఇబ్బందులు బాధలు ఉన్నను నీ బహుమానమును మాకు నీ అత్మ ద్వారా జ్ఞాపకము చేయుము. ఆ బహుమానమును బట్టి మా హృదయములను పరమానందముతో నింపుమని వేడుకొనుచున్నాము.

లూకా 2: 1-20లో ఒక ప్రవచనము గలదు. ఆదికాండములోని యేసుప్రభువు యొక్క జన్మ ప్రవచనము చివరి గ్రంధమైన మలాకీ వరకు వచ్చెను. వీటన్నిటికి నెరవేర్పు క్రొత్త నిబంధనలోని ప్రభువు యొక్క జన్మము అయితే పై వాక్య భాగములోని ప్రవచనమేమి? “ఇది ప్రజలందరికి కలుగబోవు వర్తమానము” అప్పుడు వారికి మాత్రము సంతోషముగాని ఈ ప్రవచనములో “అందరికి” ని అని వ్రాయబడి యున్నది. ఇది దూత చెప్పిన ప్రవచనము. మనము క్రిష్ట్మసు పండుగ చేసిన సంతోషమే గాని అందరు చేసిన ఇంకా సంతోషము. ఆ కాలములో గొల్లలకు మాత్రమే ఈ సంతోషము, వారు పండుగ చేసినారు. ప్రభువుయొక్క జన్మవార్త కొందరికి మాత్రమే తెలిసినది. ఆ కొద్దిమంది సంతోషించి పండుగ చేసిరి. రానురాను బాలుడు పెద్దవాడైన తర్వాత పెంతెకొస్తు దినమునకు మూడు వేలు తయారైరి. “అందరికి” అనుమాట వినబడిన తర్వాత 1) వెళ్ళి చూచిన గొల్లలందరకు 2) గొల్లలు చెప్పిన అందరకు ఈ అందరు అయిన తరువాత 3) పన్నెండుమంది శిష్యులకు 4) తర్వాత 120 మంది ప్రభువుయొక్క అనుచరులకు 5) పెంతెకొస్తు దినమున మూడు వేలకు __ఈ గుంపులందరకు ఈ సంతోషము అందెను. ఈ ప్రకారముగ ప్రవచనము నెరవేరెను. పాత నిబంధన ప్రవచనము ఇంతటితో ఆగెను. ఎందుకనగా నెరవేరెను, కాని దూత చెప్పిన ప్రవచనము లోకాంతమువరకు వెళ్ళుచునే ఉండెను. ప్రవక్తల ప్రవచనము గొప్పదా? దూత చెప్పినది గొప్పదా? ప్రవచనము దూత చెప్పినది లోకాంతము వరకు ఉండును. అందరు అను మాటను బట్టి కొద్ధిమంది పండుగ చెయుచున్నారా? ఎక్కువమంది చేయుచున్నారా? ఎక్కువమంది చేయుచున్నారు గనుక మనము ఒంటరిగా చేయుటలేదు. ప్రభువు పుట్టి 1965 సంవత్సరములు అయినది. ప్రస్తుతకాలమున 1) క్రైస్తవులు 73కోట్లు. ఈ పండుగ చేయుచున్నారు గనుక అందరకు అని దూత చెప్పిన ప్రవచనము చాల వరకు నెరవేరుచున్నది.

లోకములోని ఇతర మతముల వారుకూడ ఈ పండుగ చేయుచున్నారు. గనుక దూత ప్రవచనము నెరవేరుచున్నది. మన సంతోషము మహాగొప్ప సంతోషము. 2) ప్రపంచములో గొప్ప దేశములు 50 ఉన్నవి. ముఖ్యమైనవి 30 దేశములు. అన్ని దేశములలో ఈ పండుగను చేయుచున్నారు. గనుక దూత ప్రవచనము నెరవేర్పు కనబడుచున్నది. 3) ఈ పమండుగను అన్ని భాషలు మాట్లాడువారు చేయుచున్నాౠ. దూత చెప్పిన అందరకు అనుమాట నెరవేరుచున్నది. 4) ఈ పండుగను అన్ని స్థలములలో నివసించుచున్నవారు చేయుచున్నారు. కొండలలో, అరణ్యములలో, సముద్రలమీద, లంకలలో, నదులమీద అన్ని స్థలములలోను చేయుచున్నారు. గనుక దూత ప్రవచము నెరవేరుచున్నది. దేవాలయములలో ఇండ్లలో, ప్రయాణములలో, బండ్లలో, అన్ని స్థలములలో ఈ మహాసంతోషము గలదు. అన్ని భాషలలోను ప్రకటింపబడుచున్నది గనుక దూత చెప్పిన ప్రవచనము నెరవేరుచున్నది.

ఎన్ని మతములలో ఈ సంతోషవార్త వ్రాయబడియున్నది. 1. యూదుల మతములో ఈ ప్రవచనము వ్రాయబడి యున్నది. పాత నిబంధన వారి గ్రంధము 2. క్రైస్తవ మత గ్రంధమగు క్రొత్తనిబంధనలో వ్రాయబడెను. 3. హిందూ మతములో కూడ గలదు (మీకా 5:2) నా ప్రజలు అనుటకు “ప్రజా” అని గలదు. “ఏలుటకు” “పతి” అని వ్రాయబడియున్నది. 4. బౌద్ధమత గ్రంధములోకూడ ఈ మహాసంతోషము గలదు. బుద్ధుడు చనిపోకముందు 12మందిని పిలిచి, నా తర్వాత 100 ఏండ్లకు ఒక మహానుభావుడు జన్మించును. గనుక ఆయనను వెంబడించుడి అని చెప్పెను. ఆయన పలికిన మాటలు ప్రభువునందు నెరవేరినవి. 5. మహమ్మదీయ మతములో అబ్రాహాము, ఇస్సాకు మొదలగువారి చరిత్ర గలదు. యేసుప్రభువు యొక్క చరిత్రకూడా అందులో గలదు. వారి గ్రంధములో ప్రభువు పేరు “ఈసా” అని గలదు. గనుక వారు గౌరవింతురు.

అన్ని ముఖ్య మతములలోను ఈ వార్తగలదు. వారందరికన్న మనకు ఎక్కువ దొరికెను. గనుక క్రైస్తవులు సువార్త ప్రకటించవలెను.

బర్మా దేశములోని కరెనేయులనువారు తమతమ గ్రంధమైన బౌద్ధమత గ్రంధము చదువుకొని ఆ గొప్పవారెవరని ఆలోచించుచుండగా మిషనెరీలు వెళ్ళి ప్రభువును గురించి బోధించగా వారి జాతి అంతా క్రైస్తవులైరి. వీరు పాడినట్లు ఆసియాలోని క్రైస్తవులెవరును పాడలేరు. బహు రమ్యముగా పాడుదురు. గొల్లలకు, ప్రభువు మనకొరకు పుట్టెనను సంతోషము మాత్రము గలదు. మనకు అన్ని విషయములలో వారికన్న ఎక్కువ సంతోషము గలదు. వారు ఒక గుంపు. మనము ఒక గొప్ప సైన్యము. పరలోక సైన్యసమూహము ఇంకా గొప్పది. ఇతర మతములలోని అభిమానులు గలరు. వారు ఒక సమూహము, దూత ప్రవచనము “అందరకు” అనునది ఈ సమూహము లన్నిటిలోను నెరవేరినది.

ఈ “అందరకు” అని చెప్పిన మహా సంతోషము చదువరులకు కూడా కలుగునుగాక!

Please follow and like us:
క్రిష్ట్మసు వర్తమానము
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply