క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఈష్టరు పండుగ
  5. ఈస్టరు పండుగ 7

ఈస్టరు పండుగ 7

మత్తయి 28:1-10; మార్కు 16:1-11; లూకా 24:1-12; యోహాను 20-1-18;

ప్రసంగ వాక్యము. యోహాను 9:16.

ప్రార్ధన:- యేసుప్రభువా! నీవు లేచినావు గనుక వందనములు. నీవు లేచినావు గనుక విశ్వాసులైన మృతులు కూడ లేచుకాలము వచ్చుచున్నది. నీవు మరణము నుండి లేచినావు. విశ్వాసులు కూడ మరణమునుండి లేచు కాలము వచ్చుచున్నది. నీవు లేచినావు గనుక విశ్వాసులు పాపము, శోధన, కష్టములలోనుండి లేచు కృప దయచేయుము. అన్నిటిలో నుండి లేచుటకు నీ పునరుత్థానము ఆధారము. లోకచరిత్ర అంతటిలో ఇది గొప్ప చరిత్ర. ఎప్పుడును జరుగలేదు. విశ్వాసులందరికి వారివారి కష్టములలో నుండి పునరుత్థానమగు కృప దయచేయుము. ఆమెన్.

సిలువ రోజు అనగా మంచి శుక్ర వారము అయిపోయినది. ఈ దినము ప్రభువు సమాధిలో ఉన్నాడు. అని చెప్పుకొనే రోజుకూడ అయిపోయినది. ఈ దినము ఈస్టరు దినము. శుక్ర వారము చనిపోయిన వర్తమానము, శని వారము సమాధిలో నున్న వర్తమానము ఈ దినము లేచిన వర్తమానము. ఈ దినము లేచుటకే శుక్ర వారము చనిపోవుట శనివారము సమాధిలో నుండుట. అవి లేకపోతే ఈ దినము రాదు. ఈ దిన వర్తమానము శుక్ర, శని వారములు కలిసిన వర్తమానము. శుక్ర, శని వారములలోని అవస్థలు తలంచుకొనవలెను. అప్పుడే ఈస్టరు వర్తమానము పొందగలము. ఉదా: పలాని దేశమును, పలాని రాజును జయించినామని వారి పేర్లు ఎత్తుట ఎందుకనగా జయమును గూర్చి చెప్పుటకే. శుక్ర వారము క్రీస్తుప్రభువును చంపిన వారి జాబితా 1. వాయుమండలములోని సాతాను. 2. భూమిమ్మిద చెలరేగిన దయ్యాలు. 3. దయ్యాలు రేపగా లేచిన శత్రువులు. 4. వారివల్ల కలిగిన అవమానములు. 5. వారివల్ల కలిగిన శరీర బాధలు (కొట్టుట, మేకులు, పొడుచుట మొ||) 6. వారందరి వలన కలిగిన మరణము. 7. వారందరి వలన కలిగిన సమాధి ఇవన్ని ఆదివారము రావలెను. వాటిపై జయము అని చెప్పుటకు తలంచవలెను. శుక్ర, శని వారములలో పై ఏడును జయించినట్లే కనబడును. అయితే ఆదివారము ఆయన వాటిని జయించెను. ముందు వాటి యొక్క జయము తర్వాత ప్రభువు యొక్క జయము. పై ఏడింటిని ముందు ఆయన జయించనిచ్చెను. తర్వాత ఆయన వాటిని జయించెను. ముందు వాటిని జయించనియ్యని యెడల ఆయన వాటిని జయించుటకు తరుణముండదు. జయించి ఆయన వాటికి శాశ్వతబాధ కలిగించెను. శత్రువులు ఏమని అనుకొనవలెను? యోహాను 9:16లో గ్రుడ్డివాడు స్వస్థత పొందెను. జనసమూహములో గొప్ప వివాదము పుట్టెను. యేసుప్రభువు పాపియైన యెడల గ్రుడ్డివానినెట్లు బాగుచేయగలడు అనిరి. మతాధికారులు ఇతడు దేవుని వలన పంపబడలేదు అనిరి. ప్రజలు ఇతడు పాపియైతే ఎట్లు బాగుచేయగలడు అనిరి. అదే ఈస్టరు వర్తమానము, శుక్ర వారము వారు ప్రభువుపై కొన్ని నేరములు మోపిరి. 1. ప్రజలను గవర్నమెంటు వారిమీదికి తిరుగబడ ప్రేరేపించుచున్నాడని ఆరోపించిరి. ఆయన నేర్స్థుడైతే సమాధిలో నుండి ఎట్లు లేవగలడు. పరిశుద్ధుడయిన లేవగలడు. ఈ సంగతి వారు తెలిసికొని మారుమనస్సు పొందవలసినది గాని వారు గ్రహింపలేదు. 2. యూదులకు రాజునని చెప్పుకొనెను. రోమా చక్రవర్తే వారి రాజు, ఈయన కాడు అనిరి. అదే నేరము. అదే నేరమైతే అంత గొప్ప నేరస్థుడు సమాధిలో నుండి లేవగలడా? సిగ్గుపడిపోడా? బయటికి వస్తాడా? అని గ్రహించుకొనవలసినది గాని వారు గ్రహింపలేదు. 3. ఆయన దేవుని కుమారుడనని చెప్పుకొనెను. మరియ కుమారుడు కాడా? గలిలైయుండు కాడా? అని వారు అనిరి. అదే నేరమైతే తిరుగుబాటు చేయించుచున్నాడన్న నేరము కన్న, రాజునని చెప్పుకొనే నేరముకన్న ఇంకా గొప్పనేరము. ఇంత గొప్ప నేరము కలవాడైతే ఎందుకు లేచును అని చెప్పుకొనవలసినది. ప్రజలు తెలిసికొన్నారు గాని మతాధికారులు తెలిసికొనలేదు. వారికి సత్యము తెలిసికొనుటకు ఇష్టము లేదు. పై మూడు నేరములు నిజమైతే అంత అద్భుత క్రియ జరుగునా? ఆయనను ఎవరూ లేపలేదు. తనంతట తానే లేచియున్నాడు. తిరుగుబాటు నేరము నుండియు, రాజు అన్న నేరము నుండియు, దేవుడన్న నేరము నుండియు కూడ పునరుత్థానుడాయెను. సమాధినుండి లేచుట అనగా ఈ మూడు నేరముల నుండి లేచుటయై యున్నది. క్రైస్తవులు తమ పాపములు తెలిసికొని విచారపడు చున్నారు. పాపములు విడచి బయటికి వస్తున్నారు. అదే పునరుత్థానము. ఎవరు ఇంకా పాపములో ఉండిరో వారికి ఈస్టరు దీవెన. పునరుత్థాన దీవెన లేదు. ఈ పండుగయొక్క దీవెన ఏమనగా లేవడము. వారు పాపములనుండి బయటికి వచ్చినట్లైతే ప్రభువు లేచినందు వలన వచ్చిన దీవెన కలుగును. ప్రభువునకు మరియొక జయము కూడా కలదు. అదేమనగా ఆయన సమాధిలో నున్నాడు. దేవుని కుమారుడు సమాధిలో నుండునా అనే ఆక్షేపణ గలదు. ఇప్పుడు ఆయన బయటికి వచ్చెను. గనుక సమాధిలోనికి ఎందుకు వెళ్ళవలెను? అను నేరము కూడ జయించెను. దేవుని కుమారునికి మరణము, సమాధి ఎందుకు? ఈ మరణము, సమాధి అనునవి రెండునూ నేరములే. ఆయన -మరణము నోటిలోనుండి వచ్చివేసెను. మరణము నుండి జీవనమునకు, భూమి లోపల నుండి భూమి మీదికి, ఉపరి భాగమునకు వచ్చెను. అదే జయము. ఆయన నేరముల నుండి, మరణము నుండి, సమాధి నుండి పునరుత్థానుడైనట్లు రేపు విశ్వాసులు కూడ వాటినుండి పైకి వచ్చెదరు. లోకములో పుట్టిన వారందరిలో అబ్రహాము గొప్ప విశ్వాసి అని బైబిలు విద్యార్ధులు చెప్పుదురు. అదే రీతిగా నేను మరణించినప్పటికిని, సమాధిలోనికి వెళ్ళినప్పటికిని మూడవ దినమున లేచెదను అనే నమ్మిక గల వ్యక్తి మరింత గొప్ప విశ్వాసి. విశ్వాసులలో ఎవరికిని ఈ రీతిగా జరుగలేదు. ఆయనకే జరిగెను. అవిశ్వాసులకు మరణమంటే మరణమే, సమాధి అంటే సమాధియే, విశ్వాసులకు మరణమనగా ఈ జీవితములో నుండి శాశ్వత జీవములోనికి పోవుట, సమాధి అంటే ఇంకొకదానిలోనికి పోవుట. విశ్వాసీ చావు అంటే లేవడము. రేప్చరునందు లేచుట విశ్వాసి నిరీక్షణ. విశ్వాసికి సమాధి విశ్రాంతి చోటు, సమాధాన చోటు, గనుక రాత్రి పండుకొని ఉదయము లేచినట్టే ఉండును. విశ్వాసులకు మరణము మరణము కాదు. సమాధి సమాధి కాదు. అవిశ్వాసికి నేరములు నేరములే. విశ్వాసికి లేనిపోని నేరములన్నియు మహిమయే, కీర్తియే, శుక్ర వారము ప్రభువునకు నేరాలు వచ్చినా, ఆది వారము ఆయన నేరస్థుడు కాడు. ఆయన లేచినాదు. అలాగే విశ్వాసికి ఈ నేరములు అనే ముప్పు మూడు రోజులే. రేపు లేస్తారు. ఇతరులన్నట్లు వారు నేరస్థులైతే రేప్చరునందు ఎందుకు పునరుత్థాన మొందెదరు?

ప్రభువునకు శ్రమలు, మేకులు, ప్రక్కలో పొడుచుట, విచారము, బాధ, సహింపు- ఇవన్నీ శుక్ర వారము కథ. విశ్వాసికిని శుక్ర వారమునాటి బాధ, శ్రమ, మూల్గుట ఉండును గనుక ఈ భూలోక బ్రతుకంత శుక్ర వారముతో పోల్చుట జరిగినది. రేప్చరు దినమందు ఏమియును ఉండవు. అప్పుడు సాతాను చూచి సిగ్గుపడును. ఎన్నినేరములు, బాధలు కలిగించినను ప్రభువు లేచినట్లు, కోటాను కోట్ల విశ్వాసులు రేప్చరు అగుట చూచి సాతాను సిగ్గుపడును. శత్రువులు గెత్సెమనే మొదలు సిలువ వరకు వచ్చినారు గాని పునరుత్థానమందు ఎవరును రాలేదు. ఆలాగే విశ్వాసికి శ్రమలు, అవమానము, మరణము, సమాధి ఉన్నప్పటికిని పునరుత్థానము వ్రాసియున్నది. అది జరిగే సమయములో జరుగును. వారి గురువునకు జరిగెను గనుక వారికి కూడ జరుగును. ఇక్కడ ఈస్టరు పండుగ బాగుగా చేసినా, రేపు రేప్చరులో పాలుపొందుదురు. ఏ విశ్వాసియు నేను సమాధిలో ఉందును అని అనుకొనడు. అవిశ్వాసియైతే మట్టిపాలగుదునని అనుకొనును. మీరు ఏ జాబితాలో ఉన్నారు? విశ్వాసుల జాబితా అయితే పునరుత్థానము. అవిశ్వాసుల జాబితా అయితే మట్టియే. పునరుత్థానము రేప్చరును సూచించును.

యేసు ప్రభువు యొక్క పునరుత్థానము, విశ్వాసుల పునరుత్థానమును సూచించును. పునరుత్థాన దీవెనయు, జయమును చదువువారందరికి కలుగును గాక!

Please follow and like us:
ఈస్టరు పండుగ 7
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply