క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఆరోహణ పండుగ
  5. ఆరోహణ పండుగ సంభాషణ

ఆరోహణ పండుగ సంభాషణ

1. ప్రశ్న: ప్రభువు సమాధిలోనుండి లేచిన తరువాత ఎంతకాలము భూమి మీద ఉన్నారు?

జవాబు: ఆయన పునరుత్థానుడైన తరువాత నలుబది దినముల పర్యంతము వారి కగుపడుచుండెనని వ్రాయబడి యున్నది.

2. ప్రశ్న: యేసుప్రభువు పునరుత్థానము తరువాత నలుబది దినములలో చేసిన పని ఏమి? జవాబు: ‘దేవుని రాజ్యవిషయములను గూర్చి బోధించుచుండెను ‘ అని వ్రాయబడియున్నది.

3. ప్రశ్న: ఆయన ఇంకేమి చేసిరి?

జవాబు: ‘ఆయన వారికి అనేక ప్రమాణమును చూపి ‘ తనంత టతానే వారికి సజీవునిగా కనబరచుకొనెను ‘ అని వ్రాయబడి యున్నది.

4. ప్రశ్న: ఆరోహణ సమయము నందు ప్రభువు ఇచ్చిన ఒక సలహా యేమి?

జవాబు: ఆయన – మీరు యెరూషలేమునుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రియొక్క వాగ్ధానము కొరకు కనిపెట్టుడని సలహా ఇచ్చెనని వ్రాయబడి యున్నది.

5. ప్రశ్న: ఆరోహణమునకు పూర్వము, శిష్యులను గురించి ఆయన ప్రవచించినదేమి?

జవాబు: “యోహాను నీళ్ళతో బాప్తిస్మము ఇచ్చెనుగాని, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు” అని ప్రభువు ప్రవచించినాడు.

6. ప్రశ్న: శిష్యులు యేసు ప్రభువును అడిగినదేమి?

జవాబు: ప్రభువా! ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా? అని అడిగెను.

7. ప్రశ్న: దానికి ప్రభువు ఇచ్చిన జవాబు ఏమి?

జవాబు: ‘కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు ‘ అని జవాబిచ్చెను.

8. ప్రశ్న: ఆయన ఇంకను ఏమి చెప్పినారు?

జవాబు: ‘వాటిని తెలిసికొనుట మీ పని కాదు’ అని ప్రభువు జవాబిచ్చెను.

9. ప్రశ్న: ఆయన ఇంకా ఏమి చెప్పినారు?

జవాబు: ‘అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు’ మీరు శక్తినొందెదరు’ అని ప్రభువు చెప్పినారు.

10.ప్రశ్న: వారు ఎటువంటివారు అగుదురని యేసు ప్రభువు సెలవిచ్చినారు?

జవాబు: మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములయందంతటను, భూదిగంతములవరకును నాకు సాక్షులైయుందురని ప్రభువు చెప్పినారు.

11. ప్రశ్న: ప్రభువు ఆరోహణమైనప్పుడు ఏమి జరిగెను?

జవాబు: అప్పుడు ఒక మేఘము వచ్చి, వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను.

12. ప్రశ్న: అప్పుడు శిష్యులు చేసినదేమి?

జవాబు: ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశమువైపు తేరిచూచుచుండిరి.

13. ప్రశ్న: అప్పుడు వచ్చినదెవరు?

జవాబు: అప్పుడు తెల్లని వస్త్రములు ధరించు కొనియున్న ఇద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచిరి.

14. ప్రశ్న: ఆ సమయమందు వారు పలికినదేమి?

జవాబు: గలిలయ మనుష్యులారా! మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసె, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారు చెప్పిరి.

Please follow and like us:
ఆరోహణ పండుగ సంభాషణ
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply