క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఆరోహణ పండుగ
  5. అవరారోహణము

అవరారోహణము

దావీదు కీర్తన 42:1-2; లూకా 7:33-38;ఎఫెసీ 1:17-23.

ఆరోహణ పండుగ ఆచరించిన విశ్వాసులారా! మీకందరకు రెండవ రాకడ ఆరోహణ భాగ్యము కలుగును గాక!

లక్ష్మివారమునాడు మనము ఆరోహణ పండుగ ఆచరించినాము. ఈ వేళ నా ఉపన్యాసాంశము ఆరోహణము కాదు గాని ‘అవరారోహణము ‘. దీనిలో రెండు కథలున్నవి. ఒకటి క్రిద నుండి పైకి పోయేది, రెండవది పైనుండి క్రిందికి వచ్చేది. క్రింద నుండి పైకి వెళ్ళేది ఆరోహణము. స్కూలులోని విధ్యార్ధులు మాస్టరు గారు చెప్పే ఈ రెండింటిని నేర్చుకొందురు.

1. పైన ఆకాశమున్నది. ఈ ఆకాశమునకు పైగా 2. పరిశుద్ధుల లోకమున్నది. 3. ఆ పైన దేవదూతల లోకమున్నది. ఈ మూడింటిని కలిపి ఆకాశమే అంటారు. అక్కడ దేవదూతల లోకము అనగా దేవ లోకము తరువాత లోకము, మూడవది పరిశుద్ధుల మోక్ష లోకము. నాల్గవది ఆకాశ మండలము. అనగా సూర్య, చంద్ర, నక్షత్ర లోకము.

అందుకనే ప్రభువును ఆకాశమందున్న మా తండ్రీ! అన్నారు. ఆ మూడు కలిసి సొలోమోను రాజుకూడా ఆలయ ప్రతిష్ట సమయమందు ఆకాశమందున్న తండ్రీ! అని ప్రార్ధన ఎత్తినాడు. 1. దేవ లోకాన్ని 2. దేవదూతల లోకాన్ని 3. పరిశుద్ధుల లోకాన్ని భూమి నుండి వేరుచేసి చెప్పుటకు ఆకాశమందున్న తండ్రీ! అని చెప్పిరి. కొన్ని మైళ్ళు పై నుండి వచ్చిన భూగోళముండును. దీనిలో చెట్లు, పక్షులు, జంతువులు, మనుష్యులు ఉన్నట్లు మనకు తెలుసును. ఆకాశము, భూమికి అన్నీ సప్లయి చేసే స్థలము. భూమికి సప్లయి చేయదు గాని ఆకాశము సప్లయి చెసేదంతా తినడము, త్రాగడము, అనుభవించడమే గనుక మనము ఆకాశమును గౌరవించాలి. సూర్యునిలోని కిరణాలు భూమికొరకే క్రిందికి వచ్చును. భూమికి ఆ కిరణాలు చలిలో వేడి పుట్టించుటకును, తక్కిన కాలములో పువ్వులకు రంగులద్దుటకును ఉపయోగపడును. ప్రపంచములోని ఏ రంగైనా సూర్యుని కిరణముల వల్లనే ఏర్పడుచున్నది. హిందూ గ్రంధములోని సంగతి: సూర్యునిలోనుండి ప్రతి దినము ఏడు రథాలు భూమి మీదకి వచ్చునని వారి గ్రంధములో వ్రాయబడి యున్నది. సూర్యునిలో ఏడు రంగులున్నవి. ఒక గాజు గ్లాసులో స్వచ్చమైన నీళ్ళు పోసి దానిని ఎండలో పెట్టిన ఏడు రంగులు గ్లాసు మీద కనిపించును. ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులు కనిపించుటకు కండ్లపై సన్నని బట్టవేసికొని చూచిన కనిపించును. సూర్యుడు అగ్నిని, రంగులను సప్లయి చేయుచున్నాడు. అందువలననే సూర్య బింబాన్ని దేవుడు మరుగు చేస్తే భూమి మీద అగ్ని ఉండదు. వెలుగు, అగ్ని, వేడి, రంగులు ఈ నాలుగు పై నుండి క్రిందకి వస్తున్నవి. అదే అవరారోహణము.

2. చంద్రుడు వస్తున్నాడు. ఈ కాంతి చల్లగా, హాయిగా నెమ్మదిగా నుండును. మనకు వేడి, చల్లదనము అవసరముగాన పైనుండి అవి భూమికి వచ్చును. ఇదియు అవరోహణము. చంద్రునివల్ల చల్లదనము, కాంతి, చీకటిని వెళ్ళగొట్టే శక్తి వస్తుంది.

3. నక్షత్రములు: అమావాస్యనాడు అంతా చీకటే. సూర్యుడు, చంద్రుడు ఉండడు. ఈ ఇద్దరు అమావాస్యనాడు ఉండరు గనుక నక్షత్రాలు వాటి కాంతిని భూమికి సప్లయి చేస్తున్నవి. నక్షత్రములయొక్క కాంతి భూమి మీదికి వస్తుంది. గనుక అమావాస్య రోజున కూడ కాంతి కనబడును.

4. వర్షము: 1. దాహశాంతి, 2. శుభ్రము చేయుట, 3. పొలములు పండుట. ఈ మూడు ముఖ్యపనులు వర్షము వల్లనే జరుగుచున్నవి. వర్షముకూడ పైనుండి క్రిందికి వస్తున్నది గనుక అదికూడా అవరారోహణము.ఉన్నారు. గనుక ఇదియు అవరారోహణమే.

5. పరలోకమునుండి దేవదూతలు మనలను కాపాడుటకు మన వద్దకు వస్తున్నారు. మనము వారిని చూడలేము. సుందర్ సింగు గారు ఇలా అన్నారు. మనమెందుకు దేవదూతలను చూడలేకపోతున్నాము? కారణము మనో నిదానము లేనందుననే, మనో నిదానముతో చూస్తే మీ దగ్గరున్న దేవదూతలను చూడగలరు. ఈ దినమే ప్రార్ధించి, దీక్షతో ఉన్నట్లయిన వారు కనిపింతురు. వీరును పైనుండి క్రిందికి వస్తున్నారు. గనుక ఇదియు అవరారోహణమే.

6. పరిశుద్ధుల లోకము: మనము మనో నిదానముతో ప్రార్ధన చేస్తే, వారు మన గదిలోనికి వస్తారు. సన్నిధి కూటములోనికి వస్తున్నారు. మీరు పిలిస్తే, ప్రభువునడిగితే, పలానివార్ని పంపు ప్రభువా అంటే, ప్రభువు సెలవిస్తే వారు వస్తారు. ప్రభువు పంపినపుడు వారు వచ్చి, కనబడి, మాట్లాడుదురు. ఆయన సన్నిధిలో ఉండి ఈ అనుభవము పొందండి. వీరును పైనుండి వచ్చెదరుగాన ఇదియు అవరారోహణము.

7. ప్రభువు పరలోకమునుండి బెత్లెహేములోకి, పశువుల తొట్టిలోకి రావడమే అవరారోహణము. సూర్య, చంద్ర, నక్షత్రములు, గాలి, వర్షం, దేవదూతలు, పరిశుద్ధుల వల్ల కలిగే మేలుకంటే, ప్రభువు రాకవల్లనే గొప్ప ప్రయోజనము. ఆయన రాక వల్ల, ఆయన అవతారములో అన్నియు ఇమిడి యున్నవి. పై నుండి వచ్చే వాటివల్ల యేయే మేళ్ళు కలుగుచున్నవో అవన్నియు ఆయన రాకడలో ఇమిడియున్నవి. గనుక దైవావతార పురుషుని కూచి తెలిసికొనగలిగితే ఇవన్నియు తెలిసికొనగలము. గనుక యేసుప్రభువు పైనుండి క్రిందకు రావడమే అవరారోహణము.

8. మనము గదిలో ప్రార్ధించుచున్నప్పుడు తండ్రి,కుమార, పరిశుద్ధాత్మలు వస్తున్నట్లు సన్నిధి కూటములే మనకు సాక్ష్యము. మీరు సన్నిధి నిబంధనల ప్రకారము సన్నిధి చేసి, ఈ అనుభవము పొందండి. దీనినే అవరారోహణమందుము. ఇంకొక్కటి మిగిలిపోయింది. అది పెంతెకొస్తు పండుగ. 1. పరిశుద్ధాత్మ తండ్రి 120 మంది మీదికి దిగివచ్చిరి. ఇదియు అవరారోహణమే. అపుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపుగా వచ్చిరి. పేతురు చేసిన ప్రసంగములో కార్యములు 2వ అధ్యాయములో, ప్రభువు తన ఆత్మను మా మీద కుమ్మరించెనని చెప్పెను. వర్షము తుంపర్లుగాను, చినుకులుగాను పడుచుండును. వర్షము కుమ్మరింపబడునట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి అప్పుడు కుమ్మరింపుగా వచ్చిరి. ఇప్పుడు విశ్వాసుల హృదయములలోనికి వచ్చును.

9. అగ్ని నాలుకలుగా వారి మీద వ్రాలి యుండెను. అగ్ని ఎప్పుడుండెనో అప్పుడే వెలుగు కూడా ఉండును. గనుకనే పరిశుద్ధాత్మను పొందినవారు వెలిగింపబడుదురని చెప్పుదురు. ఆత్మ మన మీద కుమ్మరింపబడగానే జ్ఞానము అధికమగును. చదివినందున జ్ఞానము రాదు. ఆత్మ వెలిగింపును బట్టియే వచ్చును. మొదటిగా యూదుల మీద ఆత్మ కుమ్మరింపబడెను. ఇప్పుడు క్రెస్తవులందరి మీదను కుమ్మరింపబడును. ఈ పది దినాలలోను ఆత్మ కుమ్మరింపును గూర్చిన ప్రసంగాలు చేస్తారు. ఆత్మ కుమ్మరింపు కూడ అవరావరారోహణమే.

10. యేసుప్రభువు వెయ్యేండ్ల పాలనకు భూమి మీదకు వస్తారు. రెండవ రాకడలో వెళ్ళిన పెండ్లికుమార్తెయు, భూమి మీదికి వచ్చిన ప్రభువును ఈ భూమి మీద వెయ్యేండ్లు పాలన చేస్తారు. అదియు అవరారోహణమే గనుక మీరందరు రాకడకు సిద్ధపడితే ఆయన భూమి మీదకి దిగివస్తారు. ఈ కొద్ది మాటలు పెంతెకొస్తు పండుగ దినము వరకు మీ హృదయములలో వెలుగును గాక! దీనికి మీరందరు మీ హృదయములలో ఆమెన్ అందురు గాక. ఆమెన్.

Please follow and like us:
అవరారోహణము
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply