బైబిలుమిషను – దైవశక్తి

3 students

తన ప్రజలను విడుదల చేయుటకు దేవుడు తన శక్తితో అనేక కార్యములు చేసెను. ఐగుప్తులో సాధారణ శక్తితో మొదలుపెట్టి(మాంత్రికులు కూడా చేయగల సూచక క్రియ – కర్రను పాముగా మార్చుట), మానవులు చేయలేని గొప్పకార్యములు చేసి బాధింపబడుచున్న జనమునకు తోడుగా నుండెను. బైబిలు గ్రంధము దైవశక్తిని ఆశ్రయించినవారికి కలుగు గొప్ప కార్యముల సంకలనము. దేవుని ఆనుకొని జీవించినవారికి సిద్ధపర్చిన గొప్పవిందు, దేవుని విడిచిన వారికి కలుగు నాశనము బైబిలులో రుజువులతో లిఖింపబడినవి.

దేవుడు, యేసుక్రీస్తుప్రభువు, పరిశుద్ధాత్మ నిరంతరము చేయుచున్న మేలును వివరించుటకు బైబిలు నిరంతరము పనిచేయుచున్నది. ఈ క్షణములో ప్రపంచములో ఎవరో ఒకరితో మాట్లడుచు సత్యమైయున్న ఆత్మను వెలిగించుచున్నది. ఈ ప్రపంచములో నిర్విరామముగా పని(మిషను) చేయుచున్న గ్రంధము బైబిలు. అందుకే దీనికి జీవగ్రంధమని పేరు.

నిర్గామకాండము 8:19 ప్రకారం “దేవుని వ్రేలు” అనగా దైవశక్తి. దీనిని బట్టి క్రైస్తవ్యం దీనస్థితిలో ఉన్నప్పుడు బైబిలుమిషను  దైవశక్తితో పనిచేయునని అర్థమగుచున్నది.

బైబిలు అనగా దైవవాక్యము(ప్రభువు చెప్పినది), మిషను అనగా కార్యాచరణ(చేయుట). దైవ వాక్యము కార్యరూపము దాల్చుటయే బైబిలుమిషను. దీనిలో దైవశక్తి ఉన్నది.

దైవశక్తి నాలుగు దశలలో కనబడుచున్నప్పటికి మూల సారాంశము ఒక్కటే.
“మానవశక్తి చేయలేని పనిని దైవశక్తి చేయును” అని దేవదాసు అయ్యగారు సూక్తి రూపములో చెప్పిరి. గొప్ప దైవ కార్యములయందు మనకున్న విశ్వాసము, సమర్పణ మనశక్తికి మించినదైతే అప్పుడు దేవుని వ్రేలు (దైవశక్తి) పనిచేయును. దైవశక్తి పనిచేయుటకు మనము చేయవలసిన పని ఒక్కటే, మనకున్నవి (ఉదా: మోషే కర్ర) దేవుడు అజ్ఞాపించిన విధముగా సమర్పించుకొనుటయే.

 1. విడుదల: వాగ్ధాన జనాంగ బంధకము – ఇది దైవశక్తి – నిర్గమ 8:19
 2. రక్షణ: సర్వలోక పాప బంధకము – పది ఆజ్ఞలు – నిర్గమ 31:18
 3. హెచ్చరిక: సంఘ శక్తిహీనత, మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ – దానియేలు 5:24
 4. కృప క్షమాపణ: వ్యక్తిగత పాపబంధకము: యేసుప్రభువు వ్రేలితో వ్రాయుట – యోహాను 8:6

ప్రభువు తనశక్తిని మానవశక్తికి అందించినపుడు వాడలేరు. ప్రార్థన పట్టుదల అవసరము.

దేవుడు బైబిలుమిషను ను తన వ్రేలితో వ్రాసి అయ్యగారికి బైలుపరచెను. అయితే దీని శక్తిని ఆశ్రయించని విశ్వాసులకు దొరుకు భాగ్యము శూన్యము.

నామకార్థము అనే బంధకములలో చిక్కుకున్న క్రైస్తవ్యాన్ని తన వ్రేలితో కదిలించడానికి దేవుడు బైబిలుమిషనును బైలుపరచెను. బైబిలుమిషను సంఘము నామకార్థమైతే దేవుని వ్రేలు మొదట ఆ సంఘముమీద పనిచేయును. విశ్వాసులు జాగురూకతతో శక్తిని ఆశ్రయించి జీవించుట మేలు.

లూకా 11:20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

నేడు మనయెదుట అనేక అధ్బుత మహిమ కార్యములు జరుగుచున్నవి. కాబట్టి దైవరాజ్య ఉనికిని కనిపెట్టు స్వభావము విశ్వాసికి కలదు.

దేవునికొరకు ఘనకార్యములు తలపెట్టిన విశ్వాసీ, బైబిలు చేయుచున్న పనిలో మమేకమై, దేవుడు ముందుగా సిద్ధపర్చిన సత్క్రియలను, నీతిక్రియలను చేయుటకు కావలసిన దైవశక్తికి ఆతిధ్యమిచ్చు హృదయమును నిర్మించుకొనుటకు ప్రభువు సహాయము చేయును గాక!

 

బైబిలుమిషను – దైవశక్తి
 • దైవశక్తి అనగా ఏమిటి?

  నిర్గామకాండము 8:18. శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా 19. శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి.

  No items in this section
 • దైవశక్తి దేనిలో దాగివుంది?

  యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి.

  No items in this section
 • దైవశక్తి పొందుకోవడం ఎలా?

  2 పేతురు 1:2. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచు...

  No items in this section
 • దైవశక్తితో క్రైస్తవ జీవెనవిధానము

  రోమీయులకు 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి..

  No items in this section

Instructor

User Avatar admin

Free

Leave a Reply

Scroll to top