బైబిలుమిషను మహాసభలు, 2019

పరిచయం:
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి. అనేక లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. పాల్గొనలేనివారు మరి ఎక్కువ ఆతురుతగా ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మొత్తం మీద 30లక్షలమంది కంటే ఎక్కువగా ఈ మూడురోజులు దైవసన్నిధిలో గడుపుతువుంటారు.

సభల అంతరంగ సృష్టి:
సభలు చూడడానికి వచ్చిన ఇతరులు, సభల బయటి ప్రాంగణంలో చిరువ్యాపారులు మొదలగు 50 వేలనుండి లక్షవరకు బయట గందరగోళంగా తిరిగే జనాలను పక్కనపెడితే, అసలైన విశ్వాసులకు కలిగే అనుభవమును గురించి ధ్యానిస్తే ఈ విషయాలు సాక్ష్యమిస్తాయి.
1. సభలో సభ: విశ్వాసి ఈ మహాసభలలో లీనమై ఉండగా వధువుసభ లో ఉన్నశ్రమ, సహనము, వేదన..లను రుచి చూపించడమే గాక దానికి తగిన ఆధరణ, మహిమ అంతస్థు ఏదోవొక రీతిగా అందించబడతాయి.
2. సృష్టిలో సృష్టి: బైబిలుమిషను గ్రౌండ్‌లో అంతకుముందు ఏ పందిరి ఉండదు.  ఈ 3రోజులకోసం బహు ఖర్చుతో సభా వాతావరణం కల్పిస్తారు. విశ్వాసి ఖాళీగా, ఏ ఆకాంక్ష లేకుండా వచ్చినా, అనేక అవసరాలతో వచ్చినాగాని ఈ సభలలో దేవుడు అంతరంగ విశ్వాసము, ఆశీర్వాదము, దీవెనను ప్రతీ హృదయములో సృష్టించి నూతనపరచడంతో విశ్వాసులు ఆనందముతో ఈ సంవత్సరాన్ని కొనసాగిస్తారు.

దేవుని సృష్టిని అంగీకరించుచున్నావా?
క్రైస్తవ జీవితం నిరంతర సృష్టి. మహాసభ నుండి వధువుసభకు, రక్తమాంస శరీరమునుండి మహిమశరీరమునకు చేర్చే విశ్వాస ఫ్యాక్టరీ ఈ మహాసభలు. దేవుడు తన అమూల్యమైన ప్రణాళికను అందించే ఈ వాతావరణంలో ఒక్క క్షణం ప్రార్థించి ప్రభువు అందించే నూతన హృదయమును అందుకొనుటకు సన్నిధిలో కనిపెట్టుట ఈ దినములలో అత్యవసరము. ఇప్పటివరకు కోల్పోయినవాటిని దేవునికి సమర్పించి(వాటి గురించి మర్చిపోయి) దేవుడు అనేక రెట్లుగా అందించబోవు నూతన సృష్టికి వారసులమగుటకు సిద్ధపడుట దైవ ప్రణాళిక.

ప్రపంచ వ్యాప్తముగా బైబిలుమిషను బోధల పరిమళాన్ని, విశ్వాస జీవనశైలిని పరిచయం చేయుటకు ఆయత్తపడుదము. దేవుడు తన ప్రణాళికను తానే స్వయముగా ప్రత్యక్షపరుచునుగాక! ఆమేన్.

All the best for Bible Mission Meetings 2019.

బైబిలుమిషను మహాసభలు, 2019
Scroll to top