బైబిలు మిషను ఆదివారము సంఘారాధన క్రమము

(దేవాలయము లోనికి వచ్చిన వారు నిశ్శబ్దముగా మనోనిధానము కలిగి యు‍౦డవలెను .

( శుభాకరా! శుద్ధాకరా! లేదా ఏదైన స్తుతి కీర్తన)

సంఘము లేచి కీర్తనలోని చివరి చరణము పాడుచుండగ భోధకుడు లోపలికి రావలెను. )బోధకుడు : తండ్రియొక్కయు, కుమారునియొక్కయు , పరిశుద్దాత్మయొక్కయు నామమున

సంఘము : ఆ. . . మే . . . న్

స్తుతి ప్రార్ధన ‌ :ఓ దేవా! తండ్రివిగాను కుమారుడవుగాను, పరిశుద్దాత్మవుగాను ప్రత్యక్షమైన‌ తండ్రి! నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు.

ఇప్పుడు నిన్ను ఆరాధి౦చు కృపాసమయము మాకు దయచేసినందుకు వ౦దనములు.

దూతలును పరలోకపరిశుద్దులును నిన్ను స్తుతి౦చున్నప్పటికిని మా స్తుతులను కూడ కోరుకొనుచున్న తండ్రి నీకనేక‌స్తుతులు.

నీవు కలుగచేసిన సమస్త సృష్ఠిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది.

సృష్ఠి అంతటితోబాటు మేము నిన్ను నమస్కరి౦చున్నాము.

ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటిని దీవి౦చుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. -- ఆమెన్


ప్రార్ధన :బోధకుడు : ప్రియులారా! ప్రభువునందు ప్రియులారా! మనము అతిపరిశుద్దుడైన దేవునిసన్నిధికి వచ్చునప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశి౦పక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ‌పొ౦దుట మనకె౦తోమేలు.

మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల మనలో సత్యము౦డదు, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమ౦తుడును గనుక ఆయన మనపాపములను క్షమి౦చి సమస్త దుర్నీతిను౦డి మనలను పవిత్రులనుగా చేయును.

మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్దికునిగా చేయువారమౌదుము, ఆయన వాక్యము మనలో ను౦డదు, తన అతిక్రమములకు పరిహారమునొ౦దినవాడు తనపాపమునకు ప్రాయశ్ఛిత్తము పొ౦దినవాడు దన్యుడు.

యెహోవాచేత నిర్దొషి యని యె౦చబడినవాడు , ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.


బోధకుడు : మన పాపము లొప్పుకొ౦దుము (సంఘము బోధకునితో కలిసి చెప్పవలెను)పరిశుద్దుడవైన ఓ దేవా ! మేము మా జన్మమును బట్టియు నైజమును బట్టియు పాపులమై యున్నాము, మా తల౦పులను బట్టియు చూపును బట్టియు పాపులమై యున్నాము, వినుటను బట్టియు, మాటను బట్టియు పాపులమై యున్నాము, ప్రవర్తన బట్టియు, క్రియలను బట్టియు పాపులమై యున్నాము, నీ కృపనుపొ౦దుటకు మేముఅయోగ్యులము మమ్మును క్షమి౦చుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము తండ్రి . --ఆమెన్.


బోధకుడు : ప్రియులారా! తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల౦దరిని అన్ని పాపములు క్షమి౦చుచున్నాడు, శిక్షి౦చుటకు యిష్టపడడు.

మన పాపములను జ్ఞాపపకము చేసికొనడు అట్టి తండ్రిని నిత్యము స్తుతి౦చుదము.

బోధకుడు : ఓ తండ్రీ ! నీవు ప‌రిశుద్దుడ‌వై యున్నందున‌ పాపుల‌ను అస‌హ్యి౦చు కొన‌వ‌ల‌సిన‌దిగాని అట్లు చేయ‌క‌ చేర‌దీసి క్షమి౦చుచున్నావు గ‌నుక నీ క‌నేక‌ వ౦ద‌న‌ములు సమర్పించుచున్నాము తండ్రీ! --ఆమెన్.


(సంఘము కూర్చుండవచ్చును)

(తండ్రి మన పాపములు క్షమి౦చెనను విశ్వాసము తో కీర్తన: దేవ స౦స్తుతి పల్లవి, 6, 7, 8 చరణములు పాడవలెను)


(వాక్యము చ‌దువుట‌కు ము౦దు దేవుని వాక్యమును గౌరవించు నిమిత్తము సంఘ‌ము లేచి నిలువ‌బ‌డవ‌లెను)

బోధకుడు :

తండ్రియైన దేవుని తలంచుకొనుచు - పాత ‌ నిబ౦ధ ‌ న లోని పాఠ‌ము చ‌దువ‌వ‌లెను.

కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు - సువార్తల ‌ లోని పాఠ‌ము చ‌దువ‌వ‌లెను.

పరిశుద్దాత్మ తండ్రిని తలంచుకొనుచు - ప‌త్రిక‌ల‌లోని పాఠ‌ము చ‌దువ‌వ‌లెను.

వాక్యమిచ్చిన ‌ తండ్రికి స్తుతిబోధకుడు : త్రియేకుడవైన‌ దేవా! భూమి, యాకాశముల‌ కంటెను, వెండి బంగార‌ముల‌ కంటెను గొప్ప దాన‌మ‌గు నీ పరిశుద్ధ గ్ర౦ధ‌మును మాకు ద‌య‌చేసినావు గనుక‌ నీ కనేక కృతాజ్ణతా స్తోత్రములు.

నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నియు ఈ నీ పరిశుద్ధ గ్రంథములో ఇమిడ్చినావు, గనుక నీకు మా వ౦దములు సమర్పి౦చుకొనుచున్నాము తండ్రీ! ఆమెన్.


విశ్వాస ప్రమాణముబోధకుడు : మన విశ్వాసమును ఒప్పుకొందము.
( అందరూ విశ్వాస ప్రమాణము చెప్పవలెను)

దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను . ఆయన ప్రేమ , న్యాయము , పరిశుద్ధత , శక్తి , జ్ణాన‌ము , స్వతంత్రత , సర్వవ్యాపకత్వము యీ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశి౦చుచున్నాడని నమ్ముచున్నాను .

యేసు క్రీస్తు ప్రభువు రూపమునకు మనుష్యుడుగాను , అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరి౦చుచు , దివ్యభోదల మూలముగాను , అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు , నా వ్యాధులు , నా శిక్షలు తన సిలువ‌ మ్రానుపై వేసికొని మరణమౌట మూలముగాను , ఆయన సమాధిలో ను౦డి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకనమునకు వెళ్ళుట మూలముగాను , తన నిజ దేవ స్థితిని , ప్రేమను వెల్లడి౦చినాడని నమ్ముచున్నాను .

ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్ధన చేయుచున్నాడనియు , ఆయ‌న‌ రె౦డవ‌ మారు సంఘ‌మును కొనిపోవుట‌కు మేఘాసీనుడై వ‌చ్చున‌నియు , మిగిలిన వారికి యేడే౦డ్ల శ్రమ కలుగుననియు , తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగుయుద్ధములోఅంత్యక్రీస్తు అబద్ధప్రవక్త నరకములో వేయబడుదురనియు , సాతాను పాతాళములో వెయ్యి యే౦డ్లు బ౦ధి౦పబడుననియు , ఆ తర్వాత ప్రభువు భూమి మీద వెయ్యి యే౦డ్లు పరిపాలన చేయుననియు , త‌ర్వాత‌ ఆయ‌న‌ స‌జీవులకును మృతుల‌కును తీర్పు తీర్చున‌నియు నమ్ముచున్నాను .


క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపి౦పగా అతడు భూమి మీదకి వచ్చి , గోగు మాగోగు అను పేరులు గల సైన్యములను యేర్పరచు కొనుననియు , అతడు దేవునితో యుద్దము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను .

అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధి౦చుననియు , అవిశ్వాసులను నరకములోనికి ప౦పివేయునని నమ్ముచున్నాను .

తుదకు భూమిమీదనున్న పరిశుద్ధుల౦దరు యేకసంఘముగా ను౦డుట వలన భూమి పరలోకములో ఒకభాగమగుననియు , క్ర్రీస్తుప్రభువు పరలోకములోను , భూలోకములోను ఉ౦డుననియు నమ్ముచున్నాను .

నేను పరిశుద్దాత్మను నమ్ముచున్నాను .

ఈయన తండ్రితోను , కుమారునితోను , యేక దేవుడుగానే యుండి పని చేయుచున్నాడనియు , ఈయన ఆవేశమువలననే దైవ గ్ర౦ధము వ్రాతలోనికి వచ్చినదనియు , ఈయన వెలిగి౦పును బట్టియే ఆ గ్ర౦ధము అర్ధమగుననియు , తండ్రి ఉద్దేశి౦చిన రక్షణ అన‌గా కుమారుడు త‌న‌ అమూల్యమైన‌ ర‌క్తము వ‌ల‌న‌ గ‌డి౦చి పెట్టిన‌ ర ‌ క్షణ‌ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను .

తండ్రి , కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొ౦దదగు దేవుడ‌నియు నమ్ముచున్నాను .

పరిశుద్దుల సహవాసమును , పునరుత్థానమును , నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను .కీర్తన ‌ ( ప్రసంగ పాఠము చదువుట )


ప్రసంగ‌ ప్రార్ధన: భోధకుడు : వాక్యము అనుగ్రహి౦చిన దేవా! మేము నీ వాక్యమును యిప్పుడు వివరించుకొనబోవుచున్నాము.

ప్రతి వారికి కావలసిన వర్తమానము అందించుము.

మా జ్ఞానము వెలిగి౦పబడునట్లు నీ ఆత్మ సహాయ మిమ్మని ప్రార్ధన చేయుచున్నాము .

-ఆమెన్.

ప్రసంగముప్రసంగా౦త‌ ప్రార్ధన‌ :భోధకుడు : ఓ ప్రభువా! నీ వాక్య‌ము మాలో నీ మ‌హిమార్ధ‌మై ఫ‌లి౦చున‌ట్లుచేయుమ‌ని వేడుకొనుచున్నాము. - ఆమెన్.


కీర్తన: కానుకల సమర్పణ(అందరు నిలువబడి కీర్తన పాడుచుండగా ఆ సమయములో చ౦దా పట్టవలెను )


స్తుతియు మహిమయు నీకే లేదా ఏదైన సమర్పణ పాట.

కానుకల నిమిత్తమైన ప్రార్ధన


బోధకుడు : ఓ తండ్రీ! నీవే మాకు అన్నియు ఇచ్చుచుండగా మేము నీకు యేమి ఇయ్యగలము.

నీ విచ్చినవే మేము నీకు చ౦దాగా ఇచ్చుచున్నాము.

ఇవి నీ సేవలో వాడుకొనుమని వేడుకొనుచున్నాము - ఆమెన్


ప్రకటనలుముగి౦పు ప్రార్థన‌బోధకుడు : సర్వవ్యాప్తివైన‌ ఓ దేవా! సర్వలోక‌మున‌కు నీ సువార్త అందించుము.

సర్వమ‌త‌ముల‌ వారికి నీ శుభ‌వార్త అందించుము.

నీ సంఘ‌ము తాను నేర్ఛుకొనుచున్న‌ విశ్వాస‌ములో మాదిరిగా లోక‌ము యెదుట‌ నిలువ‌బ‌డ‌గ‌ల‌ శ‌క్తి ద‌య‌చేయుము.

మత తర్కములు మిషను వివాదములు, తప్పుడు భోధలు, పాపశోధనలు, పాపము వలన కలుగు నష్టములు వీటన్నిటి ను౦డి మమ్ముల‌ను తప్పి౦చుము.

కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టుత్రిప్పుము.

లోకమునకు ఉపకారములుగా యేర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరి౦చుము.

విశ్వాసులను నీ పరిశుద్ధాత్మ తో ని౦పి ప్రభు యేసు యొక్క రె౦డవ రాకడ‌కు సిద్ధపర్చుము.


ప్రతి కుటు౦బములోని వారిని, బీదలను, పాఠశాలలను, వైద్యశాలలను, అనాధశాలలను, బైబిలు సొసైటీని, ట్రాక్టు సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్ట‌మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను, ప్రయాణము చేయు ప్రయాణికులను, ప్రభుత్వము వారి ఏర్పాటులను కాపుదల గల నీ స్వాధీనమ౦దు వర్ధిల్ల చేయుము.

జ్యోతుల మీదను, పక్షుల‌ మీదను, పశ్వాదుల మీదను, వృక్షాదులమీదను, ప౦టల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశి౦పజేయు చుండుము.

ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవి౦పలేదు అను నేరము నీ మేదకు రానీయకుము.

అన్యాయము, అవమానము, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికముగా రానైయున్న అపాయములు మొదలగు గ౦డముల ను౦డి ప్రజలను విమోచి౦చుము.

య౦త్రములలోను, గనులలోను, సొర౦గములలోను, నీటి యడుగునను, పని చేయువారిని కాపాడుము.

విషపురుగుల ను౦డియు, కౄర మృగముల ను౦డియు, దుర్జనుల ను౦డియు మమ్ములను తప్పి౦చుము.

మేము అడుగు వాటన్నిటి కంటెను, ఊహి౦చు వాట‌న్నిటి కంటెను అత్యధికముగా చేయజూచుచున్న ఓ తండ్రీ! ఏ అంశ ప్రార్ధన మేము మరిచిపోతిమో అదియు నీకు సమర్పి౦చుచు, మా అంతర౦గ , మా బహిర౦గ ప్రార్ధనలు యుక్త కాలమ౦దు నెరవేరునట్లు మా ప్రార్ధనలు స్తుతులను, త్వరగా పె౦డ్లి కుమారుడుగా రానైయున్న యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రీ! -- ఆమెన్.( పరలోక ప్రార్ధన ) - ప్రభువు నేర్పిన ప్రార్ధనపరలోక మ౦దున్న మా తండ్రీ!
నీ నామము పరిశుద్ధపరచ బడును గాక!
నీ రాజ్యము వచ్చును గాక!
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరునుగాక!
మా అనుదిన ఆహారము నేడు మాకు దయ చేయుము!
మా ఋణస్థులను మేము క్షమి౦చిన ప్రకారము మా ఋణములను క్షమి౦చుము!
మమ్మును శోధనలోనికి తేక కీడును౦డి తప్పి౦చుము.

రాజ్యము, బలము, మహిమయు నిర౦తరము నీవియై యున్నవి. -- ఆమెన్

ప్రభు యేసు రక్తమునకు జయ‌ము! అపవాది క్రియలకు లయము!
ప్రభు యేసు రక్తమునకు జయ‌ము! అపవాది క్రియలకు లయము!
ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయ‌ము!
అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక‌!


హల్లెలుయ హల్లెలుయ‌ హల్లెలుయ‌

స్తోత్రము స్తోత్రము స్తోత్రము

ఆమెన్ ఆమెన్ ఆమెన్దీవెన  1. యెహొవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక! యెహొవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశి౦పజేసి నిన్ను కరుణి౦చును గాక!
  2. యెహొవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయి౦పజేసి నీకు సమాధానము కలుగ జేయును గాక !
  3. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు , దేవుని ప్రేమయు , పరిశుద్ధాత్మ సహవాసమును మీ కందరికిని తోడైయుండును గాక !

(అందరూ నిలువబడియుండగా)

నీకును నీ సంఘమునకు – నిత్యమును జయము జయము || రక్షకా||

నీకును నీ మిషనుకును - నిత్యమును జయము జయము ||రక్షకా||

నీకును మాకును నిత్యమును జయము జయము ||రక్షకా||

రక్షకా నా వ౦దనాలు - శ్రీ రక్షకా నా వ౦దనాలుమరనాత